చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

నరేంద్ర మోదీ అంటే దమ్ము, ధైర్యం, భరోసా!

కలికిరి సభలో యువనేత నారా లోకేష్

by చైతన్యరధం
May 9, 2024 at 6:11am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
నరేంద్ర మోదీ అంటే దమ్ము, ధైర్యం, భరోసా!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రాయలసీమకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ జగన్‌
  • విధ్వంసకపాలనలో 30ఏళ్లు వెనక్కి వెళ్లిన ఏపీ
  • సీమను అభివృద్ధి బాటపట్టించిన విజనరీ చంద్రబాబు
  • మిషన్‌ రాయలసీమతో సీమప్రజల కష్టాలు తీర్చాలి
  • కలికిరి సభలో టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్‌
పీలేరు (కలికిరి): ప్రపంచంలోనే పవర్‌ ఫుల్‌ లీడర్‌ మన నరేంద్ర మోదీజీ… కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే దేశానికి మేలు జరుగుతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో జరిగిన ఎన్నికల ప్రచారసభకు ప్రధాని మోదీతో కలిసి యువనేత హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీజీకి శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహుకరించిన లోకేష్‌… మంగళగిరి శాలువాతో ప్రధానిని సత్కరించారు. అనంతరం సభనుద్దేశించి  నారా లోకేష్‌ మాట్లాడుతూ… గత పదేళ్లలో దేశం ఎంతగా అభివృద్ధి చెందిందో మనం చూసాం. మోదీ మాటలో దమ్ముంటుంది. మోదీ నడక లో ధైర్యం ఉంటుంది. మోదీ ఉంటే దేశానికి భరోసా ఉంటుంది. మోదీ ఉంటే 100 పర్సెంట్‌ మేడ్‌ ఇన్‌ ఇండియా. మోదీ నుండి రెండు విషయాలు ఆదర్శంగా తీసుకున్నాను. మొదటిది  మోదీకి తల్లి హీరా బెన్‌ మోదీ అంటే ప్రేమ.   రెండోవది మోదీకి భారతదేశం అంటే భక్తి. సంపద ఎలా సృష్టించాలో మోదీకి తెలుసు. ఆ సంపద ద్వారా పిరమిడ్‌ దిగువన ఉన్న వ్యక్తులను శక్తివంతం చేయాలో కూడా ఆయనకు తెలుసు. ఒకప్పుడు విదేశాలు వెళితే ఇండియా నుండి వచ్చాం అని చెప్పుకోవాలి. ఇప్పుడు మన కేరాఫ్‌ అడ్రెస్స్‌ మారింది… నరేంద్ర మోదీ పేరు చెబితే చాలు. సౌత్‌ , నార్త్‌ , ఈస్ట్‌ , వెస్ట్‌ అందరూ అంటుంది ఒకటే నమో గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్స్‌. వచ్చే పదేళ్లలో మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్‌ పవర్‌ గా అవతరించడం ఖాయం. సంపద ఎలా సృష్టించాలో, పేదరికం నుంచి అట్టడుగువర్గాల ప్రజలకు ఎలా బయటకు తీసుకురావాలో ఆయనకు తెలుసు. గత పదేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి రెండూ బ్యాలెన్స్‌ చేస్తూ రాజకీయనాయకులను తలెత్తుకుని తిరిగేలా చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ అని లోకేష్‌ కొనియాడారు. రాయలసీమ లో పాదయాత్ర చేసినప్పుడు తమ దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను మాటల సందర్భంగా ప్రధానికి వివరించారు.
రాయలసీమకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ జగన్‌….
పౌరుషాల గడ్డ, రత్నాలసీమ రాయలసీమ. సీమకు నీరిస్తే బంగారం పండిస్తారు.  తెలుగు గంగ ద్వారా సీమ కు నీరు ఇచ్చి కరువు ప్రాంతంలో బంగారం పండేలా చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు. 2019 ఎన్నికల్లో జగన్‌రెడ్డి రాయలసీమ బిడ్డని అనగానే నమ్మి ప్రజలు మోసపోయారు. అతను రాయలసీమకు క్యాన్సర్‌ గడ్డ లా తయారు అయ్యాడు. జగన్‌ విధ్వంసక పాలనలో రాయలసీమ 30 ఏళ్లు వెనక్కి పోయింది.  ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు. టీడీపీ 2014- 19 వరకూ చేసిన ఖర్చులో 10 శాతం కూడా సాగునీటి ప్రాజెక్టుల పైన చేయలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, ఇసుక దోపిడీ కారణంగా అన్నమయ్య, పించా డ్యాంలు కొట్టుకుపోయాయి. 38 మంది చనిపోయారు. బాధితులకు కనీసం ఇళ్లు కట్టించలేని చెత్త ప్రభుత్వం ఇది. కడప ఉక్కు ఫ్యాక్టరీ కి రెండు సార్లు శంకుస్థాపన చేసాడు కానీ ఒక్క ఇటుక పెట్టలేదు. రాయలసీమ రైతులకు వరంగా ఉన్న డ్రిప్‌ ఇరిగేషన్‌ ని చంపేసాడు.  అందుకే ఆయన కడప బిడ్డ కాదు కడపకు పట్టిన క్యాన్సర్‌ గడ్డ. సీమలో పరిస్థితులు చక్కదిద్దడానికి ప్రజాగళం ఏర్పడిరది. పొత్తు కోసం త్యాగం చేసింది పవన్‌ అన్న. నాకు పదవులు ముఖ్యం కాదు రాష్ట్రం, ప్రజలు ముఖ్యం అని ఓపెన్‌ గా చెప్పే దమ్మున్న నేత మన పవన్‌ అన్న. సంక్షేమం – అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకువెళతాం. కూటమి అభ్యర్థులను గెలిపించండని లోకేష్‌ విజ్ఞప్తి చేశారు.
సీమలో కార్లపంట పండిరచిన విజనరీ చంద్రబాబు…
వికసిత్‌ భారత్‌ నరేంద్ర మోదీ కల- వికసిత్‌ రాయలసీమ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కల. 2014 లో రాష్ట్ర విభజన, కట్టుబట్టలతో మన ప్రయాణం మొదలైంది. చంద్రబాబుకు ఉన్న అనుభవం, విజన్‌ వలన రాయలసీమని అభివృద్ధి బాట పట్టించారు. కొంతమంది ఫ్యాక్షన్‌ నాయకులు సీమ గడ్డ పై రక్తం పారిస్తే చంద్రబాబు నీళ్లు పారించారు. 5 ఏళ్ల లో సీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు గారు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? 12 వేల కోట్లు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు ఇవ్వాలని రూ.22 వేల కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ పధకాన్ని రూపొందించాం. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఫ్యాక్స్కాన్‌ , టిసిఎల్‌ , డిక్సన్‌ లాంటి ఎన్నో ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు తీసుకొచ్చాం. కరువు జిల్లా అనంతపూర్‌ లో కియా కార్లు పండిరచారు విజనరీ లీడర్‌ చంద్రబాబు. కర్నూలు కి ఎయిర్‌ పోర్ట్‌, జైన్‌ ఇరిగేషన్‌, మెగా సీడ్‌ పార్క్‌, మెగా సోలార్‌ పార్క్‌ లాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం. పులివెందులకు నీరు ఇచ్చిన లీడర్‌ మన సిబిఎన్‌. 90 శాతం సబ్సిడీ తో డ్రిప్‌ ఇరిగేషన్‌ అందించింది చంద్రబాబు. నరేంద్ర మోదీ సహకారంతో  నేను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామాల రూపు రేఖలు మార్చే అదృష్టం నాకు వచ్చింది. నేను 2018లో పంచాయితీరాజ్‌ మంత్రిగా ఉన్నపుడు మీ ద్వారా ప్రేరణ పొంది రాష్ట్రవ్యాప్తంగా 25వేల కి.మీ.ల సిసిరోడ్లు నిర్మించాను. 10లక్షల పంటకుంటలు తవ్వించా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాను.  మీరు అందించిన సహాయ, సహకారాలకు కృతజ్ఞతలు.
మిషన్‌ రాయలసీమకు  సహకారం అందించండి…
నేను రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసినపుడు ఎక్కువ సమయం రాయలసీమలో గడిపి అక్కడి ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూశాను.  రాబోయే మన ప్రభుత్వం సీమపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సీమ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి మేము మిషన్‌ రాయలసీమను రూపొందించాం. రాయలసీమను ప్రపంచానికి హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. ఇందుకు పంట ఆధారిత పరిశోధన కేంద్రాలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుచేయాల్సి ఉంది. రాయలసీమలో పెండిరగ్‌లో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రైతులను ఆదుకోవడానికి గతంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ పై ఇచ్చిన 90శాతం సబ్సిడీని కొనసాగించాల్సి ఉంది. ఇప్పటికే విజయవంతమైన డెయిరీ సెక్టార్‌పై కూడా మేము ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించాం. మీరు ప్రవేశపెట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం ద్వారా  ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని అందించాలనుకుంటున్నాం. మీ మేక్‌ ఇన్‌ ఇండియా విజన్‌లో కూడా మేము ముఖ్యమైన పాత్ర పోషించాలనుకుంటున్నాం. మేము రాయలసీమను ఆటోమోటివ్‌, ఎలక్ట్రానిక్స్‌, డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ హబ్‌ గా,  రెన్యూవబుల్‌ ఎనర్జీ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చాలనుకుంటున్నాం. మీ ఖేలో ఇండియా విజన్‌లో భాగంగా  కడపను ఆంధ్రప్రదేశ్‌ క్రీడా రాజధానిగా మార్చాలనుకుంటున్నాం. మీరు ఎల్లప్పుడూ దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారు, అందుకు రాయలసీమ అద్భుతమైన అవకాశాలున్న ప్రాంతం. మేము టెంపుల్‌, టైగర్‌ ఎకో టూరిజాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఇందుకు మీ వంతు సహాయ,సహకారాలను అందించాలని కోరుతున్నాను. ఫిర్‌ ఏక్‌ బార్‌ మోడీ సర్కార్‌… అబ్కీ బార్‌ 400 పార్‌. దేశవ్యాప్తంగా 400 సీట్లను అధిగమించాలన్న మీ లక్ష్యంలో ఎపి ప్రజలు భాగస్వాములవుతారని యువనేత లోకేష్‌ అన్నారు.

సంబంధితవార్తలు

కేంద్రమంత్రి కుమారస్వామికి లోకేష్‌ ధన్యవాదాలు

మాట మార్చుడు లేదు.. మడమ తిప్పుడు లేదు!

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌

Tags: కలికిరిజగన్ రెడ్డి ఓటమినరేంద్ర మోదీప్రధాని పర్యటనప్రధాని మోదీయువనేత నారా లోకేష్‌రాయలసీమ ద్రోహి
Previous Post

విజయవాడలో ఎన్డీయే అగ్రనేతల రోడ్‌ షో

Next Post

చంద్రబాబు చేసేదే చెప్తారు..చెప్పింది చేస్తారు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 03-07-2025

కార్యకర్త
@ July 3, 2025
ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!
ఆంధ్రప్రదేశ్

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌
ఆంధ్రప్రదేశ్

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా
ఆంధ్రప్రదేశ్

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

కుప్పం అభివృద్ధికి రూ.1617 కోట్ల ఒప్పందాలు

చైతన్యరధం
@ July 3, 2025
గడపగడపలో సీఎం
ఆంధ్రప్రదేశ్

గడపగడపలో సీఎం

చైతన్యరధం
@ July 3, 2025
చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 02-07-2025

కార్యకర్త
@ July 2, 2025
Load More

ముఖ్య వార్తలు

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

సీఎం కాన్వాయ్‌లో కామన్‌మ్యాన్‌ జర్నీ

చైతన్యరధం
@ July 2, 2025
మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

మరోసారి ల్యాండ్‌ పూలింగ్‌!

చైతన్యరధం
@ June 25, 2025
వరద జలాలే వాడతాం

వరద జలాలే వాడతాం

చైతన్యరధం
@ June 25, 2025
ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

ఉద్యోగకల్పనే ధ్యేయంగా నైపుణ్య శిక్షణ

చైతన్యరధం
@ June 25, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

వికాసం.. విధ్వంసం మధ్య యుద్ధం!

చైతన్యరధం
@ July 1, 2025 6:30 AM
బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

బనకచర్ల.. ఏపీ గేమ్‌ఛేంజర్‌

చైతన్యరధం
@ July 1, 2025 6:25 AM
ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

ప్రజా ఉద్యమంగా యోగాంధ్ర

చైతన్యరధం
@ June 21, 2025 6:55 AM

సంపాదకుల ఆక్రోశం ఎవరి మెప్పుకోసం?

చైతన్యరధం
@ June 18, 2025 6:05 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

ప్రభుత్వ విద్య బలోపేతంలో..ఉపాధ్యాయులపై పవిత్ర బాధ్యత

చైతన్యరధం
@ July 3, 2025
చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చదువుల పండుగకు సర్వం సిద్ధం..!

చైతన్యరధం
@ July 3, 2025
త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

త్వరితగతిన రిటైనింగ్‌ వాల్‌

చైతన్యరధం
@ July 3, 2025
పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

పెద్దకొడుకులా సేవ చేస్తున్నా

చైతన్యరధం
@ July 3, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist