- రూ.18.55 కోట్ల వ్యయంతో నిర్మాణం
మంగళగిరి(చైతన్యరథం): దేశంలోనే ఆదర్శ నియోజకవర్గం గా మంగళగిరిని తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేష్ నేతృత్వం లో వేగంగా అడుగులు పడుతున్నాయి. మంగళగిరి పట్టణం నిడమర్రు రైల్వేగేట్ వద్ద ఆధునిక హంగులతో మోడరన్ రైతు బజార్ నిర్మాణ పనులకు గురువారం ఆయన భూమిపూజ, శంకు స్థాపన చేశారు. ముందుగా నిడమర్రు రోడ్డులోని శంకుస్థాపన ప్రాంగణానికి చేరుకున్న లోకేష్‌కు టీడీపీ నాయకులు, కార్యకర్త లు, స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మోడరన్ రైతుబజార్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు నమూనా చిత్రాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నా రు. మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచు కుని మంత్రి లోకేష్ మోడరన్ రైతుబజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఆధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
5.90 ఎకరాల విస్తీర్ణంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎసఆర్ నిధులు రూ.18.55 కోట్ల వ్యయంతో ఈ రిటైల్ అండ్ హోల్ సేల్ కూరగాయల మార్కెట్‌ను నిర్మించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో పరిశుభ్రంగా, వినియోగదారులకు అనుకూలంగా, పర్యావరణహితంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 71,925 చదరపు అడుగులు. రిటైల్ మార్కెట్లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాల కోసం 54 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. ఇతర రకాల వస్తువుల కోసం మొత్తం 60 షాపులు ఏర్పాటు చేస్తారు. హోల్‌సేల్ మార్కెట్లో అన్ లోడింగ్ ప్లాట్‌ఫామ్స్ 18, కూరగాయల షాపులు 23 ఉండనున్నాయి. కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాస్, అడ్మిన్, మెయింటెనెన్స్ ఏరియాస్, క్యాంటీన్, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. సరుకులు తరలించే వాహనాలు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ వైస్ ప్రెసిడెంట్ జీ.భీముడు, ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేష న్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎసఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, రూరల్ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, దుగ్గిరాల మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీఅనిత పాల్గొన్నారు.















