- రాయలసీమ దశ దిశ మార్చేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్
- నేడు మదనపల్లెలో రూ.లక్ష కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం
- ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన
- ఫ్రూట్ బౌల్‌గా మార్చేలా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు
- పాల్గొననున్న సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థికమంత్రి
- నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్
అమరావతి(చైతన్యరథం): రాయలసీమ ప్రాంతాన్ని ఫ్రూట్ బౌల్‌గా తీర్చిదిద్దేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు కూటమి ప్రభు త్వం శ్రీకారం చుట్టనుంది. విత్తనం నుంచి విదేశాలకు ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతి చేసే వరకు రైతులకు అండగా నిలిచేలా ప్రణాళికాబద్ధంగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం రూపకల్పన చేసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లు హార్టీకల్చర్ హబ్‌కు శ్రీకారం చుట్టనున్నారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో మూడు దశల్లో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఆవిష్కృతమయ్యేలా పనులు చేపట్టనున్నారు. ఇందులో ఎన్డీఏ ప్రభుత్వం రూ.40,352 కోట్లు సమకూరుస్తుం డగా, ప్రైవేట్ రంగం నుంచి రూ.60,000 కోట్లు పెట్టుబడులు రాబట్టేలా ప్రణాళికలు రూపొందించారు. అనంతపురం, అన్నమ య్య, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, తిరుపతి, కడప, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఈ ప్రాజెక్టు కింద వివిధ పనుల ను చేపట్టనున్నారు. 10 జిల్లాల పరిధిలోని మొత్తం 303 మండలాలు, 5,869 గ్రామాల్లో 201 క్లస్టర్ల ద్వారా అభివృద్ధి పనులు జరిగేలా ప్రణాళికలను సిద్దం చేశారు.
ప్రస్తుతం 8.41 లక్షల హెక్టార్లలో ఉన్న ఉద్యాన సాగును మరో 6 లక్షల హెక్టార్లు విస్తరించి 14.41 లక్షల హెక్టార్లకు చేర్చనున్నారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం 222 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 435 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రాజెక్టు కోసం పని చేయనున్నారు దీని ద్వారా సుమారు 9.6 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. కొత్తగా 9 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తీసుకురావటంతో పాటు , 4.3 లక్షల ఎకరాలను స్థిరీకరించనున్నారు. ప్రభుత్వం వెచ్చించే రూ.40,352 కోట్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.20,884 కోట్లు, ఉద్యాన అభివృద్ధికి రూ.15 వేల కోట్లు, రహదారులకు రూ.4,562 కోట్లుగా విభజించుకుని ప్రణాళిక బద్దంగా ప్రాజెక్టు ను అమలు చేయనున్నారు. దీంట్లో భాగంగా భారీఎత్తున ఇరిగేష న్ ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్, రహదారులు, లాజిస్టిక్స్ వంటి అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రైస్ బౌల్‌గా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌కు ఫ్రూట్ బౌల్ కీర్తి సాధించేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రణాళిక రూపొందింది. మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బెర్రీలు వంటి పంటలకు ప్రోత్సాహం ఇస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతులకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు రాబట్టేలా చర్యలు చేపట్టను న్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అమలు కోసం దాదాపు ఆరు నెలలుగా పెద్దఎత్తున కసరత్తు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ..వ్యవసాయ, ఉద్యాన, ఆర్థిక, ఇరిగేషన్ శాఖలతో నిరంతరం సమీక్షలు నిర్వహించారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టును సాకారం చేసుకున్నారు. రాయలసీమ రైజింగ్‌లో భాగంగా ఉద్యాన వెలుగులు నింపేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రూపుదిద్దుకుంటోంది.
మదనపల్లెలో తొలి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్
వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభసాటిగా తీర్చిదిద్దేందు కు సరికొత్త వ్యవస్థ ఏర్పాటుకు వేదిక కానున్న ఆంధ్రప్రదేశ్. మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. పారిశ్రామికాభివృద్ధికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో వ్యవసాయాభివృద్ధికి ఈ సంస్థ ఏర్పాటు కానుంది. సీఎం చంద్రబాబు సూచనలతో ఈ స్కూల్ ఏర్పాటు, నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రిల యన్స్ సంస్థ ముందుకు వచ్చింది. వ్యవసాయ రంగంలోని సవాళ్లకు పరిష్కారం చూపేలా రైతులకు టెక్నాలజీ ఆధారిత సలహాలు అందించనున్న ఈ స్కూల్…ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ అధ్యయనం, డిజిటల్ అగ్రికల్చర్, ప్రెసిషన్ ఫార్మింగ్, క్రాప్ మానిటరింగ్, స్మార్ట్ ఇరిగేషన్, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై దృష్టి సారించనుంది. అగ్రిసైన్స్, డిజిటిల్ టెక్నాలజీ, ఏఐ, క్లైమేట్ సైన్స్, అగ్రిబిజినెస్, ప్రాసెసింగ్, మార్కెట్ ఇంటెలి జెన్స్ సహా వివిధ అంశాల్లో ఐఎసఏ ద్వారా సేవలు అందుతాయి. డేటా డ్రివెన్ ప్రిడిక్టివ్ అగ్రికల్చర్ ద్వారా సంప్రదాయ వ్యవసా యాన్ని ఆధునికీకరించేలా ఐఎసఏ సేవలు అందించనుంది. ఉద్యాన, వ్యవసాయ రంగాల్లో డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేసేలా రైతులకు ఐఎసఏ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అందిస్తుంది. వ్యాల్యూచైన్, ధరలు, కార్పోరేట్ సంస్థలు, వ్యవస్థీకృత మార్కెట్లకు రైతులను, ఎఫ్ పీఓలను అనుసంధానించేలా ఐఎసఏ సేవలు అందిస్తుంది. వ్యవసాయరంగంలో స్టార్టప్‌లకు ప్రోత్సాహంతో పాటు ఇంక్యుబేష న్ సెంటర్లను ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అభివృద్ధి చేస్తుంది.














