- ఘనస్వాగతం పలికిన తెలుగు కుటుంబాలు
- నేటి నుంచి రెండురోజుల పాటు పర్యటన
- ప్రధాని, మంత్రులు పారిశ్రామికవేత్తలతో భేటీలు
రెండురోజుల పర్యటనలో భాగంగా ఆదివారం సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అక్కడి తెలుగు ప్రజలు, ఎనఆరఐలు ఘన స్వాగతం పలికారు. తమ కుటుంబసభ్యులతో కలిసి పెద్దఎత్తున తరలివచ్చిన తెలుగు కుటుంబాలు తమ అభి మానాన్ని చాటుకున్నాయి. సీఎం చంద్రబాబు అందరినీ ఆప్యా యంగా పలకరిస్తూ వారితో ఫొటోలు దిగారు. సింగపూర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సోమ, మంగళ వారాల్లో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అవుతారు. సింగ పూర్ ప్రధాని, మంత్రులతోనూ చర్చించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సమావేశాలు జరగనున్నాయి. సింగపూర్ పర్యటనకు కుటుంబసమేతంగా తరలివచ్చి తనకు, తన బృందా నికి స్వాగతం పలికిన తెలుగు కుటుంబాల ప్రేమాభిమానాలు మరువలేనని, వారి ఆదరణకు కృతజ్ఞుడినంటూ సీఎం చంద్రబా బు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.














