- అందుకే రెగ్యులేటరీ కమిషన్ అమెండ్‌మెంట్ బిల్లు
- గతంలో కమిషన్ పరిధులు దాటి వ్యవహరించింది
- శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): ఉన్నతవిద్యలో అనేక సంస్కరణలు ఈరోజు ప్రజా ప్రభుత్వం తీసుకువస్తోంది. అందులో భాగంగానే ది ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ అమెండ్‌మెంట్ బిల్ – 2026ను తెచ్చామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో బిల్లును లోకేష్ ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడు తూ ఇది చాలా కీలకమైన బిల్లు అని తెలిపారు. గతంలో ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరీ కమిషన్ యాక్ట్ అనేది ఉండేది. అది ఇప్పుడు కమిటీ కింద మార్చాల్సిన ఆవశ్యకతను సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గత సెషన్ లో ఉన్నత విద్య కమిషనర్ పాలనా సంబంధ సమస్యలు, అడ్మిషన్లపై చర్చించడం జరిగింది. ఏపీ ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచఈ) అనేది కేవలం ఎగ్జామినేషన్స్‌పై దృష్టిపెట్టడం, కరిక్యులమ్ బలోపేతం చేయడం, ఇండస్ట్రీ లింక్ ఎలా చేయాలనే దానిపై ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సవరణ తీసుకురావడానికి ప్రధాన కారణం గతంలో ఉన్న రెగ్యులేటరీ కమిషన్ రాజ్యాంగ పరిధులను దాటి వ్యవహ రించింది. ఉన్నత విద్య కమిషనర్, ఉన్నత విద్యామండలికి సమాంతర వ్యవస్థగా తయారైంది. విధివిధానాలు స్పష్టంగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
అన్ని పనులు కమిషన్ తానే చేయడం మొదలెట్టింది
యÖజీసీ, ఏఐసీటీఈ నేషనల్ కౌన్సిల్స్, ఉన్నత విద్యామండలి, యూనివర్సిటీలు చేయాల్సిన పనులను కూడా ఈ కమిషన్ చేయడం మొదలుపెట్టింది. దీనివల్ల పాలనాపరమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రజా ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే. ఈ ఫీ రెగ్యులేటరీ కమిటీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఏ యూనివర్సిటీ, ఏ కాలేజీ ఎక్కడా ప్రాఫిట్ హియరింగ్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అనేకమంది నిపుణులు మీరు బేస్ ఫీ ఫిక్స్ చేస్తున్నారు బాగానే ఉంది..కానీ క్వాలిటీ ఎక్కడ బాగుందో అక్కడ మీరు ఎక్కువ ఫీ ఇవ్వండి. అప్పుడు మాకు కూడా ఇన్సెంటివ్ ఉంటుంది, రీసెర్చి కూడా చేశామని చెప్పారు. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభుత్వ విధానం గనుక స్పీడ్‌తో పాటు క్వాలిటీ లింక్ చేసి ఫీ ఇన్సెంటివైజేషన్, ఫీ ఫిక్సేషన్ చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నందున ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇతర రాష్ట్రాలలో కూడా అధ్యయనం చేశాం
ఇతర రాష్ట్రాల్లో ఏం జరుగుతుందన్నది కూడా మేం అధ్యయనం చేశాం. మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు కూడా కేవలం ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ వ్యవస్థను ముందుకు నడిపిస్తున్నారు. ఈ అమెండ్‌మెంట్ ద్వారా చాలా స్పష్టంగా కమిషన్ ని కమిటీగా మార్చుతున్నాం. వాళ్ల పరిధి కేవలం ఫీ రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కమర్షియలైజేషన్ అనేది స్పష్టం చేశాం. ఫీజుకు సంబంధం లేని కార్యకలాపాలను ఈ కమిటీ పరిధి నుంచి తీసి ఉన్నత విద్య కమిషనర్‌కు ఇవ్వడం జరిగింది. గతంలో రిటైర్డ్ హైకోర్ట్ జస్టిస్ చైర్‌పర్సన్‌గా పెట్టాలని ఉంది. అది మేము కొనసాగిస్తున్నాం. ఎక్సఅఫీషియో మెంబర్స్‌గా ఏకంగా జేఎన్‌టీయూ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్య కమిషనర్‌ని కౌన్సిల్ రిప్రజెంటేటివ్స్‌గా ఇందులో పొందుపరిచాం. ప్రొసీజర్ మొత్తం మోడర్నైజ్ చేసి పారదర్శకమైన మెకానిజంతో ఫిక్స్‌డ్ టైమ్ లైన్స్ పెట్టి ఒక డిజిటల్ రిపోర్టింగ్ ఏర్పాటు చేయడం ద్వారా లెజిస్లేటివ్‌కి అకౌంటబిలిటీగా ఉంచే లక్ష్యంతో ఈ సవరణ బిల్లు తెస్తున్నట్లు చెప్పారు.











