- అటవీ శాఖ సింగిల్ విండోకు ఏపీ కస్టోడియన్‌గా ఉంటుంది
- కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేంద్రను కోరిన పవన్ కళ్యాణ్
అమరావతి (చైతన్య రథం): ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీనిద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ`వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివేదించారు. ఢల్లీి పర్యటనలోవున్న పవన్ బుధవారం ఉదయం భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాలమీద కేంద్ర మంత్రితో చర్చించారు. ‘బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనల ప్రకారం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతి విషయంలో సింగిల్ విండో విధానం మేలు. దానికి కస్టోడియన్‌గా ఏపీకి బాధ్యతలు అప్పగించే ప్రతిపాదననను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఎర్రచందనం గ్రేడిరగ్, వేలం, ఎగుమతి సాగిస్తుంది. తద్వారా ఈ-వేలం ద్వారా రెవెన్యూ పెరుగుతుంది అన్నారు.
ఏ రాష్ట్రంలో పట్టుబడినా…
ఎర్రచందనం అరుదైన వృక్ష సంపద. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలోనే పెరుగుతుంది. ఈక్రమంలో కేంద్రం నిబంధనలను సవరించి ఆంధ్రప్రదేశ్ వెలుపల పట్టుబడిన ఎర్రచందనం సైతం సింగిల్ విండో వేలంలో భాగం కస్టోడియన్‌గా ఉండే ఏపీకే దక్కేలా చూడాలి. దీనివల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పట్టుబడిన ఎర్రచందనం అమ్ముకోవడానికి కుదరదు. అమ్మకాలు, ఎగుమతులు ఒకే విధానం ద్వారా కొనసాగుతుంది. కేంద్ర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కస్టోడియన్‌గా కొనసాగుతుంది’’ అని పవన్ కల్యాణ్ వివరించారు.