- కలిసికట్టుగా విజయవంతం చేయాలి
- క్లస్టర్ల బలోపేతానికి ఇదో మంచి అవకాశం
- కేఎస్ఎస్, బూత్, గ్రామ,అనుబంధ కమిటీ
- సభ్యులను కార్యక్రమానికి ఆహ్వానించాలి
- ఇన్ఛార్జిలకు నారా లోకేష్ దిశానిర్దేశం
అమరావతి (చైతన్యరథం): క్లస్టర్ స్థాయిలో మహానాడు విజయ వంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 27,28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడు సన్నద్ధతపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 1875 క్లస్టర్ ఇన్ఛార్జ్లతో మంత్రి నారా లోకేష్ ఆన్లైన్లో సమావేశమయ్యారు. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం కాదు.. తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబం. తెలుగుజాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన తెలుగుదేశం. కొవిడ్ సమయంలో మహానాడు నిర్వహించుకోలేకపోతే వర్చువల్ గా ఏర్పాటు చేసుకున్నాం. అనంతరం ఒంగోలులో మహానాడును అద్భుతంగా నిర్వహించుకుని ఎన్నికలకు వెళ్లాం. ఘనవిజయం సాధించాం. ఈ సారి మహానాడును ‘స్త్రీ శక్తి మహానాడు థీమ్’తో నిర్వహించుకుంటున్నాం. మహిళలను పెద్దఎత్తున ప్రోత్సహించా లనే లక్ష్యంతో ముందుకువెళుతున్నాం. అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలి.
నెల్లూరులో ఘనంగా మహానాడు పండుగను నిర్వహించాలనుకున్నాం. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుమేరకు ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నాం. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడులో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రం గా మహానాడును వర్చువల్గా నిర్వహించుకుంటున్నామని తెలిపారు.
ప్రతి క్లస్టర్ కు పార్టీ నుంచి మెటీరియల్ అధ్యక్షులు, గ్రామ కమిటీ, క్లస్టర్ కమిటీ సభ్యులు మహానాడులో పాల్గొనాలి. క్లస్టర్ ఇన్ఛార్జ్ల్కు ఎక్కువ బాధ్యత ఇవ్వాలనేది జాతీయ అధ్యక్షుల వారి ఆదేశం. క్లస్టర్ మోడల్లో మనం ముందుకు వెళ్లాలని ఈ వ్యవస్థను ఏర్పా టు చేసుకున్నాం. క్లస్టర్ బలోపేతానికి ఇదో మంచి అవకాశం. అందరితో అనుబంధం ఏర్పడుతుంది. మహానాడు నిర్వహణపై ఇప్పటికే మార్గదర్శకాలు అందజేశాం. ప్రతి క్లస్టర్కు పార్టీ నుంచి మెటీరియల్ అందజేస్తాం. స్థలం ఎంపిక చేసుకోవడంతో పాటు ఎస్ఈడీ టీవీ, స్పీకర్లు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచుకోవాలి. మై టీడీపీ యాప్ ద్వారా హాజరును నమోదు చేస్తారని చెప్పారు.
మహిళలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలి
క్లస్టర్ పరిధిలో నిర్వహించే మహానాడు విజయవంతానికి ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ లతో సమన్వయం చేసుకోవాలి. పార్టీ పరంగా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తాం. మహిళలు పెద్దఎత్తున భాగ స్వామ్యం అయ్యేలా చూడాలి. ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకో వాలి. అనుబంధ విభాగాలను కూడా ఆహ్వానించాలి. కుటుంబ సాధికార సారధి, అనుబంధ విభాగాలు, కమిటీ సభ్యులకు, బూత్, గ్రామ కమిటీ సభ్యులకు ఆహ్వానాలు పంపాలి. ఇదో మంచి అవ కాశంగా భావించి రాష్ట్రవ్యాప్తంగా కదలిక తీసుకురావాలి. నూటికి నూరుశాతం క్లస్టర్ స్థాయిలో మహానాడు నిర్వహించాలనేది పార్టీ అధ్యక్షులు చంద్రబాబు ఆదేశం. తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.
ప్రజలతో మమేకం కావాలి
పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించేలా కృషి చేయాలి. తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదు. వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకే క్లస్టర్ ఇన్ఛార్జ్ పార్టీ అవకాశం కల్పించింది. ఈ బాధ్యతను మనం స్వీకరించి అమలు చేయాలి. ఏ కార్యక్రమం అయినా క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో పనిచేయాలి. గత 23 నెలలుగా నేను సుమారు 60 నియోజకవర్గాల్లో
మీ క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబ సాధికార సారధి దగ్గరి నుంచి బూత్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ పర్యటించాను. దాదాపు 25 నియోజక వర్గాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశాం. అందరూ సంక్షే మం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నేతలు ప్రజలతో మమేకం కావాలని పేర్కొన్నారు.
పనిచేసే వారికి ప్రాధాన్యం
అందరూ కలిసికట్టుగా పనిచేసే మహానాడు చరిత్రలో మిగిలి పోయే కార్యక్రమంగా నిర్వహించాలి. నామినేటెడ్ పదవుల్లో పని చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చాం. మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వారిని గుర్తిస్తున్నాం. నియోజకవర్గ పర్యటనల్లో సీఎం, నేను ముందుగా కార్యకర్తలను కలుస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుంది. త్వరలో స్థానికసంస్థలు ఎన్నికలు రాబో తున్నాయి. ఇందుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అంద రూ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలి. ఇందుకు వేదిక గా మహానాడును వినియోగించుకోవాలి. అందరూ కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజక వర్గ ఇన్ఛార్జ్లు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షు లు, ప్రధాన కార్యదర్శులు, మండల, పట్టణ, డివిజన్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.













