- పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాం
- అసెంబ్లీలో మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి(చైతన్యరథం): మహాకుంభమేళాకు ధీటుగా గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి సూచనలమేరకు ముందుకువెళుతున్నట్లు జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ సమా వేశాల్లో సభ్యులు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పి డి వెంకటేశ్వరరావు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, తాడేపల్లిగూడెం ఎమ్మె ల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌లు పుష్కరాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు నిమ్మల సమా ధానమిచ్చారు. భారతీయ సంస్కృతిలో గంగానదికి ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. భార తదేశంలో గంగా నది తర్వాత అంతటి గొప్ప ప్రాశస్త్యం ఉన్న నది గోదావరి. అందుకనే గోదావరిని దక్షిణ గంగ అని కూడా పిలుస్తారు. గోదావరి నదికి 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాలు జరుగనున్నాయి. రెండేళ్ల వ్యవధి ఉన్నప్పటికీ ముఖ్య మంత్రి సూచన మేరకు ఇటీవలే రాజమండ్రిలో పుష్క రాల సన్నాహక సమావేశం జరిపి వివిధ అంశాలను చర్చించినట్లు చెప్పారు.
2003, 2015లో గోదావరి పుష్కరాలు నిర్వ హించే భాగ్యం ముఖ్యమంత్రిగా చంద్రబాబుకే దక్కింది. పుష్కరాల నిర్వహణలో ఆయన కు అపార అనుభవం ఉంది. 2015 గోదావరి పుష్కరాల్లో 307 పనులను రూ.117 కోట్లతో చేశాం. 3625 మీటర్ల పొడవున 145 ఘాట్లను గుర్తించాం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 2,452 మీటర్ల పొడవునా 98 ఘాట్లను గుర్తించాం. ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు, వాటర్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లోలు మాత్రమే ఇరిగేషన్ శాఖ చూస్తుంది. నిర్వహణ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ చూస్తుంది. పుష్కరాలకు సం బంధించి ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలే కాకుండా హోమ్, ఎండోమెంట్, పురపా లక శాఖ, ఆర్ అండ్ బీ, ఫిషరీస్, పౌరసరఫరాలు, పర్యాటక శాఖలు పాలుపంచుకుం టాయని తెలిపారు. ఈ శాఖలు తరచూ సమన్వయ సమావేశాలు జరుపుకుంటూ సమ ర్థంగా, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి గోదావరి పుష్కరాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించా లని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. 1.2 కిలోమీటర్లు పొడవున్న కోటిలింగాల రేవు ఘాట్ వంటి పుష్కర పనులు శాశ్వత ప్రాతిపదికన చేయాలని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచించగా అందుకు మంత్రి అంగీకరించారు.
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను రాజమండ్రికే పరిమితం చేయకుండా కోనసీమ ప్రాంతంలో గోదావరి పాయలు, అనేక దేవాలయాలు ఉన్నందున కోనసీమకు కూడా విస్తరిస్తే జన సంద్రాన్ని విభజించినట్లు అవుతుందని సూచించగా సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 30 కిలోమీటర్ల గోదావరి తీరం ఉందని.. అందువల్ల పుష్కరాలకు సం బంధించి కొవ్వూరు ప్రాశస్యాన్ని గుర్తు చేశారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాన్ని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కొవ్వూ రు ప్రాంతం వైపు పుష్కర భక్తులకు, యాత్రికులకు ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా మంచినీటి సదుపాయం పకడ్బందీగా ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే దేవాదాయ శాఖ ద్వారా అనేక దేవాలయాలను ఆధునీకరించటం, స్వల్ప మరమ్మతులు చేయటం, రంగు లు వేయడం వంటి పనులు ఇప్పటి నుంచే చేసుకుంటే బాగుంటుందని సూచించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పుష్కర దారులన్నీ ఇప్పటి నుంచే మరమ్మతులు చేయాలని సూచించారు. ప్రత్యేకించి తాడేపల్లి గూడెం-రాజమండ్రి (వయా నిడదవోలు) పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. సభ్యుల సూచనలను ఆయా శాఖల మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళతానని నిమ్మల తెలిపారు.