- జగన్ లండన్ పర్యటనకు బ్రేక్
- వరదల్లో ఇబ్బంది పడుతున్న జనం కోసమేనని వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారం
- అసలు కారణం తెలిశాక ఛీ కొడుతున్న ప్రజలు
అమరావతి(చైతన్యరథం): జగన్ రెడ్డి లండన్ ప్రయాణం ప్రస్తుతానికి ఆగిపోయింది. అయితే వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారం చేస్తున్నట్లుగా.. జనం వరదల్లో ఇబ్బందులు పడుతున్నందున జగన్ పర్యటన వాయిదా వేసుకోలేదు. పాస్‌పోర్ట్ కష్టాల కారణంగానే జగన్ లండన్ పర్యటన ఆగిపోయింది. ఇటీవలి ఎన్నికల్లో ఘోరపరాజయంతో సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లొమాట్ పాస్‌పోర్ట్ రద్దయింది. జనరల్ పాస్‌పోర్ట్ కోసం జగన్ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3నుంచి 25వరకు లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు జగన్‌కు అనుమతి ఇవ్వగా.. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో ఉన్న పెండిరగ్ కేసుపై నిరంభ్యతర పత్రం (ఎన్వోసీ) తీసుకోవాలంటూ ఇటీవల పాస్‌పోర్టు కార్యాలయం జగన్‌కు లేఖ రాసింది. ఎన్వోసీ కోసం విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో జగన్ పిటిషన్ వేయగా.. ఒక ఏడాది పాటు పాస్‌పోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో జగన్ లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జగన్ లండన్ టూర్‌కు సీబీఐ కోర్టు ఇప్పటికే అనుమతి ఇచ్చిందని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల కోర్టు షరతులు విధించిందని హైకోర్టుకు తెలిపారు.. ఈ విధంగా షరతులు విధించడం సరికాదన్నారు. ఎన్వోసీ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
పాస్‌పోర్ట్ రాకపోవడంతో జగన్ లండన్ ప్రయాణం వాయిదా పడిరది. ఇది అసలు వాస్తవం కాగా.. వైసీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం వరదలతో ఇబ్బంది పడుతున్న జనం కోసం లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారని ప్రచారం చేస్తోంది. ఆయితే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్‌తో నిజం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకూ తమ కోసం జగన్ లండన్ ప్రయాణం మానుకున్నారని అనుకున్న జనం వాస్తవం తెలుసుకుని విస్తుపోతున్నారు. లండన్‌కు వెళ్లే దారిలేక విజయవాడలో బురద రాజకీయం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. పాస్‌పోర్టు ఉంటే జనం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా సరే జగన్ వెంటనే లండన్ వెళ్లిపోయేవారని, అది లేకపోవటంతో నీచ రాజకీయాలు చేస్తున్నారని అసహ్యించుకుంటున్నారు. వరదలకన్నా అబద్ధాల జగనే రాష్ట్రానికి పెద్ద విపత్తు అని చీదరించుకుంటున్నారు.