సామాజిక న్యాయం:36 మందిలో 22 మంది అంటే 61 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందినవారు. 16 చోట్ల బీసీలకు అవకాశం. అంటే తొలి లిస్టులోనే 44 శాతం బీసీలకు కేటాయింపు
ఏడు కార్పొరేషన్లలో ఐదు మేయర్ స్థానాలకు బీసీ, ఎస్సీ అభ్యర్థులను ఎంపిక…వీరిలో నలుగురు బీసీలు, ఒకరు ఎస్సీ
ఆళ్లగడ్డ, రాయచోటిలో ఇద్దరు మైనారిటీ అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం జాబితాలో ముగ్గురు ఎస్సీలు, ఒకరు ఎస్టీ ఉన్నారు.
విద్యార్హతలు: 33 మందిలో 25 మంది అంటే 76 శాతం డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యార్హతలు కలిగినవారు. వీరిలో ఏడుగురు పీజీ పట్టభద్రులు. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంఏ వంటి విద్యార్హతలు కలిగినవారు, ముగ్గురు వైద్యులు
యువతకు ప్రాధాన్యం: అభ్యర్థుల సగటు వయస్సు 45.7 సంవత్సరాలు. మొత్తం 36 మందిలో 16 మంది 45 ఏళ్లలోపు వారు; 10 మంది 40 ఏళ్లలోపు వారు.
ఏడుగురు మేయర్ అభ్యర్థుల సగటు వయస్సు 39 సంవత్సరాలు. చైర్పర్సన్ అభ్యర్థుల సగటు వయస్సు 47.5 సంవత్సరాలు కాగా, మేయర్ అభ్యర్థుల సగటు వయస్సు దానికంటే సుమారు తొమ్మిదేళ్లు తక్కువ.
అత్యంత పిన్నవయస్కురాలు రాజంపేట అభ్యర్థి డాక్టర్ దొంతం గాయత్రి వయస్సు 26 సంవత్సరాలు. ఆ తర్వాత విజయనగరం అభ్యర్థి వయస్సు 31, జీవీఎంసీ అభ్యర్థి వయస్సు 32 సంవత్సరాలు
మహిళలకు పెద్దపీట: 36 మందిలో 19 మంది మహిళలు. అంటే 53 శాతం. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలు 17 కాగా, పార్టీ 19 మంది మహిళలకు అవకాశం కల్పించింది.
మహిళా రిజర్వేషన్ పరిధిని దాటి మరో రెండు స్థానాల్లో మహిళలను ఎంపిక చేసింది. మహిళలకు ప్రత్యేకంగా రిజర్వు కాని చిత్తూరు కార్పొరేషన్, బద్వేలు స్థానాల్లోనూ మహిళలకు అవకాశం















