- మొత్తంగా 1.06 కోట్ల ఇళ్లకు చేరుకున్న కార్యక్రమం
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత దగ్గరగా చేర్చడం, ప్రభుత్వ పనితీరుపై ప్రజల స్పందనను నేరుగా తెలుసుకోవడం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమం 43వ రోజు సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగింది. 43వ రోజు రాష్ట్రవ్యాప్తంగా 1,30,402 ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1.06 కోట్ల ఇళ్లు సందర్శించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలుస్తూ, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరిస్తున్నారు. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేస్తున్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలు, అభిప్రాయాలను నేరుగా సేకరించి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా, ప్రజా భాగస్వామ్యంతో విస్తృతంగా కొనసాగుతోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం వహిస్తున్నారు.













