- విజయవాడలో నేటి నుంచి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్-బ్లడ్ సెంటర్ సేవలు
- ప్రారంభించనున్నట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
విజయవాడలో శుక్రవారం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవనాన్ని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించనున్నారు.
ఉదయం 9 గంటలకు జరిగే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
అమరావతి (చైతన్యరథం): సమాజ సేవ, ఆరోగ్య రంగంలో నమ్మకమైన సేవలను అందిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మరో మైలురాయిని అధిగమిస్తోంది. విజయవాడలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ భవన్, బ్లడ్ సెంటర్ ప్రారంభోత్సవం శుక్రవారం జరగనుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి భవనాన్ని, బ్లడ్ సెంటర్ సేవలను ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడలోని పటమట సాయిబాబా గుడి వీధి బీపీ నగర్ లో నూతన భవన ప్రారంభోత్సవం శు క్రవారం ఉదయం 9.10-10 గంటల మధ్య జరగనుంది. అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ థీమ్ సాంగ్ ప్రదర్శన ఉంటుంది. తరువాత ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సీఈఓ, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. రాజేంద్ర కుమార్ స్వాగతోపన్యాసం, నారా భువనేశ్వరి ముఖ్యోపన్యాసం ఉంటాయి.
















