- ఆర్థిక వృద్ధి విశ్లేషణకు నెలవారీ నివేదికలు
- జీఎస్టీపీ లక్ష్యాన్ని చేరుకునేలా సామర్థ్యాల పెంపు
- ఏఐతో పన్నులు, రెవెన్యూ వసూళ్లపై దృష్టి
- జీఎన్డీపీ లక్ష్యాలు, కేపీఐపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రాష్ట్రంలోని ఆర్థిక వృద్ధిని విశ్లేషించేందుకు నెల వారీ నివేదికల్ని రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర- క్షేత్రస్థాయి ఆర్థిక స్థితిగతులను విశ్లే షించేందుకు ప్రతి నెలా నిర్దేశిత తేదీకి ఆర్థిక నివేదిక లను సిద్ధం చేయాలని సూచించారు. నెల, త్రైమాసికం, అర్ధ సంవత్సరంలో నమోదయ్యే వివిధ గణాంకాల ద్వారా ఎప్పటికప్పుడు జీఎస్టీపీ లక్ష్యాన్ని సమీక్షించు కునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మంగళవా రం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థూల ఉత్పత్తి లక్ష్యా లు, కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్ల (కేపీఐ)పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లను సాధించే అంశంపై సీఎం దిశానిర్దేశం చేశారు. జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న సూచికలను మెరుగు పరచడం, అగ్రశ్రేణి రాష్ట్రాలతో సమానంగా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు రూపొందించా లని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
నిర్దేశించుకున్న లక్ష్యాలతోపాటు రియల్ గ్రోత్ ఆధారంగా పనితీరును అంచనా వేసేలా స్కోరింగ్ విధానాన్ని అమలుచేయా లని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలపై చేసే వ్యయంపై 3.5రెట్ల మేర ఆర్థిక కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందని, రియల్ టైమ్లో ఈ ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు ఓ ఏఐ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని సీఎం నిర్దే శించారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా డేటా డ్రివెన్ గవర్నెన్సుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధి కారులను ఆదేశించారు. ప్రతీ రంగంలోనూ గ్రాస్ వాల్యూ అడిషన్ను పెంచేందుకు శ్రద్ధపెట్టాలని స్పష్టం చేశారు. తయారీ, గనులు, వాణిజ్యం, రవాణా, తదితర, రంగాలతోపాటు అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్పోర్టులతో ఆర్థిక వ్యవస్థకు మల్టిప్లైయర్ ఎఫెక్ట్ వచ్చేలా ప్రణాళికలు చేపట్టాలన్నారు. అధికారులు, ఉద్యోగుల సామర్థ్యాల పెంపుపై జూలై 2-3 తేదీల్లో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ నిర్వహించాలని సీఎం సూచిం చారు. జీఎస్టీ సహా పన్ను వసూళ్లపై పూర్తి సాంకేతి కతను వినియోగించాలని స్పష్టం చేశారు. ఈ సమీక్ష కు సీఎస్ సాయిప్రసాద్, ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ, ఉద్యాన, రవాణా, పర్యాటకశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.















