మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)కు శంకుస్థాపన కార్యక్రమం
మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH), ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA)కు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పండ్లు, పూల అలంకరణలు, ఉద్యాన పంటల ప్రదర్శనలు, నీటి సంరక్షణ నమూనాలతో సభా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.