చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్

మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో 372మందికి శాశ్వత పట్టాలు

by చైతన్యరధం
September 29, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
2029 ఎన్నికల్లోగా మంగళగిరిలో ప్రతి గడపకూ తాగునీటి కనెక్షన్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • భూగర్భ డ్రైనేజి, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్ కూడా పూర్తి చేస్తాం
  • వచ్చే ఏడాది వంద పడకల ఆసుపత్రి ప్రారంభిస్తాం
  • మంగళగిరి నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మొదలైంది
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి
  • మూడో విడత పట్టాల పంపిణీలో మంత్రి నారా లోకేష్
  • మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో 372మందికి శాశ్వత పట్టాలు

తాడేపల్లి (చైతన్య రథం): మంగళగిరిలో 2029 ఎన్నికలలోపు ప్రతి గడపకీ తాగునీటి కనెక్షన్, అండర్ గ్రౌండ్ గ్యాస్ కనెక్షన్, భూగర్భ డ్రైనేజీ పూర్తిచేసే బాధ్యత తీసుకుంటా. ఆనాడు ఇచ్చిన ప్రతి హామీకీ కట్టుబడి ఉన్నానని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తాడేపల్లి మండలం కుంచనపల్లి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్లో మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా మంత్రి లోకేష్ చేతుల మీదుగా 372మందికి శాశ్వత పట్టాలు, పిఎంఎవై మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రి ఇక్కడ ప్రజల దశాబ్దాల కల. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరూ ఊహించని రీతిలో రాష్ట్రంలోనే తొలిసారిగా ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో ఆసుపత్రి పనులు పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసే బాధ్యత మేం తీసుకుంటాం. మహానాడు కట్టకి రిటైనింగ్ వాల్, భూగర్భ డ్రైనేజి, తాగునీటి సమస్యకు శాశ్వతమైన పరిష్కారం కావాలని ఎన్నికల సమయంలో అడిగారు. వాటిని ప్రణాళికా బద్ధంగా చేపట్టి, పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

అత్యధిక మెజారిటీ నా బాధ్యత పెంచింది
“నేను మంగళగిరిలో పుట్టకపోయినా 2019లో మంగళగిరి నా సొంత ఊరుగా భావించి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీచేశా. ఇక్కడ ప్రజలను అర్ధం చేసుకునేలోపే ఎన్నికలు అయిపోయాయి. 5300 ఓట్ల తేడాతో నేను ఆనాడు ఓడిపోయా. ఆ ఓటమి నాలో కసి పెంచింది. ఐదేళ్లు కష్టపడి మీ మనసు గెలుచుకొని ఇక్కడనుంచే శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఎన్నికల ప్రచారంలో ఎన్ని ఓట్లతో నేను 2019లో ఓడిపోయానో, దానిపక్కన ఒక్క సున్నా పెట్టి ఆ మెజారిటీతో నన్ను గెలిపించాలని కోరా. మీరు నన్ను ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తే అంత బలం వస్తుంది. చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని ఆనాడు హామీ ఇచ్చా. మీ ఆశీస్సులతో ఆంధ్రరాష్ట్ర చరిత్రలోనే టాప్-3 మెజారిటీతో విజయం సాధించా. నేను 53వేల మెజారిటీ అడిగితే, 92వేల ఓట్ల ఆధిక్యతతో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించారు. మీరిచ్చిన మెజారిటీతో నా బాధ్యత పెరిగింది. ఆనాటి నుంచి అహర్నిశలు మంగళగిరి ప్రజల గురించే ఆలోచిస్తున్నా” అని లోకేష్ స్పష్టం చేశారు.

రూ.2వేల కోట్ల ఆస్తి పంపిణీ చేశాం
“2019 ఎన్నికల సమయంలో అనేకమంది నాయకులు మంగళగిరి ప్రజల ఇంటిపట్టాల సమస్యపై హామీ ఇవ్వాలని నన్ను కోరారు. ఆనాడు సమస్య అర్థం కాకపోవడంతో నేను హామీ ఇవ్వలేకపోయా. గత ఎన్నికల్లో గడపగడపకు వచ్చినపుడు దశాబ్దాలుగా ఇక్కడే జీవిస్తున్న వారితో మాట్లాడాక సమస్య అర్థమైంది. సొంత ఇల్లు ఒక ఎమోషన్. కుటుంబమంతా చెమటోడ్చి కష్టపడి ఇల్లు కట్టుకున్నారు. అధికారులు, రాజకీయ నాయకులు ఆ ఇల్లు మీది కాదు, రేపు మాపో ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ప్రతిక్షణం భయపెట్టే పరిస్థితి ఆనాడు ఉండేది. దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకే ఆనాడు నేను హామీ ఇచ్చాను. మూడోవిడత సుమారు 400 మందికి శాశ్వత పట్టాలు కల్పిస్తున్నది మీ కూటమి ప్రభుత్వం. బట్టలు పెట్టి పసుపు, కుంకుమలతో పట్టాలు ఇస్తానని ఆనాడు ఇచ్చిన హామీ ఈరోజు నిలబెట్టుకుంటున్నా. మొదటి విడతలో 3,002, ໐໕ 2,670, మూడోవిడతలో 388 పట్టాలు కలిపి మొత్తం సుమారు రూ.2వేల కోట్ల విలువ ఆస్తికి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించింది ప్రజాప్రభుత్వం” అని లోకేష్ ప్రకటించారు.

రాష్ట్రానికి దిక్సూచిగా మంగళగిరి మోడల్
“మంగళగిరిలో మొదటి పెట్టిన ప్రక్రియ ఈరోజు యావత్ రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. మంగళగిరిలో పట్టాల సమస్యను నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినపుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య ఎక్కడున్నా పరిష్కరించాల్సి ఉందని నాతో చెప్పారు. అధికారులు,
నాయకుల కనీసం ఒక్క గ్లాసు మంచినీరు కూడా తీసుకోకుండా ఇళ్లకు వెళ్లి  వివరాలు తీసుకున్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు మేమంతా ఒక పట్టుదల, కమిట్మెంట్ పనిచేస్తున్నాం. మంగళగిరిలో వేసిన పునాది ఆంధ్ర రాష్ట్రానికి దిక్సూచిగా మారింది. ఇటీవల విశాఖపట్నంలో 29వేల పట్టాలను ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించింది. త్వరలో విజయవాడలో కూడా మరో 24వేలమందికి అందించబోతోంది. ఇది గౌరవ ముఖ్యమంత్రికి పేదలపట్ల ఉన్న కమిట్మెంట్” అని స్పష్టం చేశారు. దేశంలోనే ఆదర్శంగా నిడమర్రు స్కూలు

“ఇంకో పక్కన విద్యాశాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చా. కానీ సొంత నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏదోకటి చేయాలన్న ఉద్దేశంతో నిడమర్రు స్కూలును భారతదేశంలో ఎక్కడాలేని విధంగా తీర్చిదిద్దటం జరిగింది. మొన్న మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళితే నిడమర్రు స్కూలులో వారి బిడ్డకు సీటు కావాలని నాతో గొడవపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం పోటీ మంగళగిరి నుంచే మొదలైంది. ఇది కేవలం ఒక నిడమర్రు స్కూలు కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఇదేవిధంగా తయారుచేయాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా. లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేస్తున్నాం. పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాం. సురక్షితమైన తాగునీరు అందించడానికి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశాం. గుడులు, చర్చిలు, మసీదులను కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేస్తోంది. స్మశానాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం” అని లోకేష్ వివరించారు.

ఎక్కువ హామీలు ఇవ్వను… ఇచ్చినవన్నీ నిలబెట్టుకుంటా
“నేను ఎక్కువ హామీలు ఇవ్వను. కానీ ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటా. డోర్ టు డోర్ కార్యక్రమం సమయంలో మీరు చెప్పిన సమస్యలన్నీ రాసుకున్నా. ప్రతిదీ నేను మానిటర్ చేస్తున్నా. పురోగతిపై ప్రతివారం సమీక్ష చేస్తున్నా. దాంట్లో భాగంగా ఇంటి పట్టాల కార్యక్రమం చేపట్టాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలున్నాయి. యుద్ధ ప్రాతిపదికగా చేయాల్సిన పనులన్నీ తొలుత చేపడుతున్నాం. భూగర్భ డ్రైనేజీ, పైప్లాన్ ద్వారా తాగునీరు, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్ ప్రక్రియ పూర్తయిన చోట వెంటనే రోడ్లు వేస్తామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేష్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, రూరల్ అధ్యక్షుడు దాసరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఉండవల్లి నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిశారు.

Next Post

టీడీపీలోకి వైసీపీ నేతలు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

November 28, 2026
టీడీపీ కార్యకర్తకు ఆర్ధిక సాయం
ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యకర్తకు ఆర్ధిక సాయం

November 28, 2026
నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి మంచి అవకాశం
ఆంధ్రప్రదేశ్

నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి మంచి అవకాశం

November 28, 2026
రాష్ట్రాభివృద్ధికి రూ.36 వేల కోట్ల పెట్టుబడులు..
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాభివృద్ధికి రూ.36 వేల కోట్ల పెట్టుబడులు..

November 28, 2026
మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

November 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-11-2026

November 27, 2026
Next Post
టీడీపీలోకి వైసీపీ నేతలు

టీడీపీలోకి వైసీపీ నేతలు

ముఖ్య వార్తలు

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

మహిళా సాధికారతకు రాజకీయ ప్రాతినిధ్యం కీలక

by చైతన్యరధం
November 28, 2026

డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు రెండు బిల్లులకూ అన్ని రాజకీయ పార్టీలు మద్దతివ్వాలి బిల్లులను వ్యతిరేకించిన వారిని మహిళలు తిరస్కరిస్తారు మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులకు సీఎం...

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలతో మెరుగైన ఆదాయార్జన

by చైతన్యరధం
November 26, 2026

గాడిలో పడుతున్న వ్యవస్థలు... 2027 మార్చి నాటికి 100శాతం ఫలితాలు సాధించేలా కృషి సావరిన్ ఏఐ స్టాక్ ద్వారా రెవెన్యూ రియలైజేషన్ ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

లాభసాటిగా పంటల సాగుకు కార్యాచరణ

by చైతన్యరధం
November 25, 2026

సీజన్‌కు ముందే యాక్షన్ ప్లాన్ సిద్ధం ఉద్యానరంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా హార్టికల్చర్ సమ్మిట్ నిర్వహణ వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు రైతుల ఆదాయం పెంచేలా...

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు

by చైతన్యరధం
November 6, 2026

1.43 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంట పొలాలు రాష్ట్రంలో తుఫాను నష్టంపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశం నేడు ముంపు...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 28-11-2026

by కార్యకర్త
November 28, 2026

టీడీపీ కార్యకర్తకు ఆర్ధిక సాయం

టీడీపీ కార్యకర్తకు ఆర్ధిక సాయం

by చైతన్యరధం
November 28, 2026

అమరావతి (చైతన్య రథం): కుప్పంలో ఎన్నికల అధికారి వాహనం ఢీకొని మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాజేంద్ర కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలిచారు. రాజేంద్ర మృతిపై...

నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి మంచి అవకాశం

నియోజకవర్గాల పునర్విభజన ఏపీకి మంచి అవకాశం

by చైతన్యరధం
November 28, 2026

అమరావతి (చైతన్య రథం): నియోజకవర్గాల పునర్విభజన ఆంధ్రప్రదేశకు మంచి అవకాశమని ముఖ్యమంత్రి చంద్రబాబు.. మంత్రుల వద్ద స్పష్టం చేశారు. ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే...

రాష్ట్రాభివృద్ధికి రూ.36 వేల కోట్ల పెట్టుబడులు..

రాష్ట్రాభివృద్ధికి రూ.36 వేల కోట్ల పెట్టుబడులు..

by చైతన్యరధం
November 28, 2026

పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం అమరావతి నిర్మాణాలకు భారీగా నిధులు విద్యుత్ రంగంలో కీలక నిర్ణయాలు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు 30 కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.