- అనితపై అనుచిత వ్యాఖ్యలు నీచం
- మంత్రి నారా లోకేష్ ధ్వజం
అమరావతి(చైతన్యరథం): హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనితపై అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల అసలు స్వరూపాన్ని బయట పెట్టా యని ధ్వజమెత్తారు. మంగళవారం అమరావతి వేదికగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాం లో పాలన, అభివృద్ధి, శాంతిభద్రతలపై సమాధానాలు చెప్పలేక వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ఆగ్రహించారు. మహిళా నేత, దళిత ప్రజాప్రతినిధిని లక్ష్యంగా చేసుకోవడం వైసీపీ నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. అనిత రాజ కీయ ప్రస్థానం, కష్టపడి ఎదిగిన మహిళా వ్యక్తిత్వానికి నిదర్శన మని ప్రశంసించారు. అనితకు, మహిళలకు, దళిత సమాజానికి వైసీపీ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
















