- ఎంవోయూల కార్యరూపానికి ప్రణాళికలు
- డిమాండ్‌ను అంచనా వేసి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు
- ప్రతి ఎనర్జీ ఒప్పందం గ్రౌండ్ అవ్వాలి
- విద్యుత్ అవసరాలకు ప్రైవేట్ సెక్టార్‌పై ఆధారపడడం తగ్గించుకోవాలి
- డిసెంబరు నాటికి 10 లక్షల పీఎం సూర్యఘర్ లక్ష్యం చేరుకోవాలి
- సాగునీటి ప్రాజెక్టుల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు
- విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అంచనా వేసి తదనుగుణంగా ప్రణాళికలు రూపొందిం చి తక్షణం వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో వంటి సమస్యల కారణంగా వర్షాకాలంలో కూడా విద్యు త్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని…ఇలాంటి సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుని ఎదుర్కోవాలని సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు విద్యుత్ డిమాండ్ 18.23 శాతం పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరిం చారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు మార్కెట్ లో విద్యుత్ ధరలు కూడా తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం ప్రైవేటు సంస్థలపై ఆధార పడడం తగ్గించాలని సూచించారు. దీనికోసం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ ప్రాజెక్టులు గ్రౌండ్ చేయాలన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల్లో హామీ ఇచ్చామని… దానికి కట్టుబడి ఉన్నా మని గుర్తు చేసిన సీఎం… విద్యుత్ కొనుగోలు భారం తగ్గించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాల్లో ఏఐ వంటి టెక్నాలజీని ఉపయోగించి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. అప్పుడు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉండదని తెలిపారు.
ట్రాన్స్ఫార్మర్ల చోరీలపై కఠిన చర్యలు
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీల అంశం కూడా సమీక్షలో చర్చకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయని అధికారులు తెలిపారు. రాగి తీగలు కోసం ట్రాన్స్ఫార్మర్లు దొంగిలిస్తున్నారని అధికారులు తెలు పగా…ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిపట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని అదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్న వారిని వదిలిపెట్టవద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో దర్యాప్తునకు పోలీస్ అధికారుల సహకారం తీసు కోవాలని… చోరీలకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని సూచించారు.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగవంతం కావాలి
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచే దిశగా చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశిం చారు. జూన్ 2024 నుంచి విద్యుత్ రంగంలో 103 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబ డులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.2.56 లక్షల కోట్ల విలువైన పెట్టుడుల ఒప్పం దాలు జరిగినట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఒప్పందాలు కార్యరూపం దాల్చడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంవోయూలు చేసుకున్న ప్రతి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ రూపొందిం చాలని ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద రాష్ట్రంలో రూ.21,838 కోట్లతో భారీ విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కారిడార్ ద్వారా 47 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్ధ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా టెండర్లు పిలిచి రెండేళ్లలోగా కార్యరూపం లోకి తీసుకురావాలని ఆదేశించారు.
36,050 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ లక్ష్యం
రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తం గా 36,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు వివరిం చారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో 27 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు లకు అనువైన ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై మరింత పరిశోధన, అధ్యయనం జరగాలని సూచించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలులో ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొద టిస్థానానికి తీసుకువెళ్లాలని నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయా లు, ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలపై సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుతో పాటు…
సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్లపై సోలా ర్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉందన్నారు. సోలార్ రూఫ్‌టాప్ లో నాయుడుపేట, మాచర్ల, నరసరావుపేట డివిజన్లు ముందు న్నాయని అధికారులు తెలిపారు. అలాగే ఇప్పటివరకు 7.42 లక్షల రూఫ్‌టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లు పూర్తి చేసినట్టు అధికారు లు పేర్కొనగా, 10 లక్షల లక్ష్యాన్ని డిసెంబరు నాటికి చేరుకోవా లని సీఎం స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల పనుల్లో పురోగతి ఉందని అధికారులు వివరించారు. పీఎం కుసుమ్ ప్రాజె క్టుల కోసం భూసేకరణ 100 శాతం పూర్తి చేశామని, అలాగే సివిల్ పనులు 91 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.




















