నర్సరావుపేట (చైతన్యరథం): పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండ దేవాలయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం సాయంత్రం సందర్శించారు. తొలుత ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్‌కు వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణకుంభస్వాగతం పలికారు. అనంతరం మంత్రి త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి లోకేష్‌ను ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి. చంద్రశేఖర్‌రావు, సూపరింటెండెంట్ సీహెచ్ శ్రీనివాసరావు, పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.















