- వైసీపీ ఒక హిట్ అండ్ రన్ పార్టీ
- ఇక్కడకు వస్తే అడ్డంగా దొరికిపోతారని భయం
- అభ్యర్థుల ప్రతిభతోనే డీఎస్సీలో ఉద్యోగాలు
- విశ్వసనీయతను దెబ్బతీయడం మీ తరం కాదు
- 148 రోజుల్లోనే పారదర్శకంగా నియామకాలు
- తుది ప్రక్రియ వరకు ఆన్‌లైన్‌లోనే వివరాలు
- ఒడిశా కూలీలు, 90 ఏళ్ల జెన్జీలతో
- జగన్‌రెడ్డి ఫేక్ ప్రదర్శనలు, కుట్రలు
- వారి ఆరోపణలు సహించలేక టీచర్లే రోడ్డెక్కారు
- మా ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీ..
- కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదు
అమరావతి(చైతన్యరథం): మెగా డీఎస్సీ నియామకాల్లో ఎక్కడా ఎటువంటి తప్పులు దొర్లలేదు..అత్యంత పారదర్శకంగా నియా మక ప్రక్రియ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలన్నీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే ఉంచామని వివరించారు. వైసీపీ నేతలు హిట్ అండ్ రన్ చర్యలతో దీనిపై దుష్ప్రచారం చేస్తున్నా రని ఆక్షేపించారు. మెగా డీఎస్సీ నియామకాల అంశంపై సోమవా రం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. మంచి విద్య, నైపుణ్యాలు అందిస్తే అత్యుత్తమ మానవవనరులుగా విద్యార్థులు తయారవుతారని మేం విశ్వసించాం..దానికి అనుగు ణంగానే చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఐటీని ప్రోత్సహించ టం ద్వారా టెక్నాలజీలో ప్రపంచంలోనే అత్యుత్తమ మానవ వనరులు తయారు చేశాం. విద్యరంగాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించింది. రెసిడెన్షియల్ పాఠశాల ద్వారా నాడు ఎన్టీఆర్ సంస్కరణలు తెచ్చారు. మహిళలకు ఉన్నత విద్యావకా శాలు కల్పించేందుకు మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది మొదట ఎన్టీఆరే. నేను సీఎం అయిన తొలినాళ్లలోనే ఉమ్మడి రాష్ట్రంలో పాఠశాల లేకపోవటంపై తక్షణ చర్యలు తీసుకున్నాం. ప్రతీ కిలోమీటరుకు ఓ ప్రాథమిక పాఠశాల, ప్రతీ మండలానికి ఓ జూనియర్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, జిల్లాకు మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేశాం. విద్యా ప్రమాణాలు పెంచితేనే అభివృద్ధి సాధ్యం అవుతుందని భావించి ఈ పనులు చేసినట్లు చెప్పారు.
11 డీఎస్సీలు నిర్వహిస్తే ఒక్క ఫిర్యాదు లేదు
ఉపాధ్యాయుల నియామకాలు చేయని 2019-24 మధ్య ఉన్న పాలకులు విద్యారంగంపై డబ్బాలు కొట్టుకున్నారు. ఇప్పటివరకూ 14 డీఎస్సీలు జరిగితే..టీడీపీ, ఎన్డీయే హయాంలో 11 డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టాం. ఇంతవరకూ అవినీతి జరిగిందని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. పాఠశాల లకు విద్యార్థుల హాజరు పెంచాలనే లక్ష్యంతో గతంలో డ్రై రేషన్ కూడా అందించాం. మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా రాష్ట్రంలో నాడు టీడీపీనే ప్రవేశపెట్టింది. ఇంటర్ విద్య వరకూ ఈ పథకాన్ని విస్తరించాం. మహిళలకు విద్యలో కూడా రిజర్వేషన్ కల్పించేలా నిర్ణయం తీసుకున్నాం. ఉపాధ్యాయుల బదిలీని పారదర్శకంగా చేసేందుకు ప్రత్యేకంగా ఓ చట్టమే తీసుకువచ్చాం. గడచిన 30 ఏళ్లుగా విద్యారంగంలో వినూత్న సంస్కరణల ద్వారా మార్పులు తెచ్చాం. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్యాసంస్థలు సహా పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. 2019-24 మధ్య 10-12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లకు రావటం మానేశారు. అందుకే తల్లికి వందనం పేరిట పిల్లలందరికీ ఆర్థికసాయం అందించేలా మేం నిర్ణయం తీసుకుని అమలు చేశాం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచటంతో లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్ల కు వచ్చారని వివరించారు.
డీఎస్సీ నియామక ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే
గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ నియామకాన్ని కూడా చేపట్టలేదు. మేం అధికారంలోకి వస్తూనే తొలి సంతకం చేసి మెగా డీఎస్సీతో 15,941 ఉద్యోగాలను భర్తీ చేశాం. కేవలం 148 రోజుల్లోనే ప్రక్రియ అంతా పారదర్శకంగా పూర్తి చేసి నియా మకాలు పూర్తి చేశాం. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు సహా హారి జాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియను కట్టుదిట్టంగా చేపట్టాం. 13 సబ్జెక్టుల్లో 42 వేల ప్రశ్నలు ఎంపిక చేసి అత్యుత్తమ విధా నంలో పరీక్ష నిర్వహించాం. 154 సెంటర్లలో పరీక్షలు సీబీటీ విధానంలో చేపట్టి ఫలితాలను కూడా పారదర్శకంగా విడుదల చేశాం. పూర్తి ప్రతిభ ప్రకారం 15,941 మందిని ఎంపిక చేసి నియామకాలు చేశాం. జోనల్, రాష్ట్రస్థాయి కమిటీతో పాటు అప్పీలేట్ అథారిటినీ కూడా పెట్టి ఫిర్యాదులను పరిష్కరించాం. స్పోర్ట్స్ కోటా కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల్నే అమలు చేశాం. ఉద్యోగాలు వచ్చిన వారంతా అత్యుత్తమ ప్రతిభ కలిగిన వ్యక్తులు, ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నారు. మెగా డీఎస్సీ ద్వారా తమ కష్టానికి ఫలితం దక్కిందని టీచర్లు చెప్పారు. మెరిట్ కమ్ రోస్టర్ విధానంలోనే రిజల్ట్స్ ఇచ్చాం. ఎంపిక ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ఉంది. ఇంతకంటే పారద ర్శకత ఎక్కడ ఉంటుంది? ప్రభుత్వంలో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఓ ఐఎఎస్ అధికారి, ఓ మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. నోటిఫికేషన్‌లో నియామక ప్రక్రియలో ఒక్క డీవియేషన్ కూడా లేదు. లిటిగెంట్ పార్టీకి చెందిన వ్యక్తులు వంద ల కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. అధికారికంగా వివరణ ఇచ్చినా రోజుకో కుట్ర చేస్తూనే ఉన్నారు. డీఎస్సీపై గొడ్డలి పార్టీ ఒడిశా కూలీలతో, 90 ఏళ్ల జగన్ జెన్‌జీ వ్యక్తులతో ధర్నాలు చేయించింది. ఈ ఆరోపణలు ఇక సహించలేక ఇప్పుడు టీచర్లే రోడ్డుపైకి వచ్చారు. మొన్న కర్నూలులో, నిన్న విజయవాడలో పెద్ద ఎత్తున టీచర్లు ఆందోళన చేశారు. పిల్లలకు పాఠాలు చెబుతాం, ప్రతిభను కించ పరిస్తే గుణపాఠం కూడా చెబుతామని వారు నినదించారు”అని ముఖ్యమంత్రి అన్నారు.
అసెంబ్లీకి రాకుండా పబ్జీలు
మా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీ, కుట్రలు చేసే పార్టీలకు, వ్యక్తులకు కాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసురుతున్నాను. అసెంబ్లీకి వస్తే అడ్డంగా దొరికిపోతారనే వాళ్లు రావటం లేదు. రోడ్డుపై హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహ రిస్తున్నారు. రాష్ట్రంలో ఏ కుట్రలూ పనిచేయవని డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి భరోసా ఇచ్చారు. పూర్తి పారదర్శ కతతో, జవాబుదారీతనంతో నియామకాలు జరిగాయి. విద్యా విధానంలో సంస్కరణలతో పాటు పరీక్షల్లోనూ మరింత పారదర్శ కత తీసుకువస్తాం. సిగ్గులేని ఆ పార్టీ అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలు ఆడుకుంటున్నారు. బాధ్యత కలిగిన వ్యక్తులు శాసనసభకు వచ్చి డిమాండ్ చేయాలి. రెండున్నర ఏళ్ల నుంచి అసెంబ్లీకి రాని పార్టీని చూడటం నా జీవితంలో ఇదే తొలిసారి. అసెంబ్లీకి రాకుం డానే జీతాలు, ప్రివిలేజెస్ తీసుకుంటున్నారు. అనే నేనుగా నాకు ప్రజలపై పూర్తి బాధ్యత ఉంది. వారికి ఏముందో ప్రజలే చెప్పాలని స్పష్టం చేశారు.














