అమరావతి : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, బిసిల బెబ్బులి, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును ఏవిధంగానైనా జైల్లో పెట్టాలన్న ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డి ప్లాన్ మరోమారు విఫలమైంది. ఎప్పటి మాదిరిగానే ఎపిసిఐడి చీఫ్ సునీల్‌కుమార్ నేతృత్వం లోని సిఐడి పోలీసులు ముఖాలకు మాస్క్‌లు, రుమా ళ్లు ధరించి దొంగలమాదిరిగా తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో మఫ్టీలో ఉన్న వందలాది పోలీసులు కరుడుగట్టిన టెర్రరిస్టును చుట్టుముట్టినట్లుగా నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రడు ఇంటికి చేరుకున్నా రు. ముందున అయ్యన్నపాత్రుడు కుమారుడు రాజేష్ ను అదుపులోకి తీసుకొని కొట్టుకుంటూ వెళ్లి గోడ దూకించి మరీ పోలీస్ వ్యాన్ ఎక్కించారు. ఆ తర్వాత 70ఏళ్ల వయసున్న అయ్యన్నపాత్రుడును లుంగీపై ఉండగానే కనీసం చెప్పులు కూడా వేసుకోనీయకుండా సిఐడి అధికారులు అత్యంత అమానవీయంగా నెట్టుకుంటూ పోలీసు జీపులోకి నెట్టారు. తెల్లవారే సరికి అయ్యన్నపాత్రుడు అరెస్టు విషయం రాష్ట్రవ్యాప్తంగా దావనలంలా వ్యాపించింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరు గని విధంగా 151 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపి శ్రేణులు ఆందోళనలు చేపట్టి లక్షలాదిమంది కార్య కర్తలు పాల్గొన్నారు. అటూఇటూ తిప్ప సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో అయ్యన్న పాత్రుడు, ఆయ న కుమారుడు రాజేష్ లను విశాఖలోని చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరపర్చగా, తప్పుల తడప రిమాండ్‌రిపోర్టు చూసిన జడ్జివారిద్దరికీ రిమాం డ్‌ను తిరస్కరించారు. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లకు 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తొత్తు సునీల్ కుమార్ ఎత్తుగడ మరోమారు విఫలమైంది. అయ్యన్న పాత్రుడుకు మద్దతుగా నర్సీపట్నంలో షాపులన్నీ స్వచ్చందంగా మూసివేసి వేలా దిమంది కార్యకర్తలు, ప్రజలు సంఫీు భా వంగా భారీ ర్యాలీ నిర్వహించారు. అయ్య న్న రిమాండ్‌ను తిరస్కరించిన విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణు లు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నా యి. విశాఖపట్నం, నర్సీపట్నంలలో బాణా సంచా పేల్చి ఆనందం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడిని రాక్షసుల్లా వేధింపులకు గురిచేసిన వ్యవహారంపై ఉదయం నుంచి తీవ్రంగా కలతచెందిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖ కోర్టు తీర్పుతో ఆనందం వ్యక్తంచేస్తూ న్యాయం గెలిచింది, ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందంటూ ట్వీట్ చేశారు. విశాఖ కోర్టు తీర్పునకు ముందు అయ్యన్న అక్రమ అరెస్టుపై హైకోర్టులో ఆయన లాయర్లు వేసిన లంచ్ మోహన్ పిటిషన్ విచారణకు వచ్చింది. పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు… కేసు డైరీని సమర్పించాలని సీఐడీని ఆదేశించింది. అయ్యన్నపాత్రుడికి సిఐడి పోలీసులనుంచి విడుదలైన వెంటనే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి ఆయన పోరాటాన్ని ప్రశంసించారు. ఇకపై కూడా ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, కబ్జాలపై పోరాటం కొనసాగిస్తానని అయ్యన్న పేర్కొన్నారు. సిఐడి పోలీసుల నుంచి విడుదలైన తర్వాత అయ్యన్నపాత్రుడు విలేకరులతో మాట్లాడుతూ..ఉదయం 3 గంటలకు తమ ఇంటి వద్దకు పోలీసులు వచ్చి, గోడలు దూకి ఇంట్లోకి ప్రవేశించారన్నారు. కట్టర్ లతో గేట్లు కోసి అక్రమంగా చొరబడ్డారన్నారు. నోటీసులు ఇవ్వమంటే దురుసుగా ప్రవర్తించారని, బట్టలు వేసుకుంటుంటే బలవంతంగా అరెస్టు చేసి జీపు ఎక్కించారన్నారు. సీఎంను విమర్శిస్తే తన గొంతునొక్కాలని ప్రయత్నిస్తున్నారని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇంత దౌర్జన్యం లేదన్నారు. సీఎం ఎన్ని కేసులు బనాయించినా లొంగే ప్రసక్తిలేదని, అధికారపార్టీ అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టంచేశారు. విశాఖ కోర్టులో తీర్పు వెలువడిన వెంటనే మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడుతూ.అక్రమ కేసులతో మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు. కావాలంటే చెప్పండి.మేమే జైలు భరోతో స్వచ్చందంగా జైలుకు వస్తాం, జగన్ కు తొత్తుగా పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బంది పడేది సీఐడీ అధికారులేనని స్పష్టంచేశారు. ఏది ఏమైనా డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చట్టం, న్యాయం బతికే ఉన్నాయని మరోమారు నిరూపితమైంది. జగన్ రెడ్డి తొత్తులుగా మారిన సిఐడి పోలీసులకు ఇప్పటికైనా భగవంతుడు జ్జానోదయం ప్రసాదించాలని చైతన్యరథం కోరుకుంటోంది.