- ఢిల్లీ ఏపీ భవన్ అధికారులకు సూచనలు
- సురక్షితంగా తీసుకురావాలని ఆదేశం
- ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షణ
అమరావతి(చైతన్యరథం): నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రి కుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఏపీ యాత్రికుల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. నలుగురు సురక్షితంగా ఉన్నారని.. మరో ముగ్గురు ఆచూకీ లభ్యం కాలేదని ఢిల్లీలోని ఏపీ భవన్ అధికా రులు వివరించారు. కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మ ణ్యం, ఈషా ఫౌండేషన్ గ్రూప్‌కు చెందిన శశికుమార్, రాజ్యలక్ష్మి లు ఆచూకీ లభించలేదని వెల్లడించారు. గల్లంతైన ముగ్గురి ఆచూ కీని కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపు లు జరపాలని లోకేష్ వారికి సూచించారు. చైనాలోని గైరోంగ్ ఎంబసీ వద్ద చివరిసారిగా కనిపించిన ఈషా ఫౌండేషన్ సభ్యుడు శశికుమార్ కనిపించారు. కైలాస మానససరోవర యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా మరో ముగ్గురు క్షేమంగానే ఉన్నారు. సురక్షితంగా ఉన్న వారిని వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశిం చారు. యాత్రికుల భద్రతపై భారత రాయబార కార్యాలయం, చైనా, నేపాల్ ఎంబసీలు, గైరోంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్, ఈషా ఫౌండేషన్ సంస్థలతో నిరంతర సంప్రదింపులు జరపాలని సూచిం చారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికులు, మానస సరోవర యాత్రకు వెళ్లిన ఏపీ వాసులు సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు తెలుసుకుంటున్నారు. మంత్రి నారా లోకేష్ సూచనల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్క ర్ నిరంతరం మానిటర్ చేస్తున్నారు.
తిరుపతి నుంచి 28 మంది యాత్రికులు
నేపాల్ వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రీకుల వివరాలను, వారి క్షేమ సమాచారాన్ని ఆర్టీజీఎస్ సేకరిస్తోంది. మానస సరోవర యాత్రకు వెళ్లి చిక్కుకున్న వారిలో తెలుగు వారు ప్రత్యేకించి ఏపీ వాసులు ఎవరైనా ఉన్నారని ఆరా తీస్తున్నారు. మానస సరోవర యాత్రను నిర్వహించే వివిధ టూరిస్ట్ సంస్థలు, ఏజెన్సీలతో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తిరుపతికి చెందిన 28 మంది తో కూడిన యాత్రికుల బృందం ఖాట్మాండులో ఉన్నట్టు గుర్తించా రు. ఖాట్మాండులోని యెల్లకొండ వద్ద ఒక హోటల్‌లో ఆ బృందం బస చేసింది. ఎలాంటి సహాయం అవసరమైనా తక్షణం తమను సంప్రదించాలని ఆర్టీజీఎస్ అధికారులు వారికి సూచించారు. మళ్లీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందనే హెచ్చరికలు ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వారికి సూచించారు. తామందరం క్షేమంగానే ఉన్నామని..తమను సంప్రదించి యోగక్షేమాలు తెలు సుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులు కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.















