చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

టీమ్ ఎన్డీఏ తొలిసభకు సర్వం సిద్దం

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు

by చైతన్యరధం
September 10, 2025
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
టీమ్ ఎన్డీఏ తొలిసభకు సర్వం సిద్దం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నేడు అనంతపురంలో కూటమి పార్టీల సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభ
  • హాజరు కానున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, బీజేపీ నేత మాధవ్
  • భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి
  • 3.5 లక్షల మంది హాజరయ్యే అవకాశం
  • 15 నెలల పాలనా విజయాలను ప్రజలకు వివరించనున్న నేతలు
  • సభకు వచ్చే కార్యకర్తలు, ప్రజల కోసం భారీస్థాయిలో ఏర్పాట్లు
  • ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు

అనంతపురం (చైతన్యరథం): కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనా విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో తొలిసారి రాష్ట్రంలోని మూడు ఎన్డీఏ పార్టీలు భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట -బుధవారం నిర్వహిస్తున్న ఈ భారీ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారంలోకి వచ్చాక తొలిసారి టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడిగా రాజకీయ సభను నిర్వహిస్తున్నాయి. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ, భారీస్థాయిలో పెట్టుబడులను రప్పిస్తూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు తీయిస్తున్న కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు సూపర్ సిక్స్- సూపర్ హిట్ పేరుతో ఈ సభనిర్వహిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న ఉమ్మడి సభ కావటంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఎన్టీఏ కూటమి తొలి ఉమ్మడి సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు హాజరు కానున్నారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3.5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. కూటమికి కంచుకోటగా నిలిచిన అనంతపురం జిల్లా ఈ సభకు వేదికైంది. రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలు నిర్వహించే తొలి రాజకీయ సభ కావటంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను పూర్తి చేసి ప్రజలకు సంక్షేమం అందించటంపై ఈ సభలో ప్రధానంగా మూడు పార్టీల నేతలు ప్రస్తావించనున్నారు. ఉమ్మడిగా అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలకు పైగా సంక్షేమం, అభివృద్ధి ప్రజలకు చేరింది. అలాగే రాష్ట్రంలో అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టు ప్రాజెక్టులు సహా వేర్వేరు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులు పట్టాలెక్కి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోనున్న అంశాలను ఈ వేదిక ద్వారా కూటమి పార్టీల అగ్రనాయకత్వం ప్రజలకు వివరించనుంది.

సూపర్ సిక్స్ పథకాల చిహ్నంతో వేదిక
కూటమి సర్కారు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన భారీ ఎస్ఈడీ స్క్రీన్ తో వేదికను తీర్చిదిద్దారు. 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేసిన వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్తో పాటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసీనులయ్యేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. సభ నిర్వహిస్తున్న 70 ఎకరాల ప్రాంగణంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరిట జెండాలను, హెూర్డింగ్ లను ఏర్పాటు చేశారు. ఇక వేదిక ప్రాంగణానికి దారితీసే మార్గాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ, మంత్రి లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, తదితరుల ఫ్లెక్సీలను పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. అనంతపురంలోని ప్రధాన కూడళ్లతో పాటు దారి పొడవునా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన జెండాలు, తోరణాలతో సభకు వచ్చేవారిని ఆహ్వానించేలా స్వాగత ఏర్పాట్లు చేశారు. మూడు పార్టీల తరపున ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో అనంతపురంలో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అలాగే భారీస్థాయిలో జనం తరలిరానున్న నేపథ్యంలో తాగునీరు,  భోజనాలకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడే ఆహారం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

ఎన్డీఏ పార్టీల ఐక్యతా నినాదం
ఎన్నికలకు ముందు నుంచి కలసికట్టుగా ఉన్న మూడు పార్టీలు.. అధికారంలోకి వచ్చాక కూడా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా ఐక్యంగానే ముందుకు వెళ్తున్నాయి. 15 నెలల పాలనా కాలంలో సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్-మంత్రి లోకేష్-బీజేపీ అగ్ర నేతలు అత్యంత సమన్వయంతో పని చేస్తున్నారు. అవసరమైన సమయాల్లో కేంద్రంతో, ప్రధాని మోదీతో సంప్రదింపులు జరుపుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. కలిసి వచ్చాం, కలిసి గెలిచాం, కలిసి పనిచేస్తున్నాం.. ఇక భవిష్యత్తులోనూ కలిసే ఉంటాం నినాదాన్ని మరింత బలంగా ఈ వేదిక ద్వారా పంపాలని కూటమి భావిస్తోంది. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, కింజరాపు అచ్చెన్నాయుడు, ఎస్ సవిత, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, నారాయణ, తదితరులు మంగళవారం పరిశీలించారు.

భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన హోంమంత్రి అనిత
సూపర్ సిక్స్ -సూపర్ హిట్ విజయోత్సవ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి రామన్నందున భద్రతా ఏర్పాట్లలో లోపాలు ఉండకూడదని అధికారులను హెూంమంత్రి ఆదేశించారు. డ్రోన్లతో భద్రతా ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్లు, సభా వేదిక ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్ వ్యవస్థ ద్వారా తొలిసారిగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. 6 వేల మంది పోలీసులతో సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మాజీ సీఎం జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని.. అంతేగానీ తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తిగా  యంత్రించామన్నారు.

మంత్రుల సమీక్ష
సూపర్ సిక్స్ – సూపర్ హిట్ విజయయోత్సవ సభను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపు ఇచ్చారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, మున్సిపల్ మంత్రి పి.నారాయణ, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, తదితరులు సమావేశమై సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. సీఎం చంద్రబాబు హెలీప్యాడ్ గురించి, లక్షలాదిగా తరలివచ్చే ప్రజలకు భోజన వసతులు, పార్కింగ్ స్థలాల ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, నాయకులు అధికారులు పాల్గొన్నారు. సోషల్ మీడియా నియంత్రణకు త్వరలోనే చట్టం  రాబోతోందని మంత్రి పేర్కొన్నారు. ఫేక్ ప్రచారాలు చేసే వారిని కచ్చితంగా నియంత్రిస్తామన్నారు. అనంతరం, పార్కింగ్ ప్రదేశాలతోపాటు వీఐపీల భద్రతా ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, సభ కారణంగా ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సమష్టిగా పనిచేసి సక్సెస్ చేయండి: మంత్రుల పిలుపు
అనంతపురంలో నిర్వహించనున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్కు తరలివచ్చే ప్రజలు, మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భోజనం, తాగునీరు, బిస్కెట్లు అందుబాటులో ఉంచాలని పార్టీ నాయకులకు మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. అనంతపురం సభ ఏర్పాట్లపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మండలాల వారీగా టీడీపీ నేతలతో చర్చించారు. -బహిరంగ సభకు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మున్సిపాలిటీకి ఇప్పటికే 480 బస్సులు కేటాయించామని, స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఇంకా అవసరమైన వాహనాలను సమకూరుస్తారని మంత్రులు తెలిపారు. ప్రతీ వాహనంలో అవసరమైన తాగు నీరు, భోజనం, బిస్కెట్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు ఉదయం11 గంటలకే వాహనాలు బయలుదేరి సభా వేదికకు చేరుకునేలా చూడాలని పేర్కొన్నారు. సభకు వచ్చిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకువెళ్లే బాధ్యతను నాయకులు చూసుకోవాలన్నారు. సమావేశంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుల్లా చైతన్యరెడ్డి, నియోజకవర్గ టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Previous Post

రామ్మోహన్ నాయుడు కుమారుడికి మంత్రి లోకేష్ ఆశీస్సులు

Next Post

రైతు ద్రోహి జగన్ బాంధవుడు చంద్రన్న

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

November 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

November 14, 2026
పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
Next Post
రైతు ద్రోహి జగన్ బాంధవుడు చంద్రన్న

రైతు ద్రోహి జగన్ బాంధవుడు చంద్రన్న

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 15-11-2026

by కార్యకర్త
November 15, 2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.