- లక్ష మందికి పైగా విద్యార్థుల చేరిక
- సెప్టెంబర్ 5 నుంచి 9,10 తరగతుల
- విద్యార్థులకు ఏఐ ట్యూటర్ విధానం అమలు
- మంత్రి లోకేష్‌కు వివరించిన అధికారులు
- హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టి సారించాలి
- ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణపై
- ఇతర రాష్ట్రాల విధానాలపై అధ్యయనం
- పాఠశాల విద్యపై సమీక్షలో మంత్రి ఆదేశం
అమరావతి(చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది విద్యార్థుల హాజరు, అభ్యసన ఫలితాలపై దృష్టిసారించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభు త్వ పాఠశాలలకు ఈ ఏడాది 1,06,000 వేల మంది విద్యార్థులు కొత్తగా ప్రవేశాలు పొందారని అధికారులు వివరించారు. ముఖ్యం గా ప్రాథమికోన్నత పాఠశాలలు 7,620 ఉండగా.. 3,515 (46.13%) పాఠశాలల్లో గరిష్ఠ సామర్థ్యం మేర విద్యార్థుల ప్రవేశాలు పొందారని చెప్పారు. విద్యారంగంలో సంస్కరణల ఫలితంగానే విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. ఈ ఏడాది 159 పాఠశాలలు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా రూపాంతరం చెందాయని తెలిపారు.
ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజుల నియంత్రణపైనా సమావేశంలో చర్చించారు. అధిక ఫీజుల నియంత్రణకు ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్న విధానాలను అధ్య యనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి ఫేజ్-1 కింద 175 లీప్ పాఠ శాలల్లో 9,10 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ఏఐ ట్యూట ర్ విధానాన్ని ప్రీ పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు అధికారులు వివరించారు. భవిష్యత్‌లో క్లిక్కర్స్‌కు ఏఐ ట్యూటర్‌ను అనుసంధా నించాలని మంత్రి సూచించారు. ఐఈఆర్ పీఎస్ రెగ్యులరైజేషన్, హైస్కూల్ ప్లస్‌లలో గెస్ట్ లెక్చరర్ల రిక్రూట్‌మెంట్ అంశంపైనా సమావేశంలో చర్చించారు.
త్వరలో అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి శంకుస్థాపన
అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో పాటు విశాఖలో డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ, మంగళగిరిలో స్కిల్ ఎక్స్‌లెన్స్ సెంటర్ ఏర్పాటు పైనా సమావేశంలో చర్చించారు. ఇందుకు సంబంధించి న భవన నమూనాలను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశా రు. వచ్చే నెలలో అమరావతిలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి శంకు స్థాపనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి (ఇన్‌ఛార్జి) శ్యామలరా వు, పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ దీవెన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.















