- హెచ్ఏఎం కింద రూ.43 కోట్లతో పనులు
- అమృత్ పథకాలతో తాగునీటి వ్యవస్థ బలోపేతం
- పురోగతిలో రూ.104.28 కోట్ల పనులు
- అనుమతుల దశలో మరో రూ.95 కోట్ల పనులు
- వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి(చైతన్యరథం): ధర్మవరం పట్టణ సమగ్ర అభివృద్ధి కి వివిధ పథకాల కింద మొత్తం రూ.242.28 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రహదారు లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కులు, వీధి దీపాలు తదితర మౌలికవసతులను మెరుగుపరిచి పట్టణ ప్రజలకు మెరుగై న సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతు న్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ మౌలికవసతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం కుప్పం నుంచి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచఏఎం) పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి హెచఏఎం కింద రూ.43 కోట్ల విలువైన పనులు కేటాయించామని చెప్పారు. రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపా ల అభివృద్ధితో పాటు పట్టణ మౌలికవసతులను మెరుగుపరిచేం దుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడించారు. ధర్మవరం పట్టణంలో ప్రస్తుతం రూ.104.28 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని, హెచఏఎం కింద రూ.43 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. యూఐడీఎఫ్-IV కింద రూ.72 కోట్లు, యూసీఎఫ్ ఫేజ్-II కింద రూ.23 కోట్ల పనులు పరిపాలనా అనుమతుల దశలో ఉన్నాయని వివరిం చారు. ధర్మవరం పురపాలక సంఘానికి హెచఏఎం కింద రూ.43 కోట్ల విలువైన పనులు కేటాయించామని తెలిపారు. ఈ నిధులతో రోడ్లు, డివైడర్లు, పార్కులు, వీధి దీపాల అభివృద్ధి పనులు చేపట్ట నున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ దశలో ఉన్నాయని వెల్లడించారు. అమృత్ 2.0 కింద రూ.31.73 కోట్ల విలువైన సమగ్ర తాగునీటి ప్రాజెక్టుకు అనుమతులు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో రోజుకు 10 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన నీటి శుద్ధి కేంద్రం, రాంనగర్, గిర్రాజు కాలనీ, శాంతినగర్ ప్రాంతాల్లో ఎలఎసఆర్ల నిర్మాణం, అవసరమైన పైప్లైన్ల ఏర్పాటు వంటి పనులు ఉన్నాయని చెప్పారు.














