- రప్పారప్పా నరుకుతారని భయపడుతున్నారు
- జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
నర్సాపురం(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా 269 అన్న క్యాంటీ న్‌లలో చంద్రబాబు రోజుకు 5 లక్షల మందికి ఐదు రూపాయలకే పేదల కడుపు నింపుతు న్నారు..అటువంటి అన్న క్యాంటీన్లను రద్దు చేసిన జగన్‌కు పార్టీని నడిపే హక్కు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. నర్సాపురం పార్లమెంట్ పరిధి లోని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులతో మంత్రి ఆత్మీయ సమా వేశం నిర్వహించారు. అన్న క్యాంటీన్‌లను జగన్ నిలిపివేస్తే దాత లు ముందుకొచ్చి అన్నం పెడితే కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఐదేళ్లు అన్నం పెట్టకపోగా అన్నదానం చేసిన వాళ్లపై కేసులు పెట్టి వేధించారు. పేదవాడు కడుపునింపని, మానవత్వం లేని జగన్ మనకు అవసరం లేదు. జగన్ అరాచకత్వం, విధ్వంస రాజకీయా లే ఎజెండాగా మార్చుకున్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగు తున్న అభివృద్ధిని అడ్డుకోవడం, ప్రజలను రెచ్చగొట్టడం, అపోహ లు సృష్టించడం జగన్ రాజకీయ విధానంగా మారిపోయింది. జగన్ తప్పు దారిలో అధికారంలోకి వస్తే తమ కుటుంబాలను కోల్పోయే పరిస్థితి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు. జగన్ అధికారంలోకి రాకుండా గొడ్డలి పార్టీని శాశ్వతంగా సమాధి చేయాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కూటమి ప్రభుత్వం మానవత్వంతో పనిచేస్తుంటే, జగన్ గొడ్డలి పార్టీ రాక్షసత్వంగా హింసా వాదాన్ని పెంచుతోందని మండిపడ్డారు. వైకాపా పేరును ప్రజలు మర్చిపోయి గొడ్డలి పార్టీగా పిలుచుకుంటున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలన్నా జగన్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు.
మహిళా ద్రోహిగా కాంగ్రెస్, విపక్షాలు
దేశంలో కాంగ్రెస్ కూటమి, విపక్షాలు మహిళా ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతాయి మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయే టట్టు చేయటం విపక్షాల వినాశనానికి నాంది. దేశ జనాభాలో సగ భాగం ఉన్న ఆడపడుచులను చట్టసభలకు తీసుకువచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడమంటే కాంగ్రెస్ కూట మికి మహిళలపై వివక్షతకు చిన్న చూపుకు ప్రత్యక్ష నిదర్శనం. సమాజంలో జనాభాలో సగమైన మహిళలకు న్యాయం జరిగేలా మహిళా రిజర్వేషన్ బిల్లుకు చంద్రబాబు మద్దతు పలికారు. దేశస్థాయిలోనే మహిళల మనోభావాలకు ఒక ఉద్యమ రూపం కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మహిళా బిల్లు విష యంలో విపక్షాల వైఖరిని ఎండగడుతూ నిడదవోలులో చంద్ర బాబు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కుతో పాటు రాజకీయ రిజర్వేషన్ కల్పించింది ఎన్టీ ఆర్. ప్రపంచంలోనే తొలిసారిగా డ్వాక్రా సంఘాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసి మహిళలకు ఆర్థిక సాధికారతను చంద్రబాబు తీసుకువచ్చారని వివరించారు.













