- యువతను తక్కువ అంచనా వేయొద్దు
- ప్రామాణికతను, క్రియాశీల
- భాగస్వామ్యాన్ని వారు కోరుకుంటున్నారు
- రాజకీయ నాయకులు ఇగోను వీడి
- నిర్ణయాల్లో వారిని భాగం చేయాలి
- రాజకీయాలు, పరిపాలనలో జెన్జీలపై
- మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ముంబై: సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో యువతను క్రియాశీల భాగస్వాములుగా చేయాలని విద్య, ఐటీì, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. ముంబైలో బుధవారం జరిగిన ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల కార్యక్ర మంలో లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ రాజకీయాలు, పాలనలో జెన్జీ యువతను భాగ స్వామ్యం చేయడం ప్రాముఖ్యత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. యువతరంతో తన అనుభవాన్ని పంచుకుంటూ..తాను నేర్చుకున్న అతి పెద్ద పాఠం చాలా సులభమైనదని పేర్కొన్నారు. వారిని తక్కువ చేసి మాట్లాడవద్దు..వారిని మొత్తం అభివృద్ధి ప్రయాణం లో భాగం చేయాలని సూచించారు. జెన్జీ యువతతో తన అనుబంధం రాజకీయాలపై ప్రస్తుత ఉద్యమానికి చాలాముందే ప్రారంభమైందని పేర్కొన్నారు. మా ముఖ్యమంత్రి, ఒక మంత్రిగా నేను వారిని పలుమార్లు కలిశాము. మేము ఒక నియోజకవర్గానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లని కలుస్తూ ఉంటాం.
మేము ఇంకా బాగా ఎలా చేయగలమని మీరు అనుకుంటు న్నారు? ఈ నియోజకవర్గంలో మనం భిన్నంగా ఏమి చేయగల మని మీరు భావిస్తున్నారు? అని వారిని అడుగుతామని తెలిపారు. ఇటువంటి సంభాషణల నుంచి అద్భుతమైన ఆలోచనలు వస్తాయ ని, ముఖ్యంగా వారి సూచనలను అనుసరించడానికి తమ వద్ద ఒక వ్యవస్థ ఉందని తెలిపారు. మీకు ఎంతో అద్భుతమైన ఆలోచ నలు వస్తాయి..వాటిని మేము ఫాలో-అప్ చేసే విధానం ఉంది. కాబట్టి వారిని సంభాషణలో భాగం చేయండి.. అదే వారు కోరుకుంటున్న మొదటి విషయం అని నేను నమ్ముతున్నాను అని పేర్కొన్నారు. కొత్త తరం అంచనాలకు అనుగుణంగా రాజకీయ నాయకులు మారాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ..రాజకీయ నాయకులు తమ ఇగోలను వీడి ప్రామాణికతను అలవర్చుకోవడం చాలా ముఖ్యమని సూచించారు. రాజకీయ నాయకులుగా మనం మన బ్యారియర్స్ను వదిలేయడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఈ రోజుల్లో యువత మీతో చాలా భావోద్వేగ స్థాయిలో కలవడా నికి సిద్ధంగా ఉన్నారు. వారు మీ నుంచి ప్రామాణికతను ఆశిస్తు న్నారని తెలిపారు. ప్రామాణికత, పారదర్శకత భారతదేశంలో తదుపరి తరం రాజకీయ నాయకులకు నిర్వచించే లక్షణాలుగా ఉంటాయని అన్నారు. భారతదేశంలో తదుపరి తరం రాజకీయ నాయకుల నుంచి వారు ఆశిస్తున్నది అదేనని నేను నమ్ముతు న్నానని పేర్కొన్నారు.














