- తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి
పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు ఆ పార్టీ నాయకులు మాయ మాటలతో ఓటడిగేందుకు వస్తే నిలదీయాలని రాష్ట్ర జలవనూర్ల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని 16 ,17, 3, 30, 31, 26, 27, 43 వార్డుల్లో మంత్రి నిమ్మల ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలో లేని వైసీపీ, స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే ఎటువంటి ప్రయోజనం ఉండదని.. ఓటు సముద్రంలోనే వేసినట్లే అవుతుందన్నారు. మున్సిపాలిటీలో కూటమి పాలకవర్గం అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. వైసీపీ, ఇండిపెండెంట్ అభ్యర్థులకు అటువంటి అవకాశం ఉండదన్నారు.
నాలుగు రోజులుగా మంత్రి నిమ్మల జ్వరంతో బాధపడుతున్నా.. ఆసుపత్రిలో సెలైన్ ఎక్కించుకుని మరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కూటమి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి ఆబోతుల ఉషారాణి, కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. మంత్రి అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రచారం నిర్వహించడాన్ని చూసిన ప్రజలు ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పలికారు. మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు.పట్టణంలోని ప్రతి వార్డులో మంత్రి నిమ్మల పర్యటనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కూటమి అభ్యర్థులకే ఓటు వేస్తామని పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తెలిపారు.
మీరు పడుతున్న కష్టానికి మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మంత్రి ప్రచారానికి వచ్చిన సందర్భంలో తమ ప్రాంతాల్లోని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను ఆప్యాయంగా వింటూ.. ప్రతి సమస్య పరిష్కారానికి, వార్డుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు బాధ్యత తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదని, కూటమి అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రజలదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పాలకవర్గం మున్సిపాలిటీలో ఉంటే జరుగుతున్న అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని మంత్రి తెలిపారు. గత రెండున్నరేళ్లలో రూ.1,275 కోట్ల నిధులు తీసుకువచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. పాలకొల్లు పట్టణంలో కోట్లాది రూపాయలతో ఏడాది పొడవునా తాగునీటి సమస్య లేకుండా విజ్జేశ్వరం నుంచి సురక్షత తాగునీరు అందించే పనులు, శాశ్వతంగా డంపింగ్ యార్డ్ సమస్య తీరేలా పనులు జరుగుతున్నాయన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా వంద పడకల ప్రభుత్వాసుపత్రిని అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నామన్నారు.
పట్టణంలో విలీన గ్రామాల్లోనూ సమగ్ర అభివృద్ధికి అధిక ప్రాధాన్యతను ఇవ్వనన్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించి సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని, అనంతరం వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయి సమస్యలు పెరిగిపోయాయని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అధికారంలోకి వచ్చిన తాను ప్రజా సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చెలా పని చేస్తున్నానన్నారు.
పాలకొల్లు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆబోతుల ఉషారాణికి అవకాశం కల్పించిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. పార్టీలో సుమారు 40 ఏళ్లుగా నిబద్ధతతో కష్టపడి పనిచేసిన జీవి భార్య ఉషారాణికి ఈ అవకాశం ఇచ్చామని తెలిపారు. ధనిక వర్గాలకు కాకుండా సామాన్య కార్యకర్తగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న వ్యక్తికి చైర్పర్సన్ అభ్యర్థిత్వం ఇచ్చామని పేర్కొన్నారు. ఉషారాణితో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం నిరాటంకంగా కొనసాగుతాయని చెప్పారు. పాలకొల్లు పట్టణంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మౌలిక అవసరాలు తీర్చడమే తన బాధ్యతగా భావిస్తున్నానని, కూటమి అభ్యర్థులకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చి గెలిపించాలని మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రచారంలో ఆయనతోపాటు కౌన్సిలర్ అభ్యర్థులు దొడ్డ ఏడుకొండలు, ఉన్నమట్ల కబర్ది, కలిసేట్టి అంజలి, ధనాన్ని నీలవేణి, శి డగం లక్ష్మి, కొరగింజల వరలక్ష్మి, సెట్టెం దేవి, బీర వెంకటరమణ , పెద్ద సంఖ్యలో ప్రజలు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.




















