- వైసీపీని తరిమేస్తేనే రాయలసీమ అభివృద్ధి
- మంత్రాలయంలో వలసలకు అడ్డుకట్ట వేస్తాం
- సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్
- పెండిరగ్ ప్రాజెక్టుల బాధ్యత తీసుకుంటా..
- తొలి సంతకం డిపస్సీపైనే…
- సూపర్ సిక్స్ పథకాలతో అభివృద్ధి సాధిద్దాం
మంత్రాలయం (చైతన్యరథం): జగన్ ప్యాలెస్ కొల్లగొడితే రాష్ట్రంలోని పేదల పొట్ట నిండుతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. పదిచ్చి వంద భారమేసి వెయ్యి కొట్టేసిన దుర్మార్గుడు జగన్ అని, సంపద మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌లో మురుగుతోందన ధ్వజమెత్తారు. రాయలసీమలో అధిక స్థానాలు కల్పించినా, ఈ ప్రాంతానికి ఏమీ చేయని ద్రోహి జగన్ అన్నారు. మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని కౌతాళంలో ఆదివారం నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు `జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. సభకు పోటెత్తిన జన కెరటాన్ని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ `రాఘవేంద్రస్వామి, ఖాదర్ లింగ్‌స్వామి, ఉరకొండ ఈరన్నస్వామి ఆశీస్సులతో రాష్ట్రానికి, మంత్రాలయానికి మంచి రోజులు రాబోతున్నాయన్నారు. కర్నూలు జిల్లాలో సామాజిక సమీకణలు పాటించామని చెబుతూ `పార్లమెంట్‌కు కురవ అభ్యర్థి నాగరాజుకు, మంత్రాలయం అసెంబ్లీకి బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డిని ప్రోత్సహించామని వెల్లడిరచారు. ఆదోనిలో డెంటల్ పార్ధసారధికి ఇచ్చామని చెబుతూ, ఆలూరులో లింగాయత, కుడమూరులో ఎస్సీ మాదిగ, పత్తిపాడులో ఈడిగ, కర్నూలులో వైశ్య, నంద్యాలలో ముస్లిం వర్గాలకు టికెట్లు కేటాయించామన్నారు.
కూటమితోనే మంత్రాలయం అభివృద్ధి సాధ్యం
ఒక సాధారణ ఎంపీటీసీ అభ్యర్ధి నాగరాజును ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టామని, పేదలకు సీట్లు ఇచ్చి సామాజిక వర్గాలను ఆదుకున్నారని ప్రతి ఊరులోను చర్చ జరగాలని బాబు సూచించారు. పక్కనే తుంగభద్ర ఉన్నా తాగటానికి నీళ్లు లేవు. గురురాఘేవంద్ర ఎత్తిపోతల పని చేస్తుందా? కాని యేరు ఇసుకతో మాఫియా నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలో ఇసుకను దొంగిలించుకుపోతున్న బాలనాగిరెడ్డి ఏ రోజైనా ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా? రోడ్లు వేశాడా? ఒక్కరికి ఉద్యోగం ఇప్పించారా? బడుగు జీవుల రక్తం తాగే దుర్మార్గులు బాలనాగిరెడ్డి, సాయిప్రతాప్ రెడ్డి అని ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రామకృష్ణ, జేఎస్పీ నాయకులు రామాంజనేయులు, జనసేన ఇంచార్జ్ లక్ష్మన్న, బీజేపీ ఇంచార్జ్ విష్ణువర్థన్ రెడ్డి, ప్రాణసమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు, మరోవైపు జన సైనికులు, బీజేపీ నాయకులు అంతా సంఘటితమై కూటమిని గెలిపించాలని, అప్పుడే మంత్రాలయం అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పెండిరగ్ ప్రాజెక్టులు పూర్తిచేసే బాధ్యత నాది
జగన్‌రెడ్డికి నీటి విలువ తెలుసా? అంటూ సాగు, తాగు నీరు ఎక్కడుంటే అక్కడ ప్రజల సుఖసంతోషాలతో ఉంటారని బాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో నీళ్లు లేక 80వేల మంది వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. కౌతాలం నుంచి వలస పోకుండా వేరే ప్రాంతం నుంచి ఇక్కడకి వచ్చేలా చేయడమే నా ప్రాధాన్యత. రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేశారు. రాజోలు బండ డైవర్షన్ స్కీంకి రూ.1,955 కోట్లు ఇస్తే, ఖర్చు పెట్టకుండా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. వేదావతి ఎత్తిపోతలకు జీవో నెం. 77 ద్వారా రూ.1,942 కోట్లు ఇస్తే పంపు హౌస్, కెనాల్ పనులను నిలిపివేశారు. గుండ్రేవుల ప్రాజెక్టు 2015లో డీపీఆర్ సిద్ధం చేసి కొడుమూరులో ప్రారంభిస్తే నిలిపివేశారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టును గాలికి వదిలిపెట్టారు. 12 లిఫ్ట్‌లను పట్టించుకోలేదు. పులికనుమను టీడీపీ ప్రారంభించింది. కుమ్మలూరు లిఫ్ట్, వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌లు పూర్తి చేస్తే జగన్ నిలిపివేశారు. 90 శాతం డ్రిప్ ఇరిగేషన్‌తో పరికరాలు ఇస్తే జగన్ వాటన్నింటిని రద్దు చేశారు. ప్రజలకు న్యాయం చేయాలని మేం చూస్తే జగన్ రెడ్డి విధ్వంసంతో చీకటి రోజులుగా మార్చారు. సైకో పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి. కూటమి అధికారంలోకి వేస్త పెండిరగ్ ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తిచేసే బాధ్యత తీసుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తొలి సంతకం డిఎస్సీపైనే..
పెంచనని హామీ ఇచ్చి నాలుగేళ్లలో 9సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన దుర్మార్గుడు జగన్ అని చంద్రబాబు దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వస్తే `స్థానికంకా విద్యుదుత్పాదనకు అవకాశం కల్పిస్తానన్నారు. నాసిరకం మద్యంతో జగన్ కోట్లు దోచుకోవడమే కాకండా, ప్రజారోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీశాడని దుయ్యబట్టారు. పేదల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న జగన్‌ను తరిమికొట్టాలన్నారు. పెట్రోలు, ఇసుక, నిత్యావసరాల ధరలు పెంచి జగన్ `రాష్ట్రం నడ్డివిరిచాడని దుమ్మెత్తిపోశారు. యువతను ఉద్దేశంచి మాట్లాడుతూ `జగన్ ఏలుబడిలో ఇక్కడివాళ్లకు ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే తొలి సంతకం డిఎస్సీపైనే పెడతానని, ఏటా జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని ప్రామిస్ చేవారు. నిరుద్యోగులకు భృతికింద నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యొగాలు కల్పిస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో కూటమి దూసుకుపోతుంటే, పసలేని జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. రోడ్డు బాగు చేస్తామని, అంగన్‌వాడీ, హోంగార్డులు, టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లను బాగు చేసే బాధ్యత నాది అంటూనే, యువత సైకిల్ ఎక్కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు పట్టుకొని ఊరూరు వెళ్లి ప్రజలను ఛైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని కోరారు.
సూపర్ సిక్స్‌తో అభివృద్ధి ఫలాలు
సూపర్ సిక్స్‌లో మహాశక్తి కింద నాలుగు కార్యక్రమాలు అమలు చేస్తామంటూ, ఆడబిడ్డ నిధి కింద ఒక్కో బిడ్డకు రూ.1,500 ఇస్తామని, తల్లికి వందనం కింద పిల్లల చదువులు నిమిత్తం ఒక్కో పిల్లవాడికి రూ.15,000, ఎంత మంది ఉంటే అందరికి ఇస్తామన్నారు. దీపం పథకం కింద 3 సిలెండర్లు ఉచితంగా ఇస్తామని, ఆర్టీసీలో మహిళలకు ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇస్తామంటూ, పేదరికం లేని సమాజం చూడాలనేదే నాధ్యేయం. సంపద సృష్టించి ఆదాయం పెంచి దానిని ప్రజలకు పంచుతానని ప్రకటించారు. సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, వ్యవసాయాన్ని ఆదుకుంటాం. రైతుకు రూ.20వేలు ఇచ్చే బాధ్యత మాదని చంద్రబాబు ప్రకటించారు. పింఛను లబ్దిదారులకు నెలకు రూ.4వేలు పింఛను ఇవ్వనున్నట్టు ప్రకటిస్తూ.. జగన్ రెడ్డి రాజకీయ పిచ్చితో పించన్ల పేరిట గత నెలలో 33 మంది వృద్ధులను చంపేశారు. పేద వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న దుర్మార్గుడని దునుమాడారు.
కౌతాలానికి పూర్తిస్థాయి అభివృద్ధి
ఉగాది రోజున అమరావతిలో మూడు ట్రాక్టర్లలో మంత్రాలయం నుంచి వచ్చారు. నా మనస్సు కరిగిపోయింది. మొదటి ప్రాధాన్యత కౌతాలానికి ఇచ్చి సమస్యలను పరిష్కారం చేస్తాను. గురురాఘవేంద్ర 9 ఎత్తిపోతలను బాగు చేస్తాం. రూ.1,400 కోట్లతో ప్రారంభించిన ప్రాజెక్టును పూర్తి చేస్తాం. కౌతాలంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం. నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధితో పేదరికం నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తాను. 175 అసెంబ్లీలో, 25 పార్లమెంట్ లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.