చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

50 రోజుల్లో 10వేలకు పైగా అర్జీలు

టీడీపీ జాతీయ కార్యాలయంలో అర్జీల స్వీకరణ

చైతన్యరధం by చైతన్యరధం
August 3, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
50 రోజుల్లో 10వేలకు పైగా అర్జీలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అర్జీల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక
  • సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అర్జీదారులందరికి న్యాయం జరిగేలా చర్యలు
  • మంత్రి గొట్టిపాటి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పస్టీకరణ
  • టీడీపీ జాతీయ కార్యాలయంలో అర్జీల స్వీకరణ

అమరావతి(చైతన్యరథం): వివిధ సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి వినతి పత్రాలు ఇస్తున్న ప్రజలకు న్యాయం జరిగేలా, గ్రీవెన్స్‌కు వచ్చిన అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రతి అర్జీని పారదర్శకంగా పరిశీలించి, కిందిస్థాయిలో పరిష్కారం కాని వాటిని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామన్నారు. నాయకులు అధికారులు సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

ఇప్పటికే 10 వేలకు పైగా అర్జీలు అందాయన్నారు. ప్రతి అర్జీని సంబంధింత శాఖలకు, ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు పంపి… పరిష్కరించి, ఆ పరిష్కార ఫలితాన్ని మళ్లీ అర్జీదారునికి తెలియజేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల మన్ననలు చూరగొనేలా నడుచుకొంటామని వారు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న గొట్టిపాటి, పల్లా.. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్‌ సమస్యలతో పాటు, వివిధ సమస్యలపై పెద్దఎత్తున అర్జీదారులు పోటెత్తి తమ వినతులను అందించారు. కొందరు నాయకులు..నామినేటెడ్‌ పదవులకోసం రాష్ట్ర అధ్యక్షుడికి వినతి పత్రాలు సమర్పించారు.

తన బిడ్డ చుండూరు కృష్ణతేజకు 90 శాతం అంగవైక్యలం ఉన్నా గత ప్రభుత్వంలో పింఛన్‌ ఇవ్వలేదని, కనీసం కూర్చోలేని స్థితిలో ఉన్న తన బిడ్డపై దయ ఉంచి వికలాంగ పింఛన్‌ మంజూరు చేయాలని మంత్రి గొట్టిపాటి ముందు కృష్ణతేజ తండ్రి చుండూరి బాబు వాపోయారు. వెంటనే స్పందించిన మంత్రి పింఛన్‌ మంజూరుకు చర్యలు తీసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

తన కొడుకు పూర్తిగా 100 శాతం అంగవైకల్యంతో ఉన్నా గతంలో దివ్యాంగ పింఛన్‌ ఇవ్వలేదని, అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంతకం పెట్టించుకు రావాలని అధికారులు చెప్పటంతో ఆయన వద్దకు వెళితే సంతకం పెట్టలేదని పల్నాడు జిల్లా కారంపూడి గ్రామం వాలే వీర నాగేశ్వరరావు వాపోయారు. టీడీపీకి చెందిన వారమనే కారణంతోనే అప్పట్లో పింఛన్‌ మంజూరు చేయలేదన్నారు. తన కొడుకు ఆరోగ్యం సక్రమంగా లేదని, పూర్తి అంగవైకల్యం జాబితాలో పింఛన్‌ అందించాలని విజ్ఞప్తి చేశారు.

తన బిడ్డ సునీల్‌ కుమార్‌ను నవజీవన సంస్థకు చెందిన వ్యక్తి తీసుకెళ్లి ఎన్నారై ఆసుత్రిలో చేర్పించి ప్రాణాలు తీశారని, ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఏకైక కుమారుడిని చంపేసి అతని అవయువాలు తీసుకున్నారని, పోస్ట్‌మార్టం చేసి నిజాలను బయట పెట్టాలని.. విజయవాడకు చెందిన నిర్మల కుమారి వాపోయింది. ఆమెకు ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు.
గత ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని అసలు పట్టించుకోలేదని, అగ్రిగోల్డ్‌ బాధితులు సమస్యలను పరిష్కరిస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినందున సీఎం చంద్రబాబు తమపై దయచూపి తమ సమస్యను పరిష్కరించాలని అగ్నిగోల్డ్‌ బాధితులు గ్రీవెన్స్‌ లో వినతి అందించారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరుకు చెందిన ఆకుల నారాయణ విజ్ఞప్తి చేస్తూ… వైసీపీ నేతల దౌర్జన్యాలతో తాను ధాన్యం అమ్ముకోలేక పోతున్నానన్నారు. వడ్డీలకు డబ్బు తెచ్చుకుని వడ్ల వ్యాపారం చేస్తున్న తాను వైసీపీ నేతల దుర్మార్గంతో తీవ్రంగా నష్టపోతున్నానని, దయచేసి ధాన్యం అమ్ముకునేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం సూదివారిపాలెం, అంబటివారిపాలెం గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ… ఈ రెండు గ్రామాలకు ఒకటే మంచినీటి చెరువు ఉందని… దాంట్లో కొందరు చేపలు పెంచుతూ రసాయనాలు, జంతుకళేబరాలను వేస్తూ తాగునీటిని కలుషితం చేస్తున్నారన్నారు. కలుషిత నీటితో చర్మవ్యాధులు, అతిసార, డెంగ్యూ లాంటి వ్యాధుల బారిన పడుతున్నామని ఆ రెండు గ్రామాల ప్రజలు వాపోయారు. దాన్ని అరికట్టి ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాలని కోరారు. వాటర్‌ ట్యాంక్‌ ఫిల్టర్‌ బావి పునర్నిర్మాణం చేయాలని కోరారు. గ్రామంలో హిందూ శ్మశాన వాటిక పల్లంలో ఉండటంతో దహన సంస్కారాలకు ఇబ్బందిగా ఉందని, నీటి వసతి కూడా లేదని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

నరసాపురం మండలం ఎల్‌బి చెర్ల గ్రామానికి చెందిన పసుపులేటి కనకదుర్గ అనే మహిళ ఫిర్యాదు చేస్తూ… తోట లక్ష్మణ కుమార్‌ అనే వ్యక్తి వలన తన భర్తకు తాను విడాకులు ఇవ్వవలసి వచ్చిందని తెలిపారు. తరువాత తోట లక్ష్మణ్‌ కుమార్‌ తనను పెళ్లి చేసుకుని, కొంత కాలానికి.. తానెవరో తెలియదంటూ వెళ్లి పోవాలని గొడవపెడుతున్నాడని వాపోయింది. ముగ్గురు పిల్లలు ఉన్న తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు.
గతంలో తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల సందర్భంగా హనుమంతాపురం గ్రామం బూత్‌ నెంబర్‌ 195 లో వైసీపీ నాయకులు దొంగఓట్లు వేస్తుంటే అడ్డుకున్నందుకు అప్పటి ఎస్సై చంద్రమౌళి తనను తీవ్రంగా దుర్భాషలాడి తన వయసును కూడా పట్టించుకోకుండా అవమానించాడని టీడీపీ నాయకుడు జె. వి రమణయ్య నాయుడు గ్రీవెన్స్‌ లో ఫిర్యాదు చేశారు. నాడు దొంగ ఓట్లకు సహకరించిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏఎన్‌ఎమ్‌ నుండి జీఎన్‌ఎమ్‌ శిక్షణ కోసం వచ్చిన తమకు రెండు సంవత్సరాలపైన శిక్షణ ఇచ్చి పరీక్ష నిర్వహించారని, అందులో అందులో 84 మందిని అనర్హులుగా ప్రకటించారని, మళ్లీ పరీక్ష నిర్వహించి తగు న్యాయం చేయాలని రాజమండ్రి నుండి వచ్చిన ఏఎన్‌ఎమ్‌లు విజ్ఞప్తి చేశారు. అలాగే తమకు పనికి తగిన వేతం ఇవ్వడం లేదని ఏఎన్‌ఎమ్‌2లు ఫిర్యాదు చేశారు. పనికి తగిన వేతం వచ్చేలా చేయాలని గ్రీవెన్స్‌ లో వినతి పత్రాన్ని అందించారు.
తాను గుంటూరు జిల్లాలోని దాసరిపాలెం ఐటీసీ కంపెనీలో పనిచేస్తుండగా తన చేతి వేళ్లు తెగిపోయాయని, చేతివేళ్లు నష్టపోయిన తనకు కంపెనీ నష్టపరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తొందని, తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలం పల్లపాడు గ్రామానికి చెందిన సాయి మహేష్‌ విజ్ఞప్త్తి చేశాడు.

ఏపీ ట్రాన్స్‌ కో నెల్లూరు సర్కిల్‌, 220 కేవీ ఆత్మకూరు, 220 కేవీ రాచర్లపాడు, 132 కేవీ వింజమూరు సబ్‌స్టేషన్లలో తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మంత్రిని కలిసి సంబంధిత కార్మికులు విజ్ఞప్తి చేశారు.
తమకు జీతాలు ఇప్పించి న్యాయం చేయాలని ఏపీసీఎన్‌ఎఫ్‌( ప్రకృతి వ్యవసాయం) సిబ్బంది వినతి పత్రం సమర్పించారు. 18 నెలలుగా తమకు జీతాలు రాలేదని తెలిపారు. జీతాలు అడిగితే బాపట్ల జిల్లా డీపీఎం దుర్భాషలాడుతుందని, తమకు జీతాలు ఇప్పించి న్యాయం చేయాలని వారు కోరారు.

కడప జిల్లాలో మండల కేంద్రమైన వేముల గ్రామానికి చెందిన బేరి దేవభూషణం విజ్ఞప్తి చేస్తూ.. తాను 2017వ సంవత్సరంలో చిన్నతోట కృపారావు నుండి ఇల్లు కొన్నానని తెలిపారు. దానికి సంబంధించి పూర్తి డబ్బులు చెల్లించినా కృపారావు, పార్థసారథిరెడ్డి అనే వ్యక్తి కుట్ర పూరితంగా ఇంటిని రిజిష్ట్రేషన్‌ చేయడంలేదని ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని గ్రీవెన్స్‌లో విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కు చెందిన ఒక మహిళ రూ. 20,000లకు చెందిన తన ఫోన్‌ ను రూ. 2000లకు ఒకరి దగ్గర తాకట్టు పెట్టానన్నారు. ఆ డబ్బులు తిరిగి చెల్లించినా తన ఫోన్‌ ఇవ్వడంలేదని ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌ ఇప్పించాలని గ్రీవెన్స్‌ లో విజ్ఞప్తి చేశారు.

పార్టీకోసం పనిచేసిన నేతలు నామినేటెడ్‌ పదవులను ఆశిస్తూ పెద్ద ఎత్తున తరలివచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అర్జీలు అందజేశారు. తామ పార్టీకోసం చేసిన కష్టాన్ని గుర్తించి తగిన నామినేటెడ్‌ పదవిని ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.

వైసీపీ నేతల భూ కబ్జాలు, భూ ఆక్రమణలు, అర్హత ఉన్నా గత ప్రభుత్వంలో పింఛన్‌ రాని వారు, విద్యుత్‌ లైన్‌ సమస్యలు. విద్యుత్‌ అధికారుల ఆగడాలు, కళాకారుల సమస్యలు, ఇసుక పాలసీ, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్ల సమస్యలు, బదిలీల కోసం ఉద్యోగులు.. ఇలా వందల మంది అర్జీ దారులు వినతులు ఇచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని నేతలను కోరారు.

Previous Post

మరో ఐదేళ్లు రాజధాని రైతులకు కౌలు

Next Post

ఒకరి అవయవదానంతో మరో 8 మందికి పునర్జన్మ

Next Post
ఒకరి అవయవదానంతో మరో 8 మందికి పునర్జన్మ

ఒకరి అవయవదానంతో మరో 8 మందికి పునర్జన్మ

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.