సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు లేఖలో కోరారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇప్పటికే చాల సార్లు ఫిర్యాదు చేశామని. అయినా ఆయా ఫిర్యాదులపై తగు రీతిలో స్పందించి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
ఇప్పుడు అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని. అధికార వైసీపీ నేతలతో ఓ వర్గం అధికారులు కుమ్మక్కై ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు