అమరావతి(చైతన్యరథం): భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఎక్స’ వేదికగా స్పందించారు. చరిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైంది.. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం లో సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో విమానం భోగాపు రం విమానాశ్రయానికి చేరుకుందన్నారు. తొలి విమానం రాకతో ఏపీ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉత్తరాం ధ్రకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం.. రాష్ట్రంలో కొత్త అవకా శాలకు బాటలు వేస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. యువత ఆశలు, ఆకాంక్షలకు ఈ విమానాశ్రయం రెక్కలు తొడుగుతుందని.. విద్య, ఉద్యోగాలు, వ్యాపార అవకాశాలకు మరింత ఊతమిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకంగా మార నుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చరిత్రాత్మక కొత్త ఆరంభమని.. ఉత్తరాంధ్రకు కొత్త గేట్‌వేగా అవతరించనుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఏపీ కొత్త శకానికి నాంది పలికిందని వెల్లడించారు.














