అమరావతి (చైతన్యరథం): ‘సత్యం, అహింస, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి గాంధీజీ ఆశయాలు నేటికీ మనకు మార్గదర్శకం. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన త్యాగాలు, ప్రజలను ఏకం చేసి నడిపించిన తీరు చిరస్మరణీయం. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, స్వావలంబనతో కూడిన, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరం పనిచేద్దాం. భారతదేశ నిర్మాణంలో భాగంగా వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర కోసం గాంధీజీ చూపిన బాటలో నడుద్దాం. నిరాడంబరతకు ప్రతిరూపం, దేశభక్తి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం లాల్ బహుదూర్ శాస్త్రి. దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ ఆహార భద్రతలో రైతుల పాత్రను గుర్తించి ఆయన ఇచ్చిన ‘జై జవాన్-జై కిసాన’ నినాదం దేశ ప్రజల్లో ఎప్పటికీ స్ఫూర్తి రగిలిస్తూనే ఉంటుంది. కష్టకాలంలోనూ దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తూ లాల్ బహుదూర్ శాస్త్రి చూపిన నాయకత్వం, కర్తవ్యనిష్ఠ మనందరికీ ఆదర్శం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి అంకితభావంతో పనిచేద్దాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. భారత జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారి చిత్రపటాలకు చంద్రబాబు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు















