చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సీమ ద్రోహి జగన్!

మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ మంత్రి సవిత

by చైతన్యరధం
July 7, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, రాయలసీమ
సీమ ద్రోహి జగన్!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ‘రైజింగ్ రాయలసీమ’ కూటమి ప్రభుత్వ లక్ష్యం
  • కర్నూలులో గోల్డ్ మైనింగ్, డ్రోన్ సిటీ..
  • తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్
  • రాయలసీమకు భారీ మౌలిక వసతులు
  • మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ మంత్రి సవిత

మంగళగిరి (చైతన్య రథం): ఎన్నికల సమయంలో “నా బీసీలు” అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఉక్కుపాదంతో అణచివేశారని మంత్రి సవిత ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించారని, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి రుణాలు నిలిపివేశారని, ఆదరణ పథకాలను రద్దు చేశారని విమర్శించారు. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, బాపట్ల జిల్లాలో అమర్‌నాథ్‌గౌడ్ వంటి బీసీల హత్యలు జరిగాయని, అనేకమంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతోపాటు తనపైనా, సామాన్య బీసీ కార్యకర్తలపైనా తప్పుడు కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.

‘రైజింగ్ రాయలసీమ’ సీఎం చంద్రబాబు లక్ష్యం
రాయలసీమను హార్టికల్చర్, ఐటీ, పరిశ్రమలు, డిఫెన్స్, పర్యాటకం, డ్రోన్ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో దాదాపు మూడో వంతు, అంటే రూ.85 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాయలసీమకే వచ్చాయని వెల్లడించారు. కడప జిల్లాలో భారీ ప్రాజెక్టులు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. 2028 నాటికి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించి సుమారు 2,500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడం లక్ష్యమని చెప్పారు. టి.కొండూరు గ్రామంలో రూ.3,000 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు ఇప్పటికే అందుబాటులోకి వచ్చిందని, అదానీ సంస్థ రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. స్థానిక యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ‘స్టార్టప్ కడప’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.

కర్నూలులో గోల్డ్ మైనింగ్, డ్రోన్ సిటీ
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో భారతదేశంలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు రూ.406 కోట్లతో ప్రారంభమై వాణిజ్య ఉత్పత్తి చేపట్టిందని మంత్రి తెలిపారు. అదే విధంగా ఓర్వకల్లులో అత్యాధునిక డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నామని, పారిశ్రామిక ప్రాంతంలో భారీ బెవరేజెస్ తయారీ యూనిట్ త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు.

శ్రీసత్యసాయిలో డిఫెన్స్ హబ్
పుట్టపర్తిలో డీఆర్‌డీవో ఆధ్వర్యంలో రూ.15,800 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. అదే జిల్లాలో రిలయన్స్ సంస్థ రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్, గ్రిడ్ బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు.

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్
తిరుపతిలో రూ.2,508 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఏడాది వ్యవధిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అన్నమయ్య-తిరుపతి జిల్లాల సరిహద్దులో స్క్రీన్ సిటీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిని ఐటీ హబ్‌గా, తిరుపతి-కడప ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం
రాయలసీమను శాశ్వత కరవు రహిత ప్రాంతంగా మార్చేందుకు హంద్రీ–నీవా, గాలేరు–నగరి, పోతిరెడ్డిపాడు, వెలిగొండ వంటి సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని, వాటిని పూర్తి చేసేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆమె పేర్కొన్నారు.

రాయలసీమకు భారీ మౌలిక వసతులు
రాయలసీమ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో భారీ పెట్టుబడులు తీసుకొస్తోందని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విమర్శించారు. మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామికీకరణ, గత ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం
బెంగళూరు–హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ పరిధిలోకి వచ్చే అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రహదారులు, కనెక్టివిటీ నెట్‌వర్క్‌ను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాయలసీమలో పరిశ్రమలు, ఐటీ, డిఫెన్స్, వ్యవసాయం, పర్యాటక రంగాలకు అనుగుణంగా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మంత్రి, రాయలసీమ అభివృద్ధిపై ఆయనకు ఆసక్తి లేదన్నారు. “ఒక సైకో రెడ్డి ఉన్నాడు… ఆయనకు అభివృద్ధి పట్టదు. రక్తం చూస్తేనే ఆయనకు తెల్లారుతుంది… శవాలు చూస్తేనే పూట గడుస్తుంది. ఆయన విజన్ విధ్వంసం, హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలైతే… మా నాయకుడు చంద్రబాబు నాయుడు విజన్ అభివృద్ధి, సంక్షేమం, ప్రపంచంలో తెలుగువారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టడం” అని వ్యాఖ్యానించారు.

‘రాయలసీమ ద్రోహి జగన’
వైసీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఆరోపించారు. ఐదేళ్ల పాలనలో 102 రాయలసీమ అభివృద్ధి ప్రాజెక్టులను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. 2014–19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా, జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే వ్యయం చేసిందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.7 వేల కోట్లకు పైగా ఖర్చు చేసిందని, ఇంకా భారీగా నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. రాయలసీమ రైతాంగం, ప్రజల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.

పరిశ్రమలను తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వమే :
గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క కొత్త పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదని మంత్రి విమర్శించారు. “జే ట్యాక్స” పేరుతో ఇప్పటికే ఉన్న పరిశ్రమలను కూడా రాష్ట్రం నుంచి వెళ్లగొట్టిందని ఆరోపించారు. రాయలసీమ స్టీల్ ప్లాంట్‌కు కేవలం టెంకాయ కొట్టి వదిలేసిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చిందని చెప్పారు.

రతనాల సీమగా తీర్చిదిద్దడమే లక్ష్యం :
రాయలసీమ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన అభిమానం ఉందని మంత్రి తెలిపారు. ఒకప్పుడు రాయలవారు పాలించిన ఈ ప్రాంతాన్ని మళ్లీ “రతనాల సీమ”గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అందుకే వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, ఐటీ, డిఫెన్స్, విద్య, పర్యాటకం, హార్టికల్చర్ వంటి అన్ని రంగాల్లో రాయలసీమకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గతంలో అభివృద్ధిలో వెనుకబడిన జిల్లాలు నేడు పెట్టుబడుల గమ్యస్థానాలుగా మారుతున్నాయంటే దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వమే కారణమని మంత్రి సవిత పేర్కొన్నారు.

Previous Post

బీసీల అభ్యున్నతి టీడీపీ లక్ష్యం

Next Post

“హే రామ” అనే అర్హత జగన్‌కు లేదు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-11-2026

November 20, 2026
వైద్యవిద్యలో ఆడపిల్లలే ముందంజ
ఆంధ్రప్రదేశ్

వైద్యవిద్యలో ఆడపిల్లలే ముందంజ

November 20, 2026
మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్
ఆంధ్రప్రదేశ్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

November 20, 2026
జగన్ అక్రమాస్తుల కేసు..స్టేటస్ రిపోర్టు సమర్పించండి
ఆంధ్రప్రదేశ్

జగన్ అక్రమాస్తుల కేసు..స్టేటస్ రిపోర్టు సమర్పించండి

November 20, 2026
పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచే నామినేషన్ల పర్వం
ఆంధ్రప్రదేశ్

మూడో విడత పంచాయతీ పోరు

November 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-11-2026

November 19, 2026
Next Post
“హే రామ” అనే అర్హత జగన్‌కు లేదు

“హే రామ” అనే అర్హత జగన్‌కు లేదు

ముఖ్య వార్తలు

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

ఐక్యతే మన బలం…

ఐక్యతే మన బలం…

by చైతన్యరధం
November 19, 2026

పంచాయతీల్లోనూ కూటమి జెండా ఎగరాలి ప్రతి ఇంటికీ వెళ్లాలి..ప్రతిఒక్కరినీ ఓటు అడగాలి ప్రభుత్వం చేసిన మంచి పనులతో పాటు గొడ్డలి పార్టీ కుట్రలనూ ప్రజలకు వివరించాలి ముఖ్యనేతలతో...

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

వరుస తుఫాన్లతో నష్టం వాటిల్లింది… తక్షణ సాయం అందించండి

by చైతన్యరధం
November 18, 2026

రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది రాయలసీమ హార్టికల్చర్ హబ్కు నిధులు విడుదల చేయండి వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్...

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

రామోజీ సేవలు దేశానికి స్పూర్తి

by చైతన్యరధం
November 17, 2026

విజయవాడ(చైతన్యరథం): రామోజీరావు 90వ జయంతిని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు ఆయన పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు....

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 20-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 20-11-2026

by కార్యకర్త
November 20, 2026

వైద్యవిద్యలో ఆడపిల్లలే ముందంజ

వైద్యవిద్యలో ఆడపిల్లలే ముందంజ

by చైతన్యరధం
November 20, 2026

మొత్తం సీట్లలో 61.34 శాతం ప్రవేశాలు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు అభినందనలు అమరావతి(చైతన్యరథం): ఏపీలో వైద్య విద్యలో ఆడబిడ్డలు ఎక్కువ సీట్లు దక్కించుకోవడంపై సీఎం చంద్రబాబు...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

జగన్ అక్రమాస్తుల కేసు..స్టేటస్ రిపోర్టు సమర్పించండి

జగన్ అక్రమాస్తుల కేసు..స్టేటస్ రిపోర్టు సమర్పించండి

by చైతన్యరధం
November 20, 2026

హైదరాబాద్/అమరావతి(చైతన్యరథం): వైసీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డి కేసుల ప్రస్తుత పరిస్థితిపై స్టేటస్ రిపోర్టు సమర్పిం చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి గురువారం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.