అమరావతి: దేశ అత్యున్నత పౌరపుర స్కారం ‘భారత రత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి ఎక్స్ వేదికగా చంద్రబాబు భినందనలు తెలిపారు. దేశం పట్ల అద్వానీ అంకితభావం ఎనలేనిదన్నారు. దేశాభివృద్ధికి అద్వానీ ఆదర్శనీయమైన కృషి చేశారన్నారు. గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు అయిన అద్వానీ దేశానికి అసాధారణమైన సేవలను అందించారని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఆయన చూపించే ఆప్యాయత ప్రతిఒక్కరిపై చెరగని ముద్రవేస్తుందన్నారు. గతంతో అద్వానీతో దిగిన ఫొటోను చంద్రబాబు షేర్ చేశారు.
అద్వానీకి భారతరత్న హర్షణీయం: అచ్చెన్నాయుడు
అమరావతి: భారతరత్న అవార్డు గ్రహీత బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందనలు తెలిపారు. అద్వానీ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు. కష్టపడి నిబద్ధతతో పనిచేసిన వారికి ఎప్పటికైనా సరైన గౌరవం దక్కుతుందనేదానికి ఇదే ఉదాహరణ అన్నారు. అద్వానీ తన రాజకీయ రంగ ప్రవేశం నుంచి క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగేవరకు హుందాగా రాజకీయాలు చేశారు. కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా అద్వానీ దేశ ప్రజలకు అందించిన సేవలు ఎనలేవిని. 2004 తరువాత ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్‌లో కీలక పాత్ర పోషించారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.