అమరావతి(చైతన్యరథం): అధికారం కోల్పోతున్నామన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేష్‌పై దాడిని అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండిరచారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు గత ఐదేళ్లుగా వైసీపీ రౌడీ మూకలు.. ప్రజలు, మీడియాపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. రమేష్‌పై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టులపై దాడులు చేసిన వారిని వదలే ప్రసక్తే లేదు. పోలింగ్ ముగిసిన సాయంత్రానికే జగన్ లండన్ పారిపోతాడు. జగన్ అండతో రెచ్చిపోతున్న వైసీపీ గూండాల పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. కూటమి అధికారంలోకి వచ్చాక జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
ఓటమి భయంతో ఫ్యాక్షన్ దాడులు: లోకేష్
అమరావతి(చైతన్యరథం): వైసీపీ నేతలు ఓటమి భయంతో ఫ్యాక్షన్ దాడులకు దిగుతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేష్‌పై వైసీపీ గూండాల దాడిని లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. ఓటమి తప్పదని అర్థమైన జగన్ రెడ్డి.. మీడియా ప్రతినిధులపై ఫ్యాక్షన్ దాడులకు బరితెగిస్తున్నాడని దుయ్యబట్టారు. మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
ఈనాడు కంట్రిబ్యూటర్‌పై దాడి
చితకబాది ఫోన్ లాక్కెళ్లిన వైసీపీ మూకలు
అనంతపురం: సీఎం జగన్ రోడ్‌షోలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈనాడు కంట్రిబ్యూటర్ రమేష్‌పై వైసీపీ గూండాలు దాడిచేసి విచక్షణారహితంగా చితకబాదాయి. కళ్యాణదుర్గంలో జగన్ రోడ్ షో తర్వాత, రమేష్ పట్టణంలోని వాల్మీకి కూడలి నుంచి వెళ్తుండగా అకస్మాత్తుగా వైసీపీ మూకలు దాడి చేసి విపరీతంగా కొట్టారు. అంతటితో ఆగకుండా రమేష్ ఫోన్ లాక్కెళ్లారు. పేలవంగా సాగిన జగన్ రోడ్‌షో దృశ్యాలను రమేష్ ఫోన్‌లో చిత్రీకరించాడు. జగన్ రోడ్‌షోకి జనం తక్కువగా రావటాన్ని జీర్ణించుకోలేని అక్కసుతో రమేష్‌పై వైసీపీ శ్రేణులు దాడిచేసి ఫోన్ లాక్కెళ్లారు.