చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

గుర్ల మరణాలు గత ప్రభుత్వ పాపమే

మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

by చైతన్యరధం
Oct 22, 2024 at 7:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
గుర్ల మరణాలు గత ప్రభుత్వ పాపమే
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గత పాలకుల నిర్లక్ష్యం..ప్రజలకు శాపం
  • గుర్లలో అతిసారకు కలుషిత నీరే కారణం
  • గత ఐదేళ్లలో కనీసం నీటిశుద్ధి ఫిల్టర్‌ బెడ్లను కూడా మార్చలేదు
  • రుషికొండ రాజ భవంతికి వెచ్చించిన నిధులను ఫిల్డర్‌ బెడ్ల కోసం వాడి ఉంటే జనానికి కష్టాలు తప్పేవి
  • జల్‌జీవన్‌ మిషన్‌ నిధులతో గ్రామీణ రక్షిత నీటి సరఫరాకు మంచి రోజులు
  • మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష చొప్పున సాయం
  • మీడియాతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

విజయనగరం (చైతన్యరథం): గత ప్రభుత్వ పాపాలు శాపంగా మారి నేడు ప్రజల ప్రాణం మీదకు తెస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని ధ్వజమెత్తారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం కాదు కదా… కనీసం రక్షిత తాగు నీరు సరఫరా వ్యవస్థలో నీటిని శుద్ధి చేసే ఫిల్టర్‌ బెడ్లను కూడా మార్చలేదు. ఫలితంగా గ్రామీణ తాగునీటి సరఫరాలో లోపాలు తలెత్తి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయన్నారు. గత ప్రభుత్వం మీద తప్పులు తోసేయాలని ఈ మాటలు చెప్పడం లేదని, రూ.600 కోట్లు వెచ్చించి రుషికొండ మీద రాజభవనం కట్టుకున్నారు తప్పితే, ఆ డబ్బుతో పేద ప్రజలకు రక్షిత మంచినీరు అందేలా ఫిల్టర్‌ బెడ్లను మార్చాలన్న ఆలోచన చేయలేదే అనే ఆవేదన తోనే ఆ విధంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు. ఆ మొత్తంతో రక్షిత తాగు నీటికి నిర్వహణ పనులు చేసి ఉంటే ప్రజలకు ఆరోగ్యం ప్రమాదంలో పడేది కాదన్నారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పిదాలను సరిజేయడానికే తమ పాలనా సమయం సరిపోతోందన్నారు. విజయనగరం జిల్లా, గుర్ల గ్రామంలో అతిసార వ్వాధి ప్రభావంతో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ విజయనగరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం పూర్తిస్థాయి బాధ్యతతో ఉంటుంది. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికే మాకు చాలా సమయం పడుతోంది. నా శాఖల బాధ్యతలు తీసుకున్న తరవాత గత ప్రభుత్వ హయాంలోని లెక్కలు, నిధుల మళ్లింపు చూస్తుంటే గ్రామీణ పరిపాలన మీద ఇంత నిర్లక్ష్యం చేశారా అని బాధేస్తోంది. అధికారులు, సిబ్బందిని దేనిపై ప్రశ్నించినా గత ప్రభుత్వంలో నిధుల లేమి, నిర్లక్ష్యం, నిర్లిప్తతే సమాధానం అవుతోంది. పాలన విషయాల్లో మేం తప్పించుకోవాలని భావించడం లేదు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని పవన్‌ చెప్పారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

జల్‌ జీవన్‌కు నిధులొచ్చాయి
గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు అందాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా దారి మళ్లించింది. రూపాయి కూడా పంచాయతీల ఖాతాల్లో జమ చేయలేదు. పంచాయతీల్లో నిధులు లేక నిర్వహణ లేక అన్ని పనులు మూలనపడ్డాయి. దీంతో గ్రామాల్లో పాలన మొత్తం కుంటుపడిరది. పారిశుద్ధ్య సమస్యలతోపాటు తాగునీటి సమస్యలు పంచాయతీలను చుట్టుముట్టాయి. గత పాలకులు చేసిన పాపాలు ఇప్పుడు బయటపడి శాపాలుగా మారుతున్నాయి.
విజయనగరం జిల్లా గుర్ల ఘటన చాలా బాధాకరం. స్వచ్ఛమైన తాగు నీరు పొందటం అనేది పౌరుల ప్రాథమిక హక్కు. అది కలుషితం కావడం బాధాకరం. గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఈ నెల 18వ తేదీన రూ.580 కోట్ల నిధులు వచ్చాయి. ఆ నిధులను పూర్తిస్థాయిలో వినియోగిస్తే మరిన్ని నిధులు వచ్చేందుకు అవకాశం ఉంది. గ్రామాల్లో తాగునీటి వ్యవస్థను పూర్తిస్థాయిలో ఆధునికరించేందుకు జలజీవన్‌ మిషన్‌ నిధులను వినియోగించుకుంటాం. ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు రక్షిత మంచినీరు అందించేలా తగిన చర్యలు తీసుకుంటామని పవన్‌ తెలిపారు.

చంపానది కాలుష్య నివారణపై దృష్టి
గుర్ల అతిసార ఘటనకు చంపావతి నది కాలుష్యం కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. చంపావతి నది నుంచి 29 గ్రామాలకు నీరు సరఫరా అయ్యే పంపింగ్‌ స్కీంను పరిశీలించాను. ఇతర గ్రామాల్లో నీటి కాలుష్యం తక్కువే అయినా గుర్లకు సంబంధించి పైపులైన్లలో ఒత్తిడి వల్ల నీరు వెనక్కు వచ్చే సమయంలో కలుషితం అయి ఉండొచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణమైన చంపావతి నది నీటి కాలుష్యాన్ని నివారించాలి. నదిలో, నది ఒడ్డున చెత్త వేయడం వల్ల అది కుళ్లిపోయి నది నీటిలో కలుస్తోంది. అదే నీటిని మళ్లీ ప్రజలు శుద్ధి చేయకుండానే తాగుతున్నారు. దీనివల్ల అతిసారతో పాటు ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గ్రామాల్లో తాగునీటి వనరులను సురక్షితంగా ఉంచుకునే విషయంలో శాశ్వత పరిష్కారం ఆలోచిస్తున్నాం. మంచి నీటి చెరువులు, కుంటలు ఇతర మంచినీటి వనరుల పాయింట్లను తీర్చిదిద్ది, అక్కడ ఏ మాత్రం అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటాం. చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ నిర్మిస్తే గ్రామీణుల ఆరోగ్యానికి కూడా రక్షణగా ఉంటుందని పవన్‌ అన్నారు.

బహిరంగ మలవిసర్జనపై చైతన్య కార్యక్రమాలు
గ్రామాల్లో ఇప్పటికీ బహిరంగ మలవిసర్జన జరుగుతోంది. ఇళ్లలోని మరుగు దొడ్లు ఉన్నా గ్రామీణులు వాడటం లేదు. దీంతో నదీ ప్రాంతాలు, కాలువలు, వాగులు, వంకలు కలుషితం అవుతున్నాయి. గుర్ల ఘటనకు చంపావతి నది ఒడ్డున బహిరంగ మలవిసర్జన కూడా కారణం. దీనిపై జిల్లా కలెక్టరు అంబేడ్కర్‌ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించాను. దీనిపై ప్రజల్లో కూడా అవగాహన రావాల్సిన అవసరం ఉంది. బహిరంగ మల విసర్జన నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తూ, నిధులు వెచ్చిస్తున్నాయి. అవసరం అని చెప్పిన వారికి వెంటనే వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. దీన్ని ప్రజలు ఉపయోగించుకునేలా క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన పెంచాలి. అప్పుడే ప్రజలంతా నిండు ఆరోగ్యంతో ఉంటారని పవన్‌ అన్నారు.

మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం
గుర్ల ఘటనపై సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి విజయానంద్‌తో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అతిసార ప్రబలటానికి కారణాలు ఏమిటో పూర్తిస్థాయిలో నివేదిక వచ్చిన తరువాత ప్రభుత్వం తరఫు నుంచి బాధితులకు తగిన పరిహారం అందిస్తాం. ప్రస్తుతం నా సొంత నిధుల నుంచి బాధిత పది మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పన అందిస్తాను. మృతుల పిల్లల విద్యకు తగిన భరోసా ఇస్తాం. మానవతా దృక్పథంతో ఈ నిధులు వారి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాయని భావిస్తున్నాను. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా తగిన విధంగా స్పందిస్తుంది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీల్లో ముఖ్యంగా తాగునీటి అవసరాలకు సంబంధించి పనులపై దృష్టి పెడతాం. దీనికి పక్కా ప్రణాళికతో ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకువచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడుతాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత తాగునీటి వ్యవస్థకు జీవం పోస్తామని పవన్‌ చెప్పారు. సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కళా వెంకటరావు, లోకం నాగ మాధవి, అదితి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, నిమ్మక జయకృష్ణ, బోనెల విజయ్‌ చంద్ర, ఈశ్వరరావు, జిల్లా కలెక్టర్‌ అంబేద్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

అతిసార బాధితులకు పరామర్శ
సమీక్షకు ముందు గుర్లలో అతిసార బాధితులను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పరామర్శించారు. స్థానిక పీహెచ్సీలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను ఆరా తీశారు. బాధిత కుటుంబాలను కలిసి మాట్లాడారు. గ్రామస్థులతో ముఖాముఖి మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. అంతకు ముందు నెల్లిమర్ల మండలం ఎస్‌ఎస్‌ఆర్‌ పేట వద్ద గుర్ల తాగునీటి పథకాన్ని పవన్‌ పరిశీలించారు.

Previous Post

ఇతర రాష్ట్రాలతో కాదు…దేశాలతోనే మాకు పోటీ!

Next Post

ఉద్యోగాల కల్పన, నైపుణ్యశిక్షణ లక్ష్యంగా..వేగంగా మంత్రి లోకేష్‌ అడుగులు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 22-08-2026

కార్యకర్త
@ August 22, 2026
చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 21-08-2026

కార్యకర్త
@ August 21, 2026
దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌
ఆంధ్రప్రదేశ్

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి
ఆంధ్రప్రదేశ్

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు

చైతన్యరధం
@ August 20, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist