- డ్వాక్రా రుణంతో వ్యాపారం చేస్తూ నిలదొక్కుకున్నాం
- రేపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ముఖాముఖిలో
- డ్వాక్రా మహిళ జేజమ్మ, భర్త శ్రీనివాసరావు ఆనందం
- లబ్ధిదారు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం
రేపల్లె(చైతన్యరథం): స్వయం సహాయక సంఘాల ద్వారా అందుతున్న రుణాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. డ్వాక్రా రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహంతో చిన్న వ్యాపారాలను ప్రారంభించి వాటిని క్రమంగా విస్తరించుకోవచ్చని సూచించారు. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రేపల్లెలోని 4వ వార్డులో శ్రీలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్‌ను సందర్శించి దుకాణా యజమాని జి.జేజమ్మతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. డ్వాక్రా రుణంతో కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తున్నామని జి.శ్రీనివాసరా వు, జి.జేజమ్మ దంపతులు వివరించారు. 2003 నుంచి పెయిం టర్గా పనిచేస్తున్నానని శ్రీనివాసరావు వివరించారు. 2025 ఫిబ్ర వరిలో రూ.లక్ష పెట్టుబడితో చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసుకు న్నామని, అదే ఏడాది జూన్‌లో రూ.2 లక్షల గ్రూప్ లింకేజీ రుణం లభించడంతో వ్యాపారాన్ని కొంత విస్తరించినట్లు వారు తెలిపారు. సాంకేతికతను సైతం వినియోగించుకుంటూ తమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్మార్ట్‌ఫోన్, వాట్సాప్ ద్వారా వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుంటూ కిరాణా సరుకులు తన భర్త ఇళ్లకు వెళ్లి అందజేస్తున్నట్లు జేజమ్మ తెలి పింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రె న్యూర్ కార్యక్రమం తనకు ఎలా స్ఫూర్తి ఇచ్చిందో వివరించారు.
వ్యాపార నిర్వహణపై సీఎం దిశానిర్దేశం
తమ వ్యాపార ఆలోచనలు, అనుభవాలు, భవిష్యత్ ప్రణాళిక లను డ్వాక్రా మహిళలు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో ఉన్న వ్యాపార అవకాశాలను మహిళలు అన్వేషించి స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సీఎం వారికి సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వాట్సాప్ బిజినెస్‌పై ఉన్న అవగాహనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీని వాసరావు తండ్రి వెంకటరావుకు వృద్ధాప్య పింఛన్‌ను అందజే శా రు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలతో కలిసి చంద్రబాబు ఫొటో దిగారు.














