- రిపోర్ట్ వచ్చాక నిధుల విడుదలపై దృష్టి
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యం గ్రామం వద్ద వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్ తయారుచేసే బాధ్యతను వాప్కోస్‌కు అప్పగిస్తూ జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీపీఆర్ వచ్చాక నిధుల విడుదలపై దృష్టి సారిస్తుం ది. 80 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ పథకానికి అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు సాధించే బాధ్యతను వాప్కోస్‌కే అప్పగించారు.













