విజన్ పాలిటిక్స్‌కు నాంది తెలుగుదేశం
పీకలు కోస్తున్నా జెండాను వదలని
పసుపు సైనికులు పార్టీ సొంతం
చంద్రయ్య స్ఫూర్తి కలకాలం నిలుస్తుంది
టీడీపీ ఎన్నికల కోసం కాదు..నెక్ట్స్ జెనరేషన్ కోసం
జెన్‌జీ, జెన్ ఆల్ఫాకు విస్తృత అవకాశాలు
ఐదేళ్లూ విధ్వంసం చేస్తే రెండేళ్లలో గట్టెక్కించాం
రక్తచరిత్ర రాసేవాళ్లు స్వర్ణాంధ్ర చరిత్ర రాయలేరు
గొడ్డలి పార్టీకి గోల్ లేదు..అదొక అడ్డగోల్ బ్యాచ్
తెలుగుజాతి కోసం పునరంకితం అవుదాం
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
2024 రిపీట్ అయ్యేలా మమేకం అవుదాం
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం
ప్రభుత్వ విజయాలు వివరిస్తూ పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం
మహిళల పోరాటాలకు గౌరవంగా మహానాడు అంకితం
అమరావతి(చైతన్యరథం): ఎన్నికల కోసం కాదు..భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్న పార్టీ తెలుగుదేశం.. గత పాలకులు రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే రెండేళ్లలో రాష్ట్రాన్ని గట్టెక్కించి, వ్యవస్థ లను గాడిలో పెట్టి ఏపీ బ్రాండ్ ఇమేజ్ తిరిగి తీసుకువచ్చామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. వెంటిలే టర్‌పై ఉన్న రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేలా రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పనిచేసిందని చెప్పారు. పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముం దుకువెళుతున్నామని వివరించారు. మహిళల సాధికారత, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు అవకాశాలు, ప్రతి ఎకరానికి సాగునీరు, అద్భుత రాజధానిగా అమరావతి నిర్మాణం, పేదవారికి సైతం అత్యుత్తమ వైద్యం, అందరికీ చదువు, అసమానతలు రూపు మాపడం, స్వర్ణాంధ్రను సాధించడమే టీడీపీ లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఇచ్చిన అఖండ విజయానికి సంక్షేమం-అభివృద్ధి-సుపరి పాలనతో రుణం తీర్చుకుంటున్నామని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా బుధవారం జరిగిన హైబ్రిడ్ మహానాడు సభలో ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు వివరి స్తూ పార్టీకి దిశా నిర్దేశం చేశారు. రెండురోజుల పాటు సాగే వర్చు వల్ మహానాడుకు భారీ స్పందన వచ్చింది. మహానాడు ప్రారంభ సమయంలోనే భారీగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
కార్యకర్తల్లో జోష్ తగ్గలేదు
జై తెలుగుదేశం నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన అధినేత చంద్రబాబు వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందేమో..కార్యకర్తల్లో జోష్ తగ్గలేదని ఉత్సాహపరిచారు. అన్ని క్లస్టర్లను అనుసంధానించి మహానాడును నిర్వహించుకుం టున్నాం. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా మహా నాడును ఈసారి హైబ్రిడ్ పద్దతిలో జరుపుతున్నామని చెప్పారు. మీటింగ్ మోడల్ మారిందే తప్ప..మహానాడు విధానం మారలేదని తెలిపారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఆవిర్భవించిన తెలుగుదేశం విజన్ పాలిటిక్స్‌కు రూపం ఇచ్చింది. జాతీయ జెండా దేశానికి గౌరవం, పసుపు జెండా తెలుగువారి ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసంగా అభివర్ణించారు. ప్రతిఒక్కరికీ తెలుగుదేశం జెండా చూస్తేనే నమ్మకం, ధైర్యం, భరోసా కలుగుతుందన్నారు. నాటికి, నేటికీ తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఆదరణ మాత్రం చెక్కు చెదరలేదన్నారు. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా ప్రజల కోసం 45 ఏళ్లుగా టీడీపీ పోరాటం చేస్తూనే ఉంది. నరహంతకులు పీకలు కోస్తున్నా.. టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం జెండాను వదలకుండా అభిమానం చూపారు. చంద్రయ్య లాంటి కార్యకర్తను ప్రత్యర్థి పార్టీల వారు నరుకుతున్నా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినదించి అమరుడయ్యారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తి కలకాలం నిలు స్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో తనను కూడా అక్రమంగా జైల్లో పెట్టారు..లోకేష్ యువగళాన్ని అడ్డుకున్నారు.. ఎంతోమంది పార్టీ నేతలు`కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేశారని వివరించారు. బాధితులనే నిందితులుగా చేసినా ఏ టీడీపీ నాయకుడూ, కార్యకర్తా వెనకడుగు వేయలేదని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసే నతో కలిసి కూటమిగా ఏర్పడ్డాం..ప్రజలు ఆదరించి ఆశీర్వదించా రని చెప్పారు.
మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర
‘మహిళా సాధికారిత కోసం, సామాజిక, ఆర్థిక రాజకీయ గౌరవం కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తోంది. ఆస్తి హక్కు నుంచి నేడు తల్లికి వందనం వరకూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేప ట్టింది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు చట్టసభ ల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకూ టీడీపీ వారి వెనుక నిలబడుతుంది. విద్య, ఉద్యోగం, ఉపాధికి ఆర్థికంగా మహిళలకు వెసులుబాటు ఇచ్చేలా కార్యక్రమాలు చేపడుతున్నాం. స్త్రీశక్తి ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. దీపం 2.0 పథకం ద్వారా ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నాం. గత ఏడాది లక్ష మంది మహిళలను ఎంటర్‌ప్రెన్యూర్ లుగా తీర్చిదిద్దాం. మరో 5 లక్షల మంది మహిళలను ఎంటర్ ప్రెన్యూర్లుగా మార్చేలా కార్యాచరణ చేపట్టాం. స్వయం ఏపీ పేరు తో డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తున్నాం. మొన్నటి విజయంలో మహిళలదే కీలక పాత్ర. ప్రజా క్షేత్రంలో పోరాడి పార్టీని గెలిపించారు. అందుకే ఈ మహానాడును ఆడబిడ్డలకు అంకితం చేస్తూ మహిళా మహానాడుగా ప్రకటించారు.
యువతకు విస్తృత అవకాశాలు కల్పిస్తాం
యువత గురించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘ఏ పాలసీ చేసి నా అది యువత కోసమే చేస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పాలసీతో యువతకు ఉద్యోగాలు వచ్చాయి. ఎన్నికల సమయంలో ప్రస్తుత టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ రాష్ట్రమంతటా పర్యటించి యువగళం పాదయాత్రలో హామీలు ఇచ్చారు. దానికి అనుగుణంగా జెన్‌జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్ల ఆలోచనలకు అనుగు ణంగా విధానాలు రూపొందించి అవకాశాలు కల్పిస్తాం, సహకా రం అందిస్తాం. ఏఐ, క్వాంటం, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా అన్ని రంగాల్లో ఏపీ చిరునా మాగా ఉంటుంది. 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు కూడా వచ్చేందుకు వీలు కలిగింది. ఇప్పటికే రూ.11.27 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 282 ప్రాజెక్టులకు ఎసఐపీబీ ద్వారా ఆమోదం తెలిపాం. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ మినరల్స్, 5వ తరం ఫైటర్ జెట్ యుద్ధ విమాన ప్రాజెక్టు కూడా రాష్ట్రానికి వస్తోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నాం. కేవలం 36 రోజుల్లోనే ఫైటర్ జెట్ యుద్ధ విమాన తయారీ, టెస్టింగ్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చాం. ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తోనే తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటారుసైకిల్ ప్రాజెక్టు వచ్చింది. ఇది ఇన్‌స్పైరింగ్ టైమ్ అని జెన్ జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్ వర్గానికి పిలుపునిస్తున్నాను. యువతకు ఉద్యోగాలు-ఉపాధి వంటి అంశాల్లో వారి కంటే ముందే ఆలోచన చేసి అందుకు అను గుణంగా విధానాలు రూపొందిస్తున్నాం. ఆకాశమే హద్దుగా యువత రాష్ట్రంలోని అవకాశాలు వినియోగించుకోవాలి. నచ్చిన రంగాన్ని ఎంచుకుని వన్ ఎంటర్‌ప్రెన్యూర్ – వన్ ఫ్యామిలీ లక్ష్యం చేరుకోవాలి. మెగా డీఎస్సీ ద్వారా 15,941 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. 5,757 మంది కానిస్టేబుళ్లను రిక్రూట్‌మెంట్ పూర్తి చేసిన ప్రభుత్వం మనది. 10 వేలకు పైగా పోస్టులతో 2026 జాబ్ క్యాలెండర్‌ను కూడా విడుదల చేశామని వివరించారు.
సంక్షేమం-అభివృద్ధి-సుపరిపాలనకు అర్థం చెప్పాం
‘రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత 23 నెలల్లో దాదాపు రూ.63 వేల కోట్లకు పైగా మొత్తాన్ని సామాజిక భద్ర తా పింఛన్ల కోసం ఖర్చు పెట్టాం. ఇది దేశంలోనే రికార్డు. మరోవైపు రైతన్నను అన్ని విధాలా ఆదుకున్నాం. గత పాలకులు రైతాంగాన్ని నిర్వీర్యం చేశారు. వారికి ఏడాదికి రూ.7,500 మాత్రమే సాయంగా ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.14 వేలను ఏడాదికి అన్నదాత సుఖీభవ కింద ఇస్తున్నాం. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆక్వా రైతులకు ఈ జూన్ మొదటి తేదీ నుంచి యూనిట్ విద్యుత్ రూ.1.50 ఇవ్వాలని ఆదేశించా రు. మన తీరంలో మత్స్య సంపదపై మన మత్స్యకారులకే హక్కులు ఉన్నాయి. తీరం మనదే, బోటు మనదే, వేటా మనదే అనేలా చర్యలు చేపట్టాం. 200 మెకనైజ్డ్ బోట్లను మత్స్యకారు లకు రూ.240 కోట్ల సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించాం. దివ్యాంగ శక్తి పేరిట ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. గీత, వడ్డెర కార్మికులకు మద్యం దుకాణాలు, గనుల్లో రిజర్వేషన్లు కల్పించామని వివరించారు.
ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’
ప్రజారోగ్యంలో సంజీవని ప్రాజెక్టుతో వినూత్న మార్పు తీసుకు వచ్చాం. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో దీనిని అమలు చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తిగత ఆరోగ్య పర్యవేక్షణ కోసం డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమం ‘సంజీవని’ అమలు చేస్తాం. యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా అందరికీ ఆరోగ్య బీమాను కల్పిస్తున్నాం. విద్యా రంగంలో ఏపీని రోల్ మోడల్‌గా నిలుపుతున్నాం. పేరెంట్ టీచర్స్ మీటింగ్, పాఠ్యాంశాల్లో మార్పులు వంటివి చేపట్టాం. అలాగే రాష్ట్రంలో ఎంతో కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సంకల్పించాం. 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులను ఎప్పుటికల్లా పూర్తి చేయాలి, ఎప్పుడు పూర్తి చేయాలనే దానిపై క్యాలెండర్ ప్రకటిం చాం. పోలవరం ప్రాజెక్టును పుష్కరాలకంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గత పాలకుల నిర్లక్ష్యంతో డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. రూ.1,000 కోట్లతో మళ్లీ నిర్మించాం. హంద్రీ నీవా కాలువ వెడల్పు చేయడం ద్వారా కుప్పం వరకూ నీళ్లు తీసుకెళ్లాం. గత ప్రభుత్వం కుప్పం బ్రాంచ్ కెనాల్‌లో సినిమా సెట్టింగులు వేసి ట్యాంకర్‌తో నీళ్లు ఇచ్చి రైతులను మోసం చేసింది. వెలిగొండ ఫేజ్ వన్ కూడా పూర్తి చేసి మార్కా పురం జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. రాష్ట్రంలో చెరువులు, రిజర్వా యర్లు జలకళతో కళకళ లాడుతున్నాయి. జలధార-జలహారతి ద్వారా భూగర్భజలాలను పెంచేలా వందరోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.
వైసీపీకి రాజధానిపై విజన్ లేదు..విషం కక్కడమే తెలుసు
‘రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వారికి సంక్షే మం గురించి మాట్లాడే అర్హత లేదు. వైసీపీకి రాజధానిపై ఓ విజన్ లేదు. విషం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు అన్నారు. అధికారపక్షంలో మూడు రాజ ధానులు అన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా పోయాక మావిగన్ అంటున్నారు. వీళ్లను ఏమననాలో తెలియ టం లేదు. పార్లమెంటులో చట్టం చేసినా మావిగన్ అంటూ వ్యాఖ్యలు చేస్తు న్నారు. వాళ్లకు గోల్ అంటూ లేదు..వాళ్లదో అడ్డగోలు బ్యాచ్. విశాఖలో రైల్వేజోన్ కోసం 52 ఎకరాల భూమిని కూడా గత ప్రభుత్వం ఇవ్వలేకపోయింది. ప్రజా ప్రభు త్వం అధికారంలోకి వచ్చాకే విశాఖ రైల్వేజోన్ సాధించాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను తిరిగి నిలబెట్టాం, లాభాల బాట పట్టించాం. వైసీపీ ఓ బ్లఫ్ బ్యాచ్- ఫేక్ న్యూస్ బ్యాచ్. వాళ్లు గుంతలు పెట్టి వదిలిపోయిన రోడ్లను, మన ప్రభుత్వంలో మరమ్మతులు చేయటంతో పాటు కొత్త రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.
గొడ్డలి పార్టీ నెవర్ అగైన్
గత పాలకులు రూ.32 వేల కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపై వేశారు. రూ.1.35 లక్షల కోట్ల మేర డిస్కమ్‌లను అప్పుల్లో ముంచారు. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని చెప్పాం. తొలిసారి ట్రూడౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదే. గత పాలకులు 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలి వెళితే దానిని తొలగిం చాం. రెవె న్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. రికార్డులు సరిచేయ డానికి రెండేళ్లు పట్టింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. నాలా యాక్టును కూడా రద్దు చేశాం. రాజముద్ర తో ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేస్తున్నాం. రికా ర్డులు ట్యాంపర్ చేయకుండా చర్యలు చేపట్టాం. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్, ఇంధన కొరత వచ్చింది. ఆక్వా ధర లు పడిపోయాయి. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేలా చర్యలు చేప డుతున్నాం. మహానాడు ఓ పసుపు పండుగ, ప్రజలకు, కార్యక ర్తలకు భరోసా ఇచ్చే ఓ వేదిక. గొడ్డలి పార్టీ డైవర్ట్ చేసేందుకు ప్రయ త్నాలు చేస్తోంది. ఎన్ని కుయుక్తులు పన్నినా టీడీపీని అడ్డు కోలేరు. పేదలకు కావాల్సింది సంక్షేమం.. గొడ్డలివేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు..కత్తి పోట్లు కాదు. రక్తాభిషేకాలు చేసే వారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. వేట కొడవళ్ల నుంచి గొడ్డలి పార్టీగా మారటం వారి విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగటం మన విధానం..బోత్ ఆర్ నాట్ సేమ్ అని వ్యాఖ్యానించారు.
క్రమశిక్షణ, కమిట్‌మెంట్‌తో కష్టపడే క్యాడర్
‘దేశంలో ఏ పార్టీకి లేని బలమైన క్యాడర్ మనకు ఉంది. క్రమశిక్షణ, కమిట్‌మెంట్‌తో కష్టపడే క్యాడర్ టీడీపీ సొంతం. మన బలం బలగం క్యాడర్. ఏదైనా పార్టీ ఫస్ట్, క్యాడర్ బెస్ట్. నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చదువుకున్న, శిక్షణ పొందిన నాయకులే అన్ని చోట్లా రాణిస్తున్నారు. సోషల్ రీ ఇంజినీరింగ్ చేయటమే పార్టీ విధానం. అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యం. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేశాం. ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్ కోసం కూడా ఆదుకునేలా పార్టీ చర్యలు తీసుకుంటోంది. మై హెల్త్ యాప్ ద్వారా కార్యకర్తలు, వారి కుటుంబం ఆరోగ్యం కాపాడే బాధ్యత పార్టీ తీసుకుంది. ఎథికల్, ఎకనామికల్, ఎంపవర్‌మెంట్ నినాదంతో ముందుకు వెళుతున్నాం. పార్టీ అధినేతగా నా పార్టీ కుటుంబసభ్యులైన కార్యకర్తల ఎంపవర్‌మెంట్ కోసం నిరంతరం పనిచేస్తామని స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాలి
స్థానిక ఎన్నికల కోసం సిద్ధం కావాలని అందరికీ పిలుపిస్తున్నా. ఏ ఎన్నికలైనా గెలుపే ప్రజాభిప్రాయానికి కొలమానం. గెలుపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలు పనిచేయాలి, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకుసాగాలి. మనం చేసిన పని ప్రజలకు తెలియ చేస్తూ వారిని ఆకట్టుకోవాలి. ఓటు నమోదు చేయించే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలి. ‘సర’లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలి. మిత్రపక్షాలతో సఖ్యతగా, సమన్వయంతో ముందుకువెళదాం. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా అందరం మమేకం అవుదాం. ఎవరూ ఈగోలకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతీ నేతా జనంతో, కార్యకర్తలతో మమేకం కావాలి. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఏపీ మన లక్ష్యం. మహానాడు సాక్షిగా తెలుగుజాతి కోసం పునరంకితం అవుదామని పిలుపు నిచ్చారు. వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు.













