- వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తికి చర్యలు
- సెలక్షన్ కమిటీలకు స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇవ్వాలి
- స్కిల్ వర్సిటీలకు విధివిధానాలు రూపొందించాలి
- పీఎం సేతు కింద రాష్ట్రానికి 5 క్లస్టర్లు మంజూరు
- ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి
- ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ సమీక్షలో లోకేష్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసెర్ల రిక్రూ ట్‌మెంట్‌ను మరింత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాల ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివా సంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటి| ˜¾కేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాక బు చేశారు. అధికారులు సమాధానమిస్తూ ఇప్పటివరకు 1,89, 316 అఫ్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ప్రతి దరఖాస్తును డేటా డ్రైవెన్ క్రాస్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాత పరీక్షకు సంబంధించి ఇప్పటికే సిలబస్ ఇచ్చామని చెప్పారు. యూనివర్సిటీ యూనిట్‌గా రిక్రూట్ మెంట్ చేపడుతున్నందున సెలక్షన్ కమిటీలకు ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇవ్వాలి. వీలైనంత త్వరగా యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి విధి విధానాల రూపకల్పనపై మంత్రి సమీక్షిస్తూ ఇండస్ట్రీ లింకేజీ, సెక్టార్ టై అప్ నిబంధన ఖచ్చితంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని స్కిల్ యూనివర్సిటీల స్థాపనకు దేశంలోనే ఒక నమూనాగా ఈ చట్టం ఉండాలని సూచించారు.
వచ్చే నెలలో నైపుణ్యం పోర్టల్ ఆవిష్కరణ
స్కిల్ డెవలప్‌మెంట్‌పై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ నిరుద్యోగ యువతకు మేలు చేకూర్చేలా తయారు చేసిన నైపుణ్యం పోర్టల్ ను జూలైలో ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించా రు. ఇందులో నమోదైన ప్రతి వ్యక్తికి ఆన్‌లైన్ స్కిల్ కార్డు జారీ చేస్తామని చెప్పారు. పీఎం సేతు పథకం కింద రాష్ట్రానికి 5 క్లస్టర్లు మంజూరయ్యాయి. ఇందులో స్టీల్, షిప్ బిల్డింగ్, పెట్రో కెమికల్ క్లస్టర్ ఏర్పాటుకు అర్సెలర్ మిట్టల్ సంస్థ ముందుకు వచ్చింది. రెన్యువబుల్ ఎనర్జీ, ఫార్మా, ఆక్వా, శ్రీసిటీ మొదలగు క్లస్టర్లలో కూడా పీఎం సేతు పథకం కింద ఐటీఐలను బలోపేతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటుకు యు< Š్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇటీవల నాక్ ఆధ్వర్యంలో చేపట్టిన సెమినార్‌లో 92 నిర్మాణ సంస్థలు భాగ స్వామ్యం వహించాయి, సెయింట్ గోబెన్స్, అల్ట్రాటెక్ వంటి ప్రఖ్యాత సంస్థలు 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని అధికారులు తెలిపారు.
ఓంక్యాప్ ద్వారా విదేశాల్లో ఉద్యోగావకాశాలు
ఓంక్యాప్ ఆధ్వర్యంలో వచ్చే నెలలో 146 మందికి విదేశీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇందులో 84 మంది నర్సులు, 16 మంది బ్లూ కాలర్ అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు. జపాన్‌లో హెల్త్ కేర్ వర్కర్లకు డిమాండ్ ఉన్నందున ఆ కోర్సులు చేసిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించడంపై దృష్టి సారించాలని లోకేష్ సూచించారు. క్వాంటమ్ ఏఐ స్కిల్లింగ్ ప్రణాళిక అమలు పురోగతిపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జాబ్‌మేళాల ద్వారా ఇప్పటివరకు 1,30,422 మందికి ఉద్యోగాలు కల్పించామని అధికారులు వివరించారు. ప్రతి క్వార్టర్‌కు ఒకసారి నియోజకవర్గ కేంద్రాల్లో జాబ్‌మేళాలు నిర్వహించాలని లోకేష్ సూచించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ ద్వారా రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నామని తెలిపారు. దీనికి అనుసంధానంగా డిస్ట్రిక్ట్ లెవల్ ప్లేస్‌మెంట్ టీమ్‌లను ఏర్పాటుచేసి ప్లేస్‌మెంట్ ఆఫీసర్లను నియ మించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో జిల్లాస్థాయి నైపు ణ్య అధికారుల సమావేశం నాటికి కేపీఐ డ్యాష్‌బోర్డును అందు బాటులోకి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావే శంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యశాఖ కమిషనర్ నారాయణ భరత్‌గుప్తా, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ ఎండీ గణేష్‌కుమార్ పాల్గొన్నారు.















