చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

వేళ్ల అంచుల్లో సర్కారు సేవలు

నవంబర్‌ 30నుంచి వాట్సాప్‌లో వంద సేవలు

by చైతన్యరధం
Oct 24, 2024 at 7:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
వేళ్ల అంచుల్లో సర్కారు సేవలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • మెరుగైన పౌరసేవలకు మెటాతో ఒప్పందం
  • నవంబర్‌ 30నుంచి వాట్సాప్‌లో వంద సేవలు
  • డిజిటల్‌ ఇండియాలో ఆంధ్రా కొత్తపుంతలు
  • విప్లవాత్మక మార్పులకు సర్కారు శ్రీకారం..
  • దేశంలోనే ఇది తొలి ప్రయోగం

అమరావతి (చైతన్య రథం): ఏపీ ప్రభుత్వం పాలనా విధానాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. పౌర సేవలను ప్రజల చేతివేళ్ల అంచులకు చేరుస్తూ.. మెటా ఫ్లాట్‌ఫాంతో ఒప్పందం కుదుర్చుకుంది. పౌర సేవలను వాట్సాప్‌కు అనుసంధానిస్తూ.. పాలనా విధానాన్ని సులభతరం, వేగవంతం చేసింది. పాలనకు సాంకేతికతను అనుసంధానించి పన్డీయే ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడమే కాదు, దేశంలోనే తొలి ప్రయోగంగా పౌర సేవలను ప్రజల చేతివేళ్ల అంచులకు చేర్చింది. వాట్సాప్‌ బిజినెస్‌ సొల్యూషన్‌ ద్వారా సేవలందించేందుకు మెటా ఫ్లాట్‌ఫాం సంస్థతో మంగళవారం కుదుర్చుకున్న ఒప్పందం గుణాత్మక ఆవిష్కరణకు అభివర్ణించొచ్చు. మూడు ప్రాథమిక నమూనాల్లో.. అంటే `జీ టూ సీ (ప్రభుత్వం నుండి పౌరులకు), బీ టూ సీ (వ్యాపారం నుండి వినియోగదారునికి), జీ టూ జీ (ప్రభుత్వం నుండి ప్రభుత్వం) ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వాట్సాప్‌ డెలివరీ ఫ్లాట్‌ఫాంగా ఉపయోగపడుతుంది. ఫేజ్‌`1లో భాగంగా నవంబర్‌ 30, 2024నుంచీ వాట్సాప్‌ ద్వారా వందరకాల సేవలను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మొదటిదశలో వాణిజ్యరంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్‌ డెలివరీ కోసం రీఇంజనీరింగ్‌ ప్రక్రియ, విధానాలను అమలు చేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభంగా పౌరసేవలు అందిస్తారు. ఈ ప్రక్రియలో క్రిందివిధంగా వివిధ రకాల సేవలను అందించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు.

1.ఎండోమెంట్‌ సేవలు: ఆంధ్రప్రదేశ్‌లోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధరకాల సేవల కోసం స్లాట్‌ను బుక్‌ చేసుకోవడం వంటి సేవలు వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి వస్తాయి.
2. రెవెన్యూ సేవలు: పౌరులు వివిధ రకాల సేవల కోసం చేసుకున్న తమ దరఖాస్తుల స్థితిని సులభంగా తనిఖీ చేసుకోవడానికి వీలుకలుగుతుంది. పారదర్శకమైన యాక్సెస్‌తో సర్వే నంబర్లు, భూభాగాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంటాయి. సర్వే నెంబర్ల ఆధారంగా భూమిని గుర్తించడం సాధ్యమవుతుంది. ఈ సమాచారాన్ని స్వతంత్రంగా కనుగొనడంలో వినియోగదారుల యాక్సెసిబిలిటీని మెరుగుపర్చుతారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థనలను క్రమబద్దీకరిస్తారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం వాట్సాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం పౌరులకు లభిస్తుంది.
3. పౌర సరఫరాలు: పౌరులు రేషన్‌ కార్డ్‌ల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాక రేషన్‌ కార్డులను జారీ చేయడం, రేషన్‌ పంపిణీ స్టేటస్‌ను అప్‌డేట్‌ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి.
4. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ (ఎంఎ అండ్‌ యుడి): కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులువంటి సేవలు వాట్సాప్‌ ద్వారా పొందే అవకాశం ఏర్పడుంది.
5. నమోదు: రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి వాట్సాప్‌ను సాంకేతిక భాగస్వామిగా సేవలను అభివృద్ధి చేస్తుంది. భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్‌లు, సర్టిఫికెట్‌లు జారీ, రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్‌ బుకింగ్‌ ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ మొదలైన వాటి కోసం దరఖాస్తు చేయడానికి అవకాశమేర్పడుంది.
6. విద్యుత్‌ శాఖ: విద్యుత్‌ శాఖలోని ఏపీఈపీడీసీఎల్‌, ఏపీసీపీడీసీఎల్‌, ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో విద్యుత్‌ బిల్లు చెల్లింపునకు వాట్సాప్‌ ద్వారా అవకాశం లభిస్తుంది. ప్రజల అభ్యర్థనల మేరకు జియో లొకేషన్‌ ఆధారంగా కొత్త హై-టెన్షన్‌ లైన్‌లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఇన్‌స్టాల్‌ చేయడం, ట్రాన్స్‌కో, అంతర్గత కమ్యూనికేషన్‌ ఛానెల్‌లు, అలర్ట్‌ సర్వీస్‌లు అందుబాటులోకి వస్తాయి.
7. పరిశ్రమలు: పరిశ్రమల శాఖ ఇప్పటికే ఔట్‌ రీచ్‌ కమ్యూనికేషన్‌ కోసం చాట్‌బాట్‌లను ఉపయోగిస్తోంది. యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవస్థాపకుల కోసం సింగిల్‌ డెస్క్‌ పోర్టల్‌ను ఏకీకృతం చేయడం కోసం విధివిధానాలు సిద్ధమయ్యాయి. భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేయడం, పెట్టుబడి విధానం, ప్రమోషన్‌ వంటివాటికి అవకాశం లభిస్తుంది.
8. రవాణాశాఖ: అన్ని రవాణా లైసెన్స్‌లకు సంబంధించిన సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి, వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ఫేస్‌లెస్‌ సర్వీస్‌లను వాట్సాప్‌తో ఏకీకృతం చేసి సేవలను అందుబాటులోకి తెస్తారు. ఢల్లీి ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ మోడల్‌లో ఏపీఎస్‌ ఆర్టీసితో మెటా టీమ్‌ కలిసి పనిచేస్తుంది. టిక్కెట్‌ బుకింగ్‌, పార్శిల్‌ బుకింగ్‌ల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీలో సేవలను ఏకీకృతం చేస్తారు.
9. పాఠశాల విద్య: తల్లిదండ్రులు, విద్యార్థులు, డిపార్ట్‌మెంట్‌ కార్యనిర్వాహకులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపడం వంటి సేవలు వాట్సాప్‌తో అనుసంధానం చేయడం వల్ల సులభతరమవుతాయి. విద్యార్థుల హాజరు, పనితీరుకు సంబంధించి 7 మిలియన్ల మంది తల్లిదండ్రులతో కమ్యూనికేట్‌ చేయడానికి మొబైల్‌ నంబర్‌తోపాటు ఆధార్‌ ప్రామాణీకరణతో మెసేజింగ్‌ సిస్టమ్‌ అందుబాటులోకి వస్తుంది. పాఠ్యప్రణాళిక ఫలితాలను ట్రాక్‌ చేయడంతోపాటు మెటా బృందం డిజిటల్‌ నాగ్రిక్‌వంటి అదనపు కోర్సులను కూడా అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తుంది.
10. ఉన్నత విద్య: ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లు మొదలైన వాటికోసం హెచ్చరికలను షెడ్యూల్‌ చేయడం వంటి సమాచారం అప్‌ డేట్‌గా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. స్టూడెంట్‌ -స్టాఫ్‌ సపోర్ట్‌ సర్వీసెస్‌, వర్చువల్‌ టీచింగ్‌ అసిస్టెన్స్‌, కమ్యూనికేషన్‌, ఇతర సాఫ్ట్‌ స్కిల్స్‌ మెరుగుపరచడానికి ఎల్‌ఎంఎస్‌ వంటివి అందుబాటులోకి వస్తాయి. విద్యా సేవలకు అంతరాయంలేని యాక్సెస్‌ కోసం అపార్‌ ఐడీని అనుసంధానిస్తారు. డ్రగ్‌, పొగాకురహిత క్యాంపస్‌ల కోసం ప్రచారాలు, యూనివర్శిటీల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే సౌలభ్యం లభిస్తుంది.
11. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ: భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పలురకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అవసరాలపై డేటాను సేకరించేందుకు స్కిల్‌ సెన్సస్‌ నిర్వహించడంలో మెటా సహకరిస్తుంది. మెటా బృందం వాయిస్‌/ టెక్స్ట్‌ ద్వారా డైనమిక్‌ ప్రతిస్పందనల కోసం ఏఐని ఏకీకృతం చేస్తుంది.
12. ఐటి, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌, ఆర్టీజి: ఆయా శాఖల్లో డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను నిర్ధారించడం కీలకం. వాట్సాప్‌ అనేది అదనపు కమ్యూనికేషన్‌ ఛానెల్‌ మాత్రమే. మొత్తం డేటా ప్రభుత్వం వద్ద ఉన్నందున ఇంటిగ్రేషన్‌ కోసం వైట్‌లిస్ట్‌ చేయదగిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తారు. డిపార్ట్‌మెంటల్‌ సమాచారం ఇంటిగ్రేషన్‌ కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ప్రణాళికను తయారుచేసి నిర్ణీత కాలవ్యవధిలో ఏకీకృతం చేస్తారు.
13. గ్రామ సచివాలయాలు, వార్డుసచివాలయ విభాగం: గ్రామ, వార్డు సచివాలయ్యాల్లో సమర్థవంతమైన సర్వీస్‌ డెలివరీ కోసం 29 విభాగాల్లో 350 సేవలు ఇప్పటికే ఏకీకృతం చేయబడ్డాయి. వివిధ విభాగాలకు అనుసంధానించడం ద్వారా ఇతర డైనమిక్‌ సేవలను సమాంతరంగా అందుబాటులోకి తెస్తారు. వాట్సాప్‌ గంటకు 10 లక్షల అలర్ట్‌ల సామర్థ్యంతో రియల్‌ టైమ్‌ నోటిఫికేషన్‌లను సులభతరం చేస్తుంది. పర్యాటకరంగానికి సంబంధించి అవసరమైన అప్‌డేట్లు, ప్రయాణ సమాచారం అందుబాటులోకి వస్తుంది. పౌరులు తమ సమస్యలను తెలియజేయడానికి క్రమబద్ధమైన వేదికగా ఉపకరిస్తుంది. రాష్ట్రంలో అమలవుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌లు, రహదారి పరిస్థితులు వంటివాటిపై రెగ్యులర్‌ అప్‌డేట్‌లు లభిస్తాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్‌ ధరలు, వాతావరణం, ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై సమాచారం పొందవచ్చు. వివిధ పన్నులకు సంబంధించిన సమాచారం, గడువులు, విధానాలపై కమ్యూనికేషన్‌ సులభతరమవుతుంది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటెడ్‌ వర్క్‌ ఫ్లో క్రమబద్ధీకరణ మెరుగుపడుతుంది.
ఈ సాంకేతిక ఆధారిత ఆవిష్కరణ.. పౌర సేవలను ప్రజలకు వేగంగా అందించడంతోపాటు, భవిష్యత్‌లో మరిన్ని సాంకేతిక పరిష్కారాలకు దారితీసే మార్గదర్శకంగా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ కొత్త వాట్సాప్‌ సర్వీసులతో దేశంలోనే ముందంజలో నిలుస్తూ, ప్రజల జీవితాలను మరింత సులభతరం చేసేందుకు ఒప్పందాన్ని విజయవంతంగా అమలు చేయనుంది.

సంబంధితవార్తలు

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు.

Previous Post

త్వరలో వాటర్‌ పాలసీ

Next Post

జగన్‌ టార్గెట్‌.. చుక్కల భూములే!

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist