- త్వరితగతిన పనులు ప్రారంభించేలా చర్యలు
- రిఫైనరీ సమీపంలో 1,500 ఎకరాల్లో
- పెట్రోకెమికల్స్ పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు
- బీపీసీఎల్ సీఎండీతో సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ చేపట్టనున్న గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ ప్రాజెక్టు పనులు త్వరిత గతిన ప్రారంభించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశా రు. రిఫైనరీ సమీపంలో పెట్రో కెమికల్ పార్కును కూడా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సీఎండీ సంజయ్ ఖన్నాతో సీఎం సమావేశమయ్యారు. ప్రకాశం- నెల్లూరు జిల్లాల మధ్య ఏర్పాటు కానున్న బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజె క్టు వ్యయం దాదాపు రూ.1.45 లక్షల కోట్లకు చేరిందని సంజయ్ ఖన్నా తెలిపారు. ఏడాదికి 9 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రాజెక్టుకు తుది పర్యావరణ అనుమతి సెప్టెం బరు చివరి నాటికి వచ్చే అవకాశం ఉందని సీఎంకు తెలిపారు. ఇంజినీరింగ్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన అధ్యయన నివేదిక వచ్చి న వెంటనే ఈ ఏడాది అక్టోబరు నెలలోనే తుది పెట్టుబడి వ్యయం ఖరారు అవుతుందని వివరించారు. ఆ తదుపరి రిఫైనరీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
పెట్రో కెమికల్ పార్కు ఏర్పాటుపై సూచన
ప్రాజెక్టులో భాగంగా రిఫైనరీ నుంచి యూరో-6 ప్రమాణాలతో కూడిన ఇంధనం ఉత్పత్తి అవుతుందని బీపీసీఎల్ సీఎండీ వివరిం చారు. మోటార్ స్పిరిట్, హైస్పీడ్ డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కలిపి సుమారు 5.4 మిలియన్ టన్నులు ఉత్పత్తి కాను న్నట్టు తెలియచేశారు. ఇతర పెట్రోకెమికల్స్ ఉత్పత్తులు సుమారు గా 3.2 మిలియన్ టన్నులు ఉంటుందన్నారు. ఉప ఉత్పత్తులుగా హెచ్ఎపీఈ, ఎల్డీపీఈ, ఎల్ఎల్డీపీఈ, పాలీ ప్రొపైలీన్, పాలీ వినైల్ క్లోరైడ్ వంటి బై ప్రోడక్ట్స్ కూడా వస్తాయని వివరించారు. బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణం కోసం అవసరమైన 6 వేల ఎకరాల భూమిలో 75 శాతాన్ని ఇప్పటికే అప్పగించామని సీఎం తెలిపారు. మిగిలిన భూమిని అక్టోబరు రెండో వారంలోగా అప్పగి స్తామన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని బీపీసీఎల్ ప్రతినిధులను కోరారు. రిఫైనరీ సమీపంలో సుమారు 1,500 ఎకరాల్లో డౌన్స్టీమ్ పెట్రోకెమికల్స్ పార్క్ ఏర్పాటుకు బీపీసీఎల్, ఏపీఐఐసీ కలిసి ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులు
భారత్లో పట్టణీకరణ, తయారీ రంగం విస్తరణతో పెట్రో కెమికల్స్క డిమాండ్ వేగంగా మారుతోందని సీఎం వివరించారు. దేశ పెట్రోకెమికల్ ఇంటెన్సిటీ ఇండెక్స్ ప్రస్తుతం 5 శాతం నుంచి వచ్చే దశాబ్దంలో 15-20 శాతానికి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రిఫైనరీని నిర్మించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ముడి చమురును కేవలం ఇంధనంగా వినియోగించకుండా ఇథలీన్, ప్రొపైలీన్ వంటి రసాయన ముడి పదార్థాల ఉత్పత్తిని పెంచే విధంగా ఆధునిక రిఫైనరీల రూపకల్పన జరగాలని సూచించారు. ప్రాథమిక పాలిమర్లకే పరిమితం కాకుండా అధునా తన మెటీరియల్ విభాగాల్లో పెరుగుతున్న డిమాండ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. దేశంలో కెమికల్, పెట్రోకెమికల్ రంగం 2040 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరు తుందని, ఆ అవసరాలను తీర్చే దిశగా బీపీసీఎల్ పనిచేస్తుందని సీఎండీ సంజయ్ ఖన్నా తెలిపారు. ఈ సమావేశంలో బీపీసీఎల్ డైరెక్టర్ ఫైనాన్స్ వీఆర్కే గుప్తా, ఏపీ రిఫైనరీ ఈడీ రాజీవ్, జీఎం రిటైల్ టి. చతుర్వేది, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.













