- సుబ్రహ్మణ్యం హత్యకేసు నిందితులకు కొమ్ముకాస్తున్నారు
- కాకినాడ వైసీపీ ఆఫీస్ ఎదుట దళిత సంఘాల భగ్గు
- సాక్షులను బెదిరిస్తున్న అనంతబాబు అరెస్టుకు డిమాండ్
- ద్వారంపూడి కాపాడే యత్నం చేస్తున్నారని ఆగ్రహం
- అమలాపురంలోనూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమం
కాకినాడ(చైతన్యరథం): దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు వ్యవహారం కాకినాడలో మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను తీవ్రస్థాయిలో భయబ్రాంతులకు గురిచేయడాన్ని నిరసి స్తూ కాకినాడలో దళిత సంఘాలు కదం తొక్కాయి. వారికి మద్ద తుగా టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం ఎదురుగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దళిత నాయకులు “జగన్‌రెడ్డి దళిత ద్రోహి” అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దళితుడిని చంపిన హంతకులకు జగన్ అడుగడుగునా కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. “గత ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో దళితుల రక్తం పీల్చుకు తాగాడు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం దళితులు కావాలి. కానీ మా ప్రాణాలు తీసిన హంతకులకు మాత్రం రెడ్ కార్పెట్ పరుస్తారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా కొట్టి చంపి మృతదే హాన్ని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుతో జగన్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. దళితుల పట్ల జగన్‌రెడ్డికి ఉన్న కపట ప్రేమకు, ఆయన దళిత ద్రోహి అనడానికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు.
“సాక్ష్యాల తారుమారు వెన్నతో పెట్టిన విద్య
సాక్ష్యాలను తారుమారు చేయడం వైసీపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా వీరికి బుద్ధి రాలే దు. సాక్షులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అడ్వాన్స్ ఇచ్చి మొత్తం 3 లక్షలు డబ్బు ఆశ చూపడం, తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే ‘వివేకా కేసులా మీ శవాలు కూడా దొరకవు’ అని బెదిరించడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డా రు. కూటమి ప్రభుత్వంలో సిట్ దర్యాప్తులో సుబ్రహ్మణ్యం శరీ రంపై 31 గాయాలు ఉన్నాయని, గత ప్రభుత్వంలో పోలీసులతో కుమ్మక్కై సీసీ టీవీ ఫుటేజీలు మాయం చేశారని వాస్తవాలు వెలుగులోకి రావడంతో వైసీపీ నేతల్లో వణుకు పుట్టింది. అందుకే సాక్షులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దళిత నేతలు ఆరోపించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతబాబుతో పాటు, ఆయన భార్యను కూడా ఈ కేసు నుంచి తప్పించడానికి ద్వారంపూడి అన్ని విధాలా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారిని రక్షించేందుకు వత్తాసు పలక డం ఆయన దళిత వ్యతిరేక విధానాలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. హంతకులకు సహకరిస్తున్న ద్వారంపూడికి దళిత సమాజం తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.
సాక్షులకు రక్షణ కల్పించాలి
తక్షణమే ఈ కేసులోని సాక్షులకు పోలీసు రక్షణ కల్పించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్న అనం తబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబత్తుల అప్పారావు, కాకినా డ సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు అంబటి చిన్న, వీరితో పాటు దళిత సంఘాలు, నాయకులు సీకోటి అప్పలకొండ, పలివెల రవి, కంచి కట్ల నాగభూషణం, దూల సత్యనారాయణ, కాదా నాగేశ్వరరావు, పోలేపల్లి జగన్, నాగరాజు, పెదపాటి కుమార్, బండి గబ్బర్, మంగారావు, నాని, సుందరపల్లి తేజ, డోకూబుర్ర రాజు, సామంతులు నాగేంద్ర తదితరులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.
అమలాపురంలోనూ గళమెత్తిన దళిత సంఘాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎమ్మెల్సీ అనంత బాబుకు వ్యతిరేకంగా గళమెత్తిన దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన నిర్వహించారు. సుప్రీం కోర్టు ఆదేశించిన నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై దళిత నాయకుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షులను బెదిరిస్తూ డబ్బు ఆశ చూపి కేసును నీరుగార్చేందుకు అనంతబా బు ప్రయ త్నిస్తున్నారని ఆరోపించారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అనంతబా బుతో పాటు ఈ హత్యలో సహకరించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.















