- 6.5 గిగావాట్ల లక్ష్యాన్ని పూర్తి చేశాం
- పారిశ్రామిక కేటాయింపుల నుంచే వాటికి నీరు
- పోలవరం నుంచి అన్ని అవసరాలకు అందిస్తాం
- గూగుల్ ప్రకటన తర్వాతే ఐటీ సంస్థలు క్యూ
- రాష్ట్రవ్యాప్తంగా అనుబంధ సంస్థలు వస్తున్నాయి
- అసెంబ్లీలో విద్య, ఐటీì, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 6.5 గిగావాట్లకు మించకుండా లక్ష్యాన్ని పూర్తి చేశామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో డేటా సెంటర్లపై వస్తున్న అపోహ లపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కొంతమంది కావాలని డేటా సెంటర్లపై అపోహలు సృష్టిస్తున్నారు. గూగుల్ అనే సంస్థ విశాఖ వస్తున్నా మని ప్రకటించాకే ఐటీ సంస్థలు విశాఖవైపు చూస్తున్నాయి. మనమంతా వాడే స్మార్ట్‌ఫోన్ అందులో వినియోగించే ఏఐ డేటా సెంటర్లతో ముడిపడి ఉంది. 1995లో చంద్రబాబు ఐటీ నేర్చుకో వాలని పిలుపునిచ్చారు. ఆ ప్రక్రియలో పనిచేసే ఎంప్లాయ్ చనిపో యారు. అప్పుడున్న ప్రతిపక్షం వాళ్లు కంప్యూటర్ రేడియేషన్ వల్ల ఆ ఎంప్లాయ్ చనిపోయారని ఆరోపణలు చేశారు. అప్పుడు వెనక్కి తగ్గి ఉంటే హైదరాబాద్ ఈరోజు ప్రస్తుత స్థాయికి వచ్చేది కాదు. డేటా సెంటర్లపై వస్తున్న అపోహలు కూడా అలాంటివేనని చెప్పారు.
గోదావరి నీరు వృథా..డేటా సెంటర్‌కు 3 టీఎంసీలు
డేటా సెంటర్లకు సంబంధించి మేడమ్ మాధవి మూడు సమస్య లు చెప్పారు. మొదటిది నీటి భద్రత. గోదావరి నుంచి ఐదేళ్ల సరాసరి తీసుకుంటే సాధారణంగా ప్రతిఏటా 3 వేల టీఎంసీల నీరు బంగాళాఖాతంలో వృథాగా పోతోంది. మనం ఆ నీటిలో కొంతభాగాన్ని పోలవరంలోకి మళ్లించి గ్రావిటీ ద్వారా విశాఖకు తీసుకువస్తున్నాం. ప్రస్తుత సాంకేతికత ప్రకారం 6.5 గిగావాట్ల డేటా సెంటర్లు విశాఖలో ఇన్‌స్టాల్ అయితే 3 టీఎంసీల నీరు అవసరమవుతుంది. నేను పోలో ఆల్డో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్‌ను స్వయంగా చూశాను. అక్కడ వాటర్ కూల్ టెక్నాలజీ లేదు. అంతా ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇంకా కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. నీటి వినియోగం మరింత తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా తగ్గించే టెక్నాలజీ రాబోతోంది. పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకం గా విశాఖపట్నం నగర ప్రజల తాగు, సాగు, పరిశ్రమల అవసరా లకు కేటాయింపులు జరిగాయి. పరిశ్రమలకు కేటాయించిన నీటి వాటా నుంచే డేటా సెంటర్లకు అవసరమైన నీరందిస్తాం. రాబో యే 18 నెలల్లో పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా విశాఖ ప్రజల కు తాగునీరు అందిస్తాం. డేటా సెంటర్లకు డెడికేటెడ్ పైపులైన్ ద్వారా నీరు అందిస్తాం తప్ప సిటీ ఇన్‌ఫ్రా నుంచి మళ్లించేది లేదని స్పష్టం చేశారు.
థర్మల్ ప్లాంట్లపై మాట్లాడరెందుకు?
1 గిగావాట్ ధర్మల్ పవర్ ప్రాజెక్టు డేటా సెంటర్ ఉపయోగించే నీటి కంటే 10 రెట్లు ఎక్కువగా వినియోగిస్తుంది. విశాఖలో ఇప్పుడు డేటా సెంటర్లపై ధర్నా చేస్తున్న వారు ఏనాడు థర్మల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఎనర్జీ కావాలి..డేటా సెంటర్ వద్దనడం ఎలా సబబు? ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఏఐ అనివా ర్యం. అది మన జీవితంలో భాగమైంది. గూగుల్ పెద్దఎత్తున పెట్టుబడి పెట్టడానికి ముందుకురావడం వల్లే మిగిలిన గ్లోబల్ సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లకు భూములు కేటాయిం చాలని అడుగుతున్నాయని వివరించారు.
వన్ నేషన్- వన్ గ్రిడ్‌తో ఎంతో మేలు
విద్యుత్‌కు సంబంధించి వెస్ట్రన్ గ్రిడ్‌కు, ఇండియన్ గ్రిడ్‌కు చాలా తేడా ఉంది. మన వద్ద వన్ నేషన్- వన్ గ్రిడ్ వ్యవస్థను నరేం ద్రమోదీ నాయకత్వంలో తెచ్చారు. దీనివల్ల రాయలసీమలో తయారుచేసే రెన్యువబుల్ ఎనర్జీ నార్త్ ఇండియాకు కూడా పంపించే అవకాశం ఉంది. డేటా సెంటర్లు కనీసం 70 శాతం గ్రీన్ ఎనర్జీ వాడాలని స్పష్టంగా చెప్పాం. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజీ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌నే వాడాలని వారికి చెప్పాం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మంత్రి గొట్టిపాటి నాయక త్వంలో డిస్ట్రిబ్యూషన్ లైసెన్సు కూడా ఇచ్చాం. విద్యుత్ ఛార్జీల విషయంలో ఎలాంటి పెంపుదల ఉండదు. విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నారు. పెంచకపోగా ఈ ఏడాది 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిది. ప్రత్యేకించి ఒక సంస్థ 100 ఎంఎల్ డి డిశాలినేషన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తోంది. దానికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఎకో సిస్టమ్ వస్తుంది..ఉద్యోగాలు తెస్తుంది
డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు వస్తాయా అనే చర్చ జరుగు తోంది. డేటా సెంటర్ చుట్టూ ఎకో సిస్టమ్ చాలా ముఖ్యం. ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి. అడ్వాన్స్ చిప్స్ రావాలి. ఆ చిప్స్‌ను ఈరోజు గూగుల్ తీసుకువస్తుంది. దానివల్ల ఏఐకి సంబంధించిన కటింగ్ ఎడ్జ్, ఇతర కంపెనీలు విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసు కుంటాయి. భారీఎత్తున వస్తున్న డేటా సెంటర్ ఎకోసిస్టమ్‌కు ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అవసరం. ప్రతి ఐదేళ్లకు దానిని అప్ గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల ఈరోజు కెరీర్, ఎల్జీ ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయి. మరో కంపెనీ కూడా ఈరోజు ఏపీకి వస్తోంది. రైజింగ్ రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నందున అక్కడ కేవలం కూలింగ్ ఎకోసిస్టమ్ వల్ల 20 వేల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించబోతున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అనుబంధ సంస్థలు వస్తున్నాయి
పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్లు 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు సరిపడా వరల్డ్ క్లాస్ డేటా సెంటర్లు తీసుకురావాల్సిన బాధ్యత మనపై ఉంది. అందులో భాగంగా మరికొన్ని కంపెనీలు విశాఖలో భూములు అడుగుతున్నారు. వరల్డ్ క్లాస్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ, డెలివరీ కోసం ఇన్‌ఫ్రా కావాలని కోరుతున్నారు. అది కూడా విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తాం. పవర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కూడా ఈరోజు రాయలసీమకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నాయి. అక్కడ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ ఉన్నందునే అక్కడే పవర్ ఎలక్ట్రానిక్స్ వస్తున్నాయి. అందువల్ల పవ ర్ ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. ఫైబర్ మ్యాను ఫ్యాక్చరింగ్ సంస్థలను కూడా ఏపీకి తీసుకువస్తున్నాం. విశాఖలో మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి గ్లోబల్ ల్యాండిం గ్‌తో అనుసంధానిస్తున్నాం. దీనివల్ల ఐటీì, జీసీసీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తాయి. డేటా సెంటర్ల వల్ల లాజిస్టిక్స్, రియల్ ఎస్టే ట్ సపోర్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విశాఖ కేంద్రంగా తయారవుతోంది. గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఒక లాజిస్టిక్స్ సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. సర్వర్, పవర్ ఎలక్ట్రానిక్స్, ట్రాన్స్ ఫార్మర్లు, కేబుల్స్ స్టోర్ చేయడానికి విశాఖ కేంద్రంగా మరో ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. దీనివల్ల వేర్ హౌసింగ్, కమర్షియల్, రెసిడెన్షియల్, ట్రాన్స్‌పోర్టేషన్, హాస్పిటాలిటీ, రిటైల్, మెయింటె నెన్స్, సర్వీసెస్‌లో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు.
విశాఖపట్నం..ఇక ఏఐ పట్నం
అశ్వనీ వైష్ణవ్ గూగుల్ శంకుస్థాపనకు వచ్చినపుడు ఇక విశాఖ పట్నం కాదు…ఏఐ పట్నంగా మారబోతోంది అని చెప్పారు. విశాఖ గేట్ వే ఆఫ్ ఇండియా ఏఐ ఎకో సిస్టమ్ మార్చడం మా కమిట్‌మెంట్. దీంతోపాటు రియల్ ఎస్టేట్ వారు జీసీసీలు, ఐటీì సెజ్‌లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. మరో ముఖ్యమైన విషయం ఒక అమెరికన్ యూనివర్సిటీ ఏఐ రిలేటెడ్ సబ్జెక్ట్‌తో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పేరు ఇప్పుడు చెప్పడం ఒప్పందం ప్రకారం కుదరదు కనుక చెప్పడం లేదని తెలిపారు.
కావాలనే అపోహలు సృష్టిస్తున్నారు
కావాలని కొందరు రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారు. ఎక్క డా పర్యావరణ ఉల్లంఘనలు చేయడం లేదు. కొంతమంది కావాలని దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో అయిపోతుందని చెప్పే మాటలను పట్టించుకోవద్దు. స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సమీపంలో పోలో వోల్టో డేటా సెంటర్ స్వయంగా చూశాను. కనీసం అక్కడ ఉన్నట్లు కూడా మాకు తెలియలేదు. దయచేసి విశాఖ ప్రజలు దుష్ప్రచారం నమ్మవద్దు. మేం పట్టుదల, కమిట్‌మెంట్‌తో పనిచేస్తు న్నాం. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో డేటా సెంటర్ మన గడ్డపై ఉండాల్సిన అవసరం చాలా ఉంది. కొత్తగా ఏఐ స్మార్ట్ ఫోన్లు, డివైజ్‌లు వస్తున్నాయి. ఆ డేటా అంతా ఏఐ డేటా సెంటర్ లో స్టోర్ అవుతుంది. ఐదేళల్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మార బోతున్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కష్టపడి పెట్టుబడులు తీసుకువస్తున్నాం. అపోహలు అస్సలు నమ్మొ ద్దు. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌లో రెన్యువబుల్ ఎనర్జీ వాడి గ్రీన్ స్టీల్ తయారు చేస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు భూమిని చదును చేయాలి. దానిని ప్రకృతి విధ్వంసం అనడం ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచించాలి. అభివృద్ధి జరిగే సమయంలో ప్రకృతిపై కొంత భారం ఉంటుంది. దానిని కనీస స్థాయిలో తగ్గించేందుకు ఒక కార్యాచరణ పెట్టుకుని మేం పని చేస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2019 ఎదురుగాలిలోనూ విశాఖ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిం చారు. విశాఖపట్నంపై మాకు కమిట్‌మెంట్ ఉంది. నూరుశాతం సస్టయినబుల్ మెకానిజంతో డేటా సెంటర్స్, ఐటీ ఎకో సిస్టమ్, అనకాపల్లిలో ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ ఎకో సిస్టమ్ వస్తు న్నాయి. వీటిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రభుత్వం తీసుకుం టుందని చెప్పారు.











