చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

సోలార్.. విండ్.. హైబ్రిడ్.. పంప్డ్ స్టోరేజ్.. గ్రీన్ హైడ్రోజన్

by చైతన్యరధం
Sep 28, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • విద్యుదుత్పత్తి నుంచి ఎనర్జీ ఎకానమీవైపు అడుగులు
  • 24/7 పవర్ కోసం స్టోరేజీపై ప్రత్యేక దృష్టి
  • రూ.5,176 కోట్లకు పైగా కొత్త ప్రాజెక్టులు..
  • డేటా సెంటర్లు, గ్రీన్ పరిశ్రమలు, క్లీన్ ఎనర్జీకి కొత్త అవకాశాలు

ఒకప్పుడు విద్యుత్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్లు, హైడల్ ప్రాజెక్టులు, ట్రాన్స్మిషన్ లైన్లు, సబ్ స్టేషన్లు మాత్రమే. విద్యుదుత్పత్తి ఎంత? డిమాండ్ ఎంత? లోటు ఎంత? అదనపు విద్యుత్ను ఎక్కడినుంచి కొనాలి? ఇవే ప్రధాన ప్రశ్నలు. అలాంటి విద్యుత్ రంగం నిర్వచనాన్ని ఏపీ. సర్కారు మారుస్తోందా? సూర్యుడి నుంచి విద్యుత్.. గాలిలోని శక్తిని విద్యుత్గా మార్చడం.. రెండింటినీ కలిపిన హైబ్రిడ్ ప్రాజెక్టులు.. అవసరమైనప్పుడు విద్యుత్ను విడుదల చేసే పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్.. భవిష్యత్ పరిశ్రమలకు ఇంధనంగా మారనున్న గ్రీన్ హైడ్రోజన్.. ఈ మొత్తం వ్యవస్థను ఒకే ఎనర్జీ ఎకానమీగా మలిచే కొత్త దిశలోకి అడుగు పెడుతుందా? అంటే.. పెట్టిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇదే మార్గంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ రూ.5,176.56 కోట్ల విలువైన ఇంధన రంగ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వీటిలో శ్రీ సత్యసాయి జిల్లాలో 675 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుతో పాటు వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,240 ఉద్యోగాల సృష్టి అవకాశాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఈ నిర్ణయాన్ని కేవలం మరికొన్ని సోలార్ ప్రాజెక్టులకు అనుమతిచ్చిన చర్యగా చూడటం కంటే… రాష్ట్ర ఎనర్జీ మ్యాప్లో చోటుచేసుకుంటున్న విస్తృత మార్పులో మరో అడుగుగా చూడాల్సిన తరుణమిది. ఏపీకి పునరుత్పాదక విద్యుత్ రంగం కొత్తేమీ కాదు. రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతాలు సౌర, పవన విద్యుత్కు అనుకూలంగా ఉన్నాయి. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, సత్యసాయి జిల్లాలు ఇప్పటికే రెన్యూవబుల్ ఎనర్జీ పెట్టుబడులకు కేంద్రాలుగా మారుతున్నాయి.

మరోవైపు తీర ప్రాంతానికి చెందిన జిల్లాలు భవిష్యత్లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, పోర్టు ఆధారిత క్లీన్ ఎనర్జీ పరిశ్రమలకు అవకాశాలు కల్పించగలిగేవిగా ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం 2024లో తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా సోలార్, విండ్, విండ్-సోలార్ హైబ్రిడ్, చిన్న జలవిద్యుత్, పంప్ట్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, బయోఫ్యూయల్స్, ఈవీ చార్జింగ్ వంటి రంగాలను ఒకే క్లీన్ ఎనర్జీ ఫ్రేమ్ వర్స్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం లక్ష్యం కేవలం విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాదు, రాష్ట్రంలో పెద్దఎత్తున రెన్యూవబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, స్థానిక ఉద్యోగాలను సృష్టించడం, క్లీన్ ఎనర్జీ పరికరాల తయారీకి ఎకో సిస్టము అభివృద్ధి చేయడం, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఎగుమతులకు రాష్ట్రాన్ని సిద్ధం చేయడంవంటి అంశాలను విధాన లక్ష్యాలుగా పేర్కొంది. దీర్ఘకాలికంగా సుమారు 160 గిగావాట్ల అదనపు రెన్యూవబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే లక్ష్యాన్ని కూడా పాలసీ ప్రస్తావించింది.. అంటే.. ఎనర్జీ పాలసీని ఇకపై విద్యుత్ శాఖకు మాత్రమే పరిమితం చేయకుండా పరిశ్రమలు, పెట్టుబడులు, తయారీ, రవాణా, డిజిటల్ రంగం, ఎగుమతులతో అనుసంధానించే ప్రయత్తానికి పురిపెట్టింది.

సంబంధితవార్తలు

విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో జరిగిన మిషన్ కర్మయోగి వర్క్‌షాప్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొని ప్రసంగించారు.

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ఉదయం సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

24/7 పవర్.. అసలు కీలకం ఇదే
రెన్యూవబుల్ ఎనర్జీ పెరగడం ఒక విషయం. రోజులో ప్రతి గంటా నాణ్యమైన విద్యుత్ అందుబాటులో ఉండటం మరో విషయం. సూర్యుడు ఉన్నప్పుడు సోలార్ విద్యుత్ ఎక్కువగా వస్తుంది. గాలి వేగం ఉన్నప్పుడు విండ్ పవర్ ఉత్పత్తి పెరుగుతుంది. కానీ విద్యుత్ అవసరం మాత్రం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నిరంతరం ఉంటుంది. ఈ అంతరాన్ని పూడ్చకపోతే పెద్ద పరిశ్రమలు, డేటా. సెంటర్లు, అత్యాధునిక తయారీ యూనిట్లు పూర్తిగా రెస్యూవబుల్ ఎనర్జీపై ఆధారపడటం కష్టం. ఇక్కడే ఎనర్జీ స్టోరేజ్ ప్రాధాన్యం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రూపొందించిన రోడ్ మ్యాప్లో 1,600 మెగావాట్ల కొత్త థర్మల్ పవర్ తోపాటు 2,000 మెగావాట్లకు పైగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులను విస్తరించడంపై దృష్టి పెట్టింది. నిజానికి -ఇది కీలక మార్పు. భవిష్యత్ విద్యుత్ వ్యవస్థలో “ఎంత విద్యుదుత్పత్తి చేస్తున్నాం?” అన్న ప్రశ్నతో పాటు “అవసరమైనప్పుడు ఎంత విద్యుత్ను వెంటనే అందించగలం?” అన్న ప్రశ్న కూడా ముఖ్యమవుతుందన్న ముందుచూపు. సోలార్ పవరు పగటిపూట ఉత్పత్తి చేసి నిల్వ చేసి రాత్రి వినియోగించడం.. గాలి విద్యుత్ అధికంగా ఉన్న సమయంలో నిల్వ చేయడం.. డిమాండ్ పెరిగినప్పుడు ఆ విద్యుత్ను గ్రిడ్లోకి పంపించడం… ఈ వ్యవస్థే భవిష్యత్ పవర్ గ్రిడ్కు కీలకం.

పంప్డ్ స్టోరేజ్.. నీటితో తయారయ్యే ‘బ్యాటరీ’
పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టులను సులభంగా చెప్పాలంటే.. భారీస్థాయి ‘వాటర్ బ్యాటరీ’గా చూడవచ్చు. విద్యుత్ అందుబాటులో ఎక్కువగా ఉన్న సమయంలో నీటిని దిగువ జలాశయంనుంచి ఎగువ జలాశయానికి పంపిస్తారు. విద్యుత్ అవసరం పెరిగినప్పుడు ఆ నీటిని కిందకు వదిలి టర్బైన్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తారు. సోలార్, విండ్వంటి మారుతున్న ఉత్పత్తి స్వభావం కలిగిన విద్యుత్ వనరులకు ఇది ముఖ్యమైన బ్యాలెన్సింగ్ వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని భారీగా వినియోగించుకోవాలని ఇప్పటికే ప్రత్యేక విధానం తీసుకొచ్చింది. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నమోదు చేసిన రాష్ట్ర విధానాల ప్రకారం, ఏపీ పంప్డ్ స్టోరేజ్ పాలసీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సుమారు 33 గిగావాట్ల పీఎస్పీ సామర్థ్యాన్ని వినియోగించుకోవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేవలం పవర్ ప్రాజెక్టుల పరంగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరంగానూ కీలక అవకాశం. భారీ స్టోరేజ్ ప్రాజెక్టులు వస్తే నిర్మాణరంగంలో పెట్టుబడులు, స్థానిక సేవలు, ఇంజినీరింగ్, నిర్వహణ, పరికరాల సరఫరా వంటి అనేక రంగాలకు డిమాండ్ ఏర్పడుతుంది.

కర్నూలునుంచి కనిపిస్తున్న భవిష్యత్ మోడల్
కర్నూలు ప్రాంతంలో ఇప్పటికే ఏర్పడుతున్న భారీ ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ మోడల్ ఈ మార్పునకు ఒక ఉదాహరణ. పిన్నాపురం వద్ద ‘గ్రీన్కో’ అభివృద్ధి చేస్తున్న ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులో 4,000 మెగావాట్ల సోలార్, 1,000 మెగావాట్ల విండ్, 1,680 మెగావాట్ల పంప్డ్ హైడ్రో పవర్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ వివరాల ప్రకారం, ఈ ప్రాజెక్టుకు రోజుకు ఒక సైకిల్ 10,080 మెగావాట్ అవర్ స్టోరేజ్ సామర్ధ్యముంది. గ్రీన్ స్టీల్, గ్రీన్ అల్యూమినియం, గ్రీన్ హైడ్రోజన్వంటి పరిశ్రమలకు డిస్బాచబుల్ క్లీన్ పవర్ అందించడమే దీని లక్ష్యాల్లో ఒకటి, ఇలాంటి ప్రాజెక్టులు ఒక కొత్త ఆలోచనను ముందుకు తెస్తున్నాయి. అంటే, విద్యుదుత్పత్తి చేసే రాష్ట్రం మాత్రమే కాదు.. ఆ విద్యుత్ను నిల్వ చేసి, అవసరమైనప్పుడు అందించి, దానిని ఆధారంగా చేసుకుని కొత్త పరిశ్రమలను ఆకర్షించే రాష్ట్రంగా ఏపీ అవతరించబోతోంది. ఇదే ఎనర్జీ ఎకానమీ!

సోలార్ విండ్ హైబ్రిడ్ ఎందుకు?
ఒక ప్రాంతంలో కేవలం సోలార్ ప్రాజెక్టు ఉంటే రాత్రిపూట ఉత్పత్తి ఉండదు. కేవలం విండ్ ప్రాజెక్టు ఉంటే గాలి వేగంపై ఆధారపడాల్సి ఉంటుంది. రెండింటినీ కలిపిన హైబ్రిడ్ మోడల్లో ఉత్పత్తి ప్రొఫైల్ను కొంత సమతుల్యం చేయవచ్చు. ఇదే కారణంగా ఏపీలో సోలార్ విండ్ హైబ్రిడ్ ప్రాజెక్టులపై దృష్టి పెరుగుతోంది. మొన్నటి జూలైలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 800 మెగావాట్ల ప్రాజెక్టుకు కర్నూలు-అనంతపురం ప్రాంతంలో గ్రౌండ్ బ్రేకింగ్ చేసింది. ఇందులో 400 మెగావాట్ల విండ్, 400 మెగావాట్ల సోలార్ సామర్థ్యముంది. కంపెనీ చెప్తోన్న దాని ప్రకారం, ప్రాజెక్టుకు రూ.5,750 కోట్ల పెట్టుబడి ఉండగా, సుమారు 4,000 ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ప్రాజెక్టుకు 800 మెగావాట్ల ఇంటర్-స్టేట్ ట్రాన్స్మాషన్ సిస్టమ్ కనెక్టివిటీ కూడా ఉంది. ఇది మరో ముఖ్య విషయాన్నీ చూపిస్తోంది. రెస్యూవబుల్ పవర్ ప్రాజెక్టు పెట్టడం మాత్రమే సరిపోదు. ఉత్పత్తి చేసిన విద్యుత్ను జాతీయ లేదా గ్రిడు సమర్థంగా తరలించేందుకు ట్రాన్స్ మిషన్ మౌలిక సదుపాయాలు కూడా అదే వేగంతో అభివృద్ధి చెందాలి.

ట్రాన్స్ మిషన్.. కీలకమైన మౌలిక సదుపాయం
ఒక ప్రాంతంలో వేల మెగావాట్ల సోలార్, విండ్ విద్యుదుత్పత్తి చేయవచ్చు. కానీ ఆ విద్యుత్ను. వినియోగ కేంద్రాలకు తీసుకెళ్లే ట్రాన్స్మషన్ నెట్వర్క్ లేకపోతే పెట్టుబడుల ప్రయోజనం పూర్తిగా అందదు. అందుకే భవిష్యత్ ఎనర్జీ మ్యాప్లో మూడు లేయర్లను చూడాలి. మొదటిది -జెనరేషన్, సోలార్, విండ్, హైబ్రిడ్ ద్వారా విద్యుదుత్పత్తి. రెండోది -స్టోరేజ్, బ్యాటరీలు, పంప్డ్ స్టోరేజ్ ద్వారా అవసరమైన సమయానికి విద్యుత్ అందుబాటులో ఉంచడం. మూడోది -ట్రాన్స్ మిషన్. ఆ విద్యుత్ను పరిశ్రమలు, నగరాలు, డేటా సెంటర్లు, వ్యవసాయ రంగ ప్రాంతాలకు తరలించడం. ఈ మూడు కలిసి పనిచేసినప్పుడే క్లీన్ ఎనర్జీ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపుతాయి.
ఇక్కడ ఏపీకి ఉన్న మరో బలం పోర్టులు. గ్రీన్ హైడ్రోజన్ లేదా గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసిన తర్వాత దేశీయ పరిశ్రమలకు సరఫరా చేయడంతోపాటు భవిష్యత్లో ఎగుమతులకు కూడా పోర్టులు కీలకం కావచ్చు. అంటే.. రాయలసీమలో రెన్యూవబుల్ విద్యుత్ ? స్టోరేజ్ ? గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ? తీర ప్రాంత పోర్టులు ? దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు అనే ఒక కొత్త ఎనర్జీ కారిడార్ ఆలోచన పదునుదేరుతోంది.

విశాఖలో డేటా సెంటర్లు.. విద్యుత్కు కొత్త డిమాండ్
ఇక మరోవైపు ఏపీకి వస్తున్న డేటా సెంటర్ పెట్టుబడులు ఎనర్జీ రంగానికి కొత్త డిమాండ్ను సృష్టించే అవకాశముంది. డేటా సెంటర్లు 24 గంటలూ విద్యుత్ అవసరమయ్యే మౌలిక సదుపాయాలు, ఒక్కసారి డేటా సెంటర్ ఆపరేషన్స్ ప్రారంభమైతే నిరంతర విద్యుత్ సరఫరా, బ్యాకప్, కూలింగ్, నీటి లభ్యతవంటి అంశాలు అత్యంత కీలకం. అందుకే విశాఖపట్నాన్ని డేటా సెంటర్ హచ్గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న సమయంలో ఎనర్జీ పాలసీకి కూడా కొత్త ప్రాధాన్యం వచ్చింది. ఇటీవల రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఏపీలో డేటా సెంటర్లు వినియోగించే విద్యుత్లో కనీసం 70 శాతం పునరుత్పాదక వనరులనుంచి రావాలనే నిబంధనను రాష్ట్రం అమలు చేయాలని నిర్ణయించింది. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఆధారిత విద్యుత్ వనరులను దీనికి అనుసంధానించాలనే దిశను ప్రభుత్వం పేర్కొంది. డేటా సెంటర్ల నీటి అవసరాలను కూడా సమగ్రంగా పరిష్కరించే విధానంపై దృష్టి పెట్టింది. నిజానికి -ఇది ఒక ఆసక్తికరమైన మార్పు. ఇప్పటివరకు “డేటా సెంటర్ కోసం పవర్ ఎక్కడినుంచి వస్తుంది?” అనే ప్రశ్న ఉండేది. ఇప్పుడు.. “డేటా సెంటర్కు క్లీన్ఫవర్ ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ఎలా నిల్వ చేస్తాం? నీటి అవసరాన్ని ఎలా తీర్చాలి? కార్బన్ ఫుటప్రింట్ను ఎలా తగ్గించాలి?” అనే ప్రశ్నలు కూడా ముందుకు. వస్తున్నాయి.

టోరెంట్ వంటి పెట్టుబడిదారుల వైపు చూపు
ఇదే నేపథ్యంతో ఇటీవల ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ గుజరాత్లో టోరెంట్ గ్రూప్ ప్రతినిధులతో జరిపిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సోలార్, విండ్, హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులతోపాటు పంప్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఏపీలో పెట్టుబడులను పరిశీలించాలని ఆయన సంస్థను ఆహ్వానించారు. టోరెంట్ గ్రూప్ 2030 నాటికి 10 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుందని, ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సంస్థ ప్రతినిధులు మంత్రి లోకేష్కు హామీ ఇవ్వడం సానుకూల అంశం. ఇది పెట్టుబడి వచ్చేసిందని కాదు. కానీ రాష్ట్రం తన ఎనర్జీ వ్యూహాన్ని పరిశ్రమలతో అనుసంధానిస్తూ పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోందనే విషయం స్పష్టమవుతోంది. ఇలాంటి చర్చలు మరింత ముందుకెళ్తే.. భవిష్యత్లో పవర్ జనరేషన్ ప్రాజెక్టులతోపాటు పరికరాల తయారీ, ఇంజినీరింగ్, ఆపరేషన్స్, మెయింటెనెన్స్, ఎనర్జీ సాఫ్ట్వేర్, స్టోరేజ్ టెక్నాలజీవంటి అనుబంధ రంగాల్లోనూ పెట్టుబడులకు అవకాశం ఉంటుంది.

ఎనర్జీ మ్యాప్ లో జిల్లాల పాత్ర మారే అవకాశం
కొత్త ఎనర్జీ మ్యాప్లో ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక పాత్ర ఏర్పడే అవకాశముంది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలు -సోలార్, విండ్, హైబ్రిడ్, స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రధాన కేంద్రంగా ఎదగవచ్చు. వైఎస్సార్ కడప జిల్లా.. సోలార్ విండ్ హైబ్రిడ్తోపాటు భవిష్యత్ స్టోరేజ్ ప్రాజెక్టులకు అవకాశం కల్పించొచ్చు. ప్రకాశం జిల్లా.. రెన్యూవబుల్ ఎనర్జీ పరికరాల తయారీకి అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ఆధారంగా రిన్యూవబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఆధారంగా ప్లగ్ అండ్ ప్లే మోడల్లో అభివృద్ధి చేసే ప్రయత్నం జరుగుతోంది. విశాఖపట్నం జిల్లా.. డేటా సెంటర్లు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ ఎనర్జీ ఆధారిత పరిశ్రమలకు డిమాండ్ కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక కాకినాడ, కృష్ణపట్నం, రామాయపట్నం వంటి తీర ప్రాంతాలు -పోర్టుల ఆధారంగా గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్, ఎగుమతి ఆధారిత పరిశ్రమలకు అవకాశాలు పరిశీలించవచ్చు. ఇలా చూస్తే ఎనర్జీ రంగం ఒకే జిల్లాలోని పవర్ ప్లాంట్ సమస్యగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఒక పారిశ్రామిక భౌగోళికపటంగా మారుతున్న దృశ్యాలు ఏపీలో గోచరిస్తున్నాయి.

తయారీ రంగం వస్తే పూర్తి ప్రయోజనం
రెన్యూవబుల్ ప్రాజెక్టులు రావడం ద్వారా పెట్టుబడులు వస్తాయి. కానీ దీర్ఘకాలికంగా రాష్ట్రానికి ఎక్కువ విలువ రావాలంటే పరికరాల తయారీ కూడా పెరగాలి. సోలార్ మాడ్యూల్స్, ఇన్వర్టర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, కేబుల్స్, విండ్ టర్బైన్ భాగాలు, బ్యాటరీ ప్యాక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పంప్డ్ స్టోరేజ్ పరికరాలు, ఎలక్ట్రోలైజర్లు, గ్రీన్ హైడ్రోజన్ సంబంధిత పరికరాలు.. వీటి తయారీకి స్థానిక ఎకోసిస్టమ్ ఏర్పడితేనే రెన్యూవబుల్ ఎనర్జీ పెట్టుబడులు పెద్దస్థాయిలో ఉపాధి, చిన్న పరిశ్రమలు, సేవా రంగానికి ప్రయోజనం కలిగించగలవు. ఇదే అంశాన్ని ఐసీఈపీ (ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ) కూడా ప్రస్తావిస్తోంది. స్థానిక సోలార్, విండ్ తయారీ సదుపాయాలతోపాటు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల విలువ గొలుసును అభివృద్ధి చేయడం పాలసీ లక్ష్యాల్లో ఉంది. యువతకు క్లీన్ ఎనర్జీ రంగంలో నైపుణ్యాభివృద్ధి, పరిశోధనకు ప్రాధాన్యమివ్వాలని పాలసీ సూచిస్తోంది. అంటే భవిష్యత్లో ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో కూడా కొత్త కోర్సులకు డిమాండ్ రావచ్చు.
ఉద్యోగాల స్వభావం మారుతుంది.
ఎనర్జీ రంగంలో ఉద్యోగాలు అంటే ఇకపై పవర్ ప్లాంట్లో టెక్నీషియన్ ఉద్యోగాలకే పరిమితం కాదు. సోలార్ ప్రాజెక్టుల నిర్మాణం, సైట్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, డేటా అనలిటిక్స్, గ్రిడ్ మేనేజ్మెంట్, బ్యాటరీ మేనేజ్ మెంట్, పవర్ ట్రేడింగ్, స్టోరేజ్ ఆపరేషన్స్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఆపరేషన్స్, ఎలక్ట్రోలైజర్ మెయింటెనెన్స్, ఎనర్జీ ఆడిటింగ్ వంటి అనేక కొత్త ఉద్యోగ విభాగాలు ఏర్పడవచ్చు. ఇటీపల కేబినెట్ ఆమోదించిన రూ.5,176.56 కోట్ల ఎనర్జీ ప్రాజెక్టులకు సుమారు 2,240 ఉద్యోగాల ఉపాధి సామర్థ్యాన్ని అంచనా వేసింది. టాటా పవర్ 800 మెగావాట్ల ప్రాజెక్టుకు సుమారు 4,000 ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఉంటాయని సంస్థ వెల్లడించింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రాజెక్టు ప్రకటించడం, ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించడం, వాణిజ్య కార్యకలాపాలు మొదలవడం.. ఈ మూడు వేర్వేరు దశలు. కాబట్టి ఉద్యోగాల సంఖ్యను తక్షణంగా ఏర్పడిన ఉద్యోగాలుగా కాకుండా ఆయా సంస్థలు లేదా ప్రభుత్వం పేర్కొన్న అంచనా ఉపాధి సామర్థ్యంగా
చూడాలి

సేద్యంలోనూ ఎనర్జీ మార్పు ప్రభావం
క్లీన్ ఎనర్జీ చర్చ పరిశ్రమల దగ్గరే ఆగిపోదు. వ్యవసాయ రంగానికీ ఇది వర్తిస్తుంది. వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ద్వారా పగటి సమయంలో వ్యవసాయ పంపులకు విద్యుత్ అందించడం, రైతుల విద్యుత్ అవసరాలను కొంత స్థిరీకరించడం, అదనపు సోలార్ విద్యుత్ను గ్రిడు అనుసంధానించడం వంటి సమూనాలు దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నాయి. ఏపీకి కూడా వ్యవసాయ విద్యుత్ వినియోగం పెద్ద అంశమే. కాబట్టి సోలార్ ఆధారిత వ్యవసాయ ఫీడర్లు, పంపులు, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్పంటి అంశాలు గ్రామీణ ఎనర్జీ వ్యవస్థలో భాగమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎనర్జీ రంగం కొత్త పెట్టుబడులకు రావొచ్చన్న అంచనాలున్నాయి.

ఇళ్లపై సోలార్.. వికేంద్రీకృత విద్యుత్ వ్యవస్థ
పెద్ద ప్రాజెక్టులతోపాటు చిన్నస్థాయి సోలార్ వ్యవస్థలు కూడా భవిష్యత్ ఎనర్జీ మ్యాప్లో భాగమవుతున్నాయి. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం, రైతు పంపులను సోలరైజ్ చేయడం, పరిశ్రమల రూçప్ సోలార్, ప్రభుత్వ భవనాల్లో సౌర విద్యుత్ వంటి విధానాలు విద్యుదుత్పత్తిని కేంద్రీకృత వ్యవస్థ నుంచి కొంత వికేంద్రీకరించగలవు. ఎన్ఆర్డీసీఏపీ ప్రస్తుతం రాష్ట్రంలో రూఫెటాప్ సోలార్ వ్యవస్థలకు సంబంధించిన కార్యక్రమాలు, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ వంటి చర్యలను ముందుకు తీసుకెళ్తుంది.

అంటే ఒకవైపు గిగావాట్ స్థాయి ప్రాజెక్టులు.. మరోవైపు కిలోవాట్ స్థాయి రూప్ సోలార్. ఈ రెండు కలిసినప్పుడే ఎనర్జీ ట్రాన్సిషన్ విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ముందుకు సాగుతుంది. ఇటీవలి పరిణామాలను కలిపి చూస్తే ఏపీ ఎసర్జీ వ్యూహంలో ఒక కొత్త చైన్ కనిపిస్తోంది.
సూర్యుడు- సోలార్ పవర్, గాలి- విండ్ పవర్, సూర్యుడు ప్లస్ గాలి -హైబ్రిడ్ పవర్, అధిక విద్యుత్ -బ్యాటరీ/పంప్డ్ స్టోరేజ్, క్లీన్ పవర్ -గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ పవర్ ప్లస్ వీరు ప్లస్ పోర్టులు –గ్రీన్ ఇండస్ట్రీస్, క్లీన్ పవర్ ప్లస్ డిజిటల్ మౌలిక సదుపాయాలు -డేటా సెంటర్లు, క్లీన్ ఎనర్జీ ప్లస్ తయారీ -కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్.. ఇవన్నీ కలిస్తే -పెట్టుబడులు ప్లస్ ఉపాధి ప్లస్ ఎగుమతులు. ఇదే అసలు ఎనర్జీ మ్యాప్ మార్పు.

2030 దిశగా… ఏపీకి కొత్త అవకాశం
కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2026 ఆగస్టు 31 నాటికి దేశంలో మొత్తం రెస్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం 296.55 గిగావాట్లకు చేరింది. ఇందులో 168.04 గిగావాట్ల సోలార్, 58,52 గిగావాట్ల విండ్ సామర్థ్యం ఉన్నాయి. దేశవ్యాప్తంగా రెస్యూపబుల్ ఎనర్జీ వేగంగా పెరుగుతున్న సమయంలో రాష్ట్రాల మధ్య పెట్టుబడుల కోసం పోటీ కూడా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఏపీ కొత్త అవకాశాలకు ద్వారాలు తెరుస్తోంది. ఒకటి.. భారీస్థాయి. రెన్యూవబుల్ విద్యుదుత్పత్తి రాష్ట్రంగా ఎదగడం, రెండు.. ఆ విద్యుత్ను ఆధారంగా చేసుకుని కొత్త పరిశ్రమలను రాష్ట్రంలోనే ఏర్పాటు చేయడం.. విద్యుత్ను ఉత్పత్తి చేసి బయటకు అమ్మడం ద్వారా ఒకస్థాయి ఆదాయం వస్తుంది. కానీ అదే విద్యుత్తో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేసి, దానితో గ్రీస్ అమోనియా లేదా గ్రీన్ ఫ్యూయల్స్ తయారు చేసి, వాటిని పోర్టుల ద్వారా ఎగుమతి చేస్తే విలువ గొలుసు మరింత విస్తరిస్తుందన్నది కూటమి సర్కారు ప్రణాళిక. అదేవిధంగా క్లీన్ పవర్ను డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, గ్రీన్ స్టీల్, గ్రీన్ కెమికల్స్, రెన్యూవబుల్ పరికరాల తయారీకి వినియోగిస్తే విద్యుత్ ఒక ముడి వనరుగా కాకుండా పారిశ్రామిక అభివృద్ధికి బేస్ గా మారుతుంది..

‘పవర్’ నుంచి ‘పవర్ఫుల్ ఎకానమీ’ వరకు
ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ మ్యాప్ లో జరుగుతున్న మార్పును ఒక వాక్యంలో చెప్పాలంటే.. విద్యుదుత్పత్తి చేసే రాష్ట్రం నుంచి.. విద్యుత్ను ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, పరిశ్రమలకు అందించి, క్లీన్ ఎనర్జీ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి, ప్రపంచ మార్కెట్లకు పంపే రాష్ట్రంగా మారే ప్రయత్నం. ఇది ఒక్క ప్రభుత్వ శాఖతో సాధ్యమయ్యే మార్పు కాకపోవచ్చు. ఎనర్జీ, పరిశ్రమలు, ఐటీ, మౌలిక సదుపాయాలు, నీటి వనరులు, పోర్టులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం.. అన్ని శాఖలు ఒకే దిశలో పనిచేయాల్సి రావొచ్చు, చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ ఆలోచన ఇదే. ప్రస్తుతం కేబినెట్ ఆమోదించిన కొత్త ఎనర్జీ ప్రాజెక్టులు, 24/7 పవర్ కోసం స్టోరేజ్ ప్రణాళికలు, ఇప్పటికే కొనసాగుతున్న భారీ సోలార్ విండ్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్పీ దృష్టి గ్రీన్ హైడ్రోజన్ పాలసీ, డేటా సెంటర్లకు రెన్యూవబుల్ ఎనర్జీ నిబంధనలు, పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నాలు.. ఇవన్నీ విడివిడిగా కనిపించినా ఒకే పెద్ద ఎనర్జీ వ్యూహంలోని భాగాలే. అందుకే -“ఎనర్జీ మ్యాప్లో ఏపీకి కొత్త రూపం” అంటున్నది.

రేపటి ప్రశ్న -ఎవరి దగ్గర ఎక్కువ విద్యుత్ ఉంది? అన్నది కాదు. ఎవరు చౌకగా, నమ్మకంగా, నిరంతరంగా, శుభ్రమైన విద్యుత్ను అందించగలరు? ఆ విద్యుత్తో ఎవరు ఎక్కువ విలువను సృష్టించగలరు? అన్నది. అదే భవిష్యత్ పారిశ్రామిక పోటీకి అసలు కొలమానం. ఆ పోటీలో సౌరశక్తి, పవన వసరులు, పంప్డ్ స్టోరేజ్ అవకాశాలు, తీర ప్రాంతం, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు డిజిటల్ మౌలిక సదుపాయాలు.. వీటన్నిటినీ కలిపి ప్రయోగించి రాష్ట్రానికి ఒక ప్రత్యేక ఎనర్జీ- ఇండస్ట్రీ మోడల్ నిర్మించాలన్న ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి వ్యూహంలో ప్రధానాంశం. సోలార్ నుంచి స్టోరేజ్ వరకు.. స్టోరేజ్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ వరకు. అక్కడినుంచి పరిశ్రమలు, డేటా సెంటర్లు, తయారీ, ఎగుమతుల వరకు.. ఈ ప్రయాణమే ఏపీ కొత్త ఎనర్జీ మ్యాచ్లో అంతర్లీనంగా రూపుదిద్దుకుంటున్న అసలు దృశ్యం!

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 27-09-2026

Next Post

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-09-2026

కార్యకర్త
@ September 29, 2026
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్
ఆంధ్రప్రదేశ్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-09-2026

కార్యకర్త
@ September 28, 2026
పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ September 28, 2026
పల్లె పండుగ 3.0 విజయవంతం చేయాలి
ఆంధ్రప్రదేశ్

పల్లె పండుగ 3.0 విజయవంతం చేయాలి

చైతన్యరధం
@ September 28, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం
ఆంధ్రప్రదేశ్

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-09-2026

కార్యకర్త
@ September 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-09-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-09-2026

కార్యకర్త
@ September 26, 2026
Load More

ముఖ్య వార్తలు

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

ఎనర్జీ మ్యాప్ లో.. ఏపీకి కొత్త షేప్

చైతన్యరధం
@ September 28, 2026
జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

జెట్ ‘స్పీడ్’తో స్వప్నయాత్ర

చైతన్యరధం
@ September 26, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

చైతన్యరధం
@ September 29, 2026
పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం

చైతన్యరధం
@ September 28, 2026
పల్లె పండుగ 3.0 విజయవంతం చేయాలి

పల్లె పండుగ 3.0 విజయవంతం చేయాలి

చైతన్యరధం
@ September 28, 2026
మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

మంత్రి లోకేష్ చేతుల మీదుగా మరో 372మందికి పట్టాభిషేకం

చైతన్యరధం
@ September 28, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist