- క్షేత్రస్థాయి బలోపేతమే లక్ష్యం
- నేడు పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతులు
- దిశానిర్దేశం చేయనున్న అధినేత చంద్రబాబు
- ఇప్పటివరకు విజయవంతంగా 50 బ్యాచ్‌లు
- ప్రత్యేక శిక్షణకు 7,109 మంది హాజరు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ వారిలో నూతనోత్సాహం నింపుతున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు ఆయన క్రమం తప్పకుండా హాజరవుతూ పార్టీ శ్రేణులకు ఆదర్శం గా నిలుస్తున్నారు. అదే సమయంలో పార్టీ శ్రేణులకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇస్తున్నారు. ఇప్పటివరకు 50 బ్యాచ్‌లకు విజయవంతంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులకు 14 బ్యాచ్‌లుగా ప్రత్యేక తరగతు లు చేపట్టి 1,533 మందికి శిక్షణ ఇచ్చారు. క్లస్టర్ ఇన్ఛార్జ్, కో ఇన్ఛార్జ్లకు 17 బ్యాచ్‌లుగా నిర్వహించి 2,775 సభ్యులకు పార్టీ విధివిధానాల గురించి శిక్షణ ఇచ్చారు.
యానిట్ ఇన్ఛార్జ్లకు ఇప్పటివరకు 19 బ్యాచ్‌లకు తరగతులు నిర్వహించగా 2,801 మంది సభ్యులు శిక్షణ తీసుకున్నారు. మొత్తంగా 50 బ్యాచ్‌లుగా నిర్వహించిన ఈ శిక్షణ తరగతుల్లో 7,109 మంది పాల్గొన్నారు. పార్టీ సీనియర్ నేతల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శిక్షణ శిబిరా ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. శిక్షణ తీసుకుంటున్న నేతలు, కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ వారితో నేరుగా సంభాషిస్తున్నారు. ఈ సందర్భంగా రాజకీయ, పరిపాలన అంశాలపై తన సుదీర్ఘ అనుభవాన్ని పంచుకుంటు న్నారు. గతానుభవాలు, ప్రస్తుత ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలను వారికి వివరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పథకాల అమలు తీరుపై కార్యకర్తల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ స్వీకరిస్తున్నారు. శుక్రవారం సైతం పార్టీ అధినేత ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు.














