- మంగళగిరి నియోజకవర్గంలో భారీ చేరికలు
- పార్టీలో చేరిన పట్టణ వైసీపీ మాజీ అధ్యక్షుడు మునగాల
- ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్డ్డి
- వైసీపీ సీనియర్ నేతలు ప్రభాకర్ రెడ్డి, కట్టెపోగు బాబురావు
- గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణ
- కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన మంత్రి లోకేష్
ఉండవల్లి (చైతన్య రథం): స్థానిక ఎన్నికలవేళ మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. విద్య, ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి మండలాలకు చెందిన పలువురు సీనియర్ వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. మంగళగిరి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్, పట్టణ వైసీపీ
మాజీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, ఆయన సతీమణి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్.. మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. తాడేపల్లి రూరల్ ఉండవల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ కళ్లం సంజీవ్డ్డి, కళ్లం సాంబిరెడ్డి, కళ్లం శ్రీనివాసరెడ్డితోపాటు ఆరు కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన సీనియర్ వైసీపీ నేత, దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మాజీ ప్రత్యేక ఆహ్వానితులు, రాష్ట్ర రెడ్డి కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ జక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సూరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సూరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొల్లి లక్ష్మారెడ్డి, బొమ్మి కోటిరెడ్డితోపాటు నాలుగు కుటుంబాలు, తాడేపల్లి పట్టణానికి చెందిన వైసీపీ నేత దొంతిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డితో పాటు రెండు కుటుంబాలు, మంగళగిరి రూరల్ నిడమర్రుకు
చెందిన వైసీపీ సీనియర్ నేత కట్టెపోగు బాబురావుతో పాటు 6 కుటుంబాలు, మంగళగిరి రూరల్ యర్రబాలెంకు చెందిన గుంటూరు బ్రాహ్మణ సంఘం కార్యదర్శి వేమవరపు నారాయణతోపాటు ఐదు కుటుంబాలు తెలుగుదేశంలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరందరికీ పసుపు కండువాలు కప్పి మంత్రి లోకేష్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములవుదాం
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మీరంతా తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉంది. ఎన్నికల ముందు, తర్వాత నాది ఒక్కటే నినాదం, మంగళగిరి అభివృద్ధి. మంచి మెజార్టీతో నన్ను గెలిపిస్తే దేశంలోనే మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1 తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చా. ప్రస్తుతం ఏపీ చూపు మంగళగిరి వైపు ఉంది. అందరం మంగళగిరి అభివృద్ధిలో భాగస్వాములవుదాం. ఆసుపత్రి నుంచి స్మశానాల వరకు మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్, గ్యాస్ అందిస్తాం. రెండేళ్లలోనే అన్ని పనులు పూర్తిచేస్తాం. కలిసికట్టుగా మంగళగిరిని అభివృద్ధి చేసుకుందాం. మనందరం ఒక కుటుంబం లాంటివాళ్లం. నమ్మితే నేను ఏదైనా చేస్తా” అని భరోసానిచ్చారు.
మనపై బాధ్యత పెరిగింది. తప్పులు చేయకూడదు. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. వారికి ఏ కష్టం వచ్చినా చూసుకుంటా. మూడొందలు, నాలుగొందల ఏళ్ల తర్వాత మంగళగిరిని అప్పట్లో నారా లోకేష్ అభివృద్ధి చేశారని ప్రజలు చెప్పుకుంటే చాలు. అందుకోసం నిరంతరం కష్టపడుతున్నా నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరికే నా ప్రథమ ప్రాధాన్యత. సమస్యలు ఏవైనా ఉంటే కలిసి పరిష్కరించుకుందాం. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అందరూ తూచా తప్పకుండా పాటించాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మంగళగిరి ప్రజలు నన్ను గుండెల్లో పెటుకుని చూసుకున్నారు. 91వేల మెజార్టీతో గెలిపించారు.
















