చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

మీ ఆరోగ్యం… మీ బాధ్యత

ఆస్పరి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు

by చైతన్యరధం
July 26, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మీ ఆరోగ్యం… మీ బాధ్యత
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సంజీవనిని సద్వినియోగం చేసుకోండి
  • ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా ఆగస్టు నుంచి సంజీవని
  • ప్రజా సంక్షేమం- అభివృద్ధి కూటమి ప్రభుత్వ బాధ్యత
  • గొడ్డలి పార్టీ నేతలు పగటి వేషగాళ్లు
  • ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు… ఒక్క పరిశ్రమా తేలేదు
  • ఆస్పరి బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు

ఆలూరు (చైతన్య రథం): ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని… ఆగస్టునుంచి రాష్ట్ర వ్యాప్తంగా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మీ ఆరోగ్యం… మీ చేతుల్లో ఉంటుందని… ప్రభుత్వం అందించే సంజీవని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న సంజీవని ప్రాజెక్ట్ ప్రత్యేకతలను సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… విద్య, వైద్యం మీదే ప్రతి కుటుంబం అత్యధికంగా ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును రూపొందించామని సీఎం తెలిపారు. ఆగస్టునుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి.. కుటుంబ సభ్యులందరికీ అభా హెల్త్ ఐడీలు జారీ చేస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంనుంచి రాష్ట్రస్థాయి వరకు మొత్తం ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తామని వివరించారు.

ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్.. ఇదే సంజీవని విధానం
ప్రజలు అనారోగ్యానికి గురైన తర్వాత చికిత్స ఇవ్వడమే కాదు.. వ్యాధులు రాకముందే గుర్తించడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అవసరమైనప్పుడు సమర్థవంతమైన వైద్యం అందించడమే సంజీవని లక్ష్యమని సీఎం చెప్పారు. రాష్ట్రంలో 80 లక్షలమంది తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నట్లు నివేదికలు వచ్చాయని.. అలాంటి పరిస్థితులను తగ్గించేందుకు ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు, మాతా శిశు ఆరోగ్యం, బాలల ఆరోగ్య పరీక్షలు, 108 అత్యవసర సేవలు, 104 మొబైల్ మెడికల్ యూనిట్లు, ఈ-ఔషధి, ల్యాబ్ సేవలను ఒకే డిజిటల్ వ్యవస్థలోకి తీసుకొస్తామని వెల్లడించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఏఐ ఆధారిత వైద్య సహాయం, టెలీమెడిసిన్, రిమోట్ కేర్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, డిజిటల్ నర్వ్ సెంటర్లను సంజీవనిలో భాగం చేస్తామన్నారు. సంజీవని సిటిజన్ వెల్నెస్ యాప్ ద్వారా ప్రజలు వైద్యుల అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవడంతోపాటు తమ ఆరోగ్య రికార్డులను ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వం కార్యక్రమాలు అమలు చేయడం ఒక్కటే సరిపోదని.. ప్రజల్లో కూడా ఆరోగ్య చైతన్యం పెరగాలని సీఎం సూచించారు. మంచి ఆహారం, యోగా, ధ్యానం, వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాటు చేసుకోవాలని సూచించారు. ఆరోగ్యవంతమైన కుటుంబం.. ఆరోగ్యవంతమైన గ్రామం.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

సంక్షేమం నుంచి సౌర విద్యుత్ వరకు.. ప్రతీ కుటుంబానికి అండగా ప్రభుత్వం
ప్రజారోగ్యంతోపాటు సంక్షేమానికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చెప్పారు. ప్రతి నెలా 1న పెన్షన్లు అందిస్తూ పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని.. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు రూ.20 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి మద్దతు, స్త్రీశక్తి ద్వారా మహిళల సాధికారత, దీపం-2.0 ద్వారా గ్యాస్ సబ్సిడీ, ప్రతి ఇంటికీ సౌర విద్యుత్పంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భూరికార్డుల్లో గందరగోళం సృష్టించి వివాదాలకు కారణమయ్యారని సీఎం విమర్శించారు. రీసర్వే ద్వారా అన్ని భూ రికార్డులను బ్లాక్చెన్ టెక్నాలజీతో భద్రపరుస్తున్నామని తెలిపారు.
ప్రతి నెలా 9న పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తూ ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నామని.. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేస్తామని వెల్లడించారు. 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. హీరో మోటార్స్, ఎల్ జీ, దాల్మియావంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని.. రూ.లక్ష కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను ఉద్యాన, పారిశ్రామిక  హబ్ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. కర్నూలు- బళ్లారి రైల్వే లైన్కు కేంద్రం ముందుకు రావడం
సంతోషకరమన్నారు.

వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తాం
ఎలినినో ప్రభావంతో వర్షాలు తగ్గిన నేపథ్యంలో రైతులు నీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జల ధార కార్యక్రమం ద్వారా భూగర్భజలాలు పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. వేదవతి ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మూడేళ్లలో 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఇరిగేషన్ క్యాలెండర్ రూపొందించామని తెలిపారు. కర్నూలు జిల్లాలో రూ.1,768 కోట్లతో వేదవతి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులకు పైసా ఖర్చు పెట్టలేదని.. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని సీఎం విమర్శించారు. ఒక్క ఎకరాకు కొత్తగా నీళ్లు ఇవ్వలేదని.. ఉద్యోగాలు కల్పించలేదని ఆరోపించారు. డ్రిప్ సబ్సిడీలు ఎత్తేసినవారే ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నం పెడుతుంటే గత పాలకులు సహించలేక పోయారని… గత పాలకులు రాష్ట్రంలో ప్రతీ వ్యవస్థను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. గొడ్డలి పార్టీ నేతలను.. వారు చేసే మోసపూరిత రాజకీయాలను విశ్వసించ వద్దని ముఖ్యమంత్రి కోరారు.

పరదాలు కట్టడం లేదు… చెట్లు నరకడం లేదు
సంజీవని కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ అనంతరం అదే వేదికనుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అధికార యంత్రాంగం పనితీరును సమీక్షించారు. మంచి పనితీరు కనపరిచిన అధికారులకు అభినందనలు తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పం తీసుకుని పనిచేస్తున్నామని క్షేత్రస్థాయి వరకూ అంతా సమర్ధంగా పనిచేసినప్పుడే ప్రజలకు మేలు చేయగలమని అన్నారు. ఇప్పటి వరకు తాను 50 బహిరంగ సభల్లో ఇదే విధంగా అధికారులు, ఉద్యోగుల పనితీరును ప్రజలకు వివరించానని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా అధికార యంత్రాంగంతో ముఖ్యమంత్రి గ్రూప్ ఫొటో దిగారు. కర్నూలు జిల్లాలోని స్వయం సహాయ సంఘాల మహిళలకు రూ.197 కోట్ల చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో వినతిపత్రాలు ఇచ్చేందుకు కొందరు ప్రయత్నించటంతో సభ ముగిసిన అనంతరం వాటిని తీసుకుంటానని సీఎం వారికి వివరించారు. తాను ప్రజలందరినీ కలుస్తానని.. గత పాలకుల లాగా పరదాలు కట్టుకుని తిరగటం లేదని, చెట్లను సరికించి సమావేశాలు పెట్టటం లేదని సీఎం వ్యాఖ్యానించారు. సీఎం అంటే సచివాలయంలో కూర్చునే చీఫ్ మినిస్టర్ మాత్రమే కాదని.. ప్రజల మధ్య ఉండే కామన్ మ్యాన్ అని చెప్పారు. అందుకే ప్రతి నెలా ప్రజల మధ్యకు వచ్చి వారి సమస్యలు తెలుసుకుంటూ… వాటికి పరిష్కారంగా ప్రజా విధానాలు రూపొందిస్తున్నామని సీఎం వెల్లడించారు. సమావేశంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు, స్థానిక కూటమి పార్టీల నేతలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 25-07-2026

Next Post

ఆస్పరి పీహెచ్ సి లో సంజీవని ప్రాజెక్టు పనితీరు పరిశీలన

మరిన్ని వార్తలు

పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం

November 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-11-2026

November 11, 2026
ఎంపీపీలు, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీలు, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ

November 11, 2026
పారిశ్రామిక ప్రగతికి క్యాబినెట్ బూస్ట్
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక ప్రగతికి క్యాబినెట్ బూస్ట్

November 11, 2026
‘మురసు’ తుఫాను ప్రాథమిక నష్టం రూ.1,918 కోట్లు
ఆంధ్రప్రదేశ్

భవిష్యత్‌పై దృష్టిపెట్టండి స్థానిక ఎన్నికల విజయంతో విర్రవీగొద్దు..

November 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-11-2026

November 10, 2026
Next Post
ఆస్పరి పీహెచ్ సి లో సంజీవని ప్రాజెక్టు పనితీరు పరిశీలన

ఆస్పరి పీహెచ్ సి లో సంజీవని ప్రాజెక్టు పనితీరు పరిశీలన

ముఖ్య వార్తలు

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

సామాజిక, ఆర్థిక భద్రతలో ఏపీ ఫ్రంట్ రన్నర్

by చైతన్యరధం
November 10, 2026

యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం తలసరి ఆదాయంలో 13వ స్థానం... అయినా అవకాశాల కల్పనలో రెండో స్థానం ఆదాయానికి మించి ప్రజలకు సేవలు, సౌకర్యాలు...

కూటమి ప్రభంజనం

కూటమి ప్రభంజనం

by చైతన్యరధం
November 10, 2026

స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభంజనం 58.9 శాతం ఓట్లతో ఘన విజయం (దీన్ని కూడా హైలెట్ చేసుకోవాలి) 2024 ఎన్నికలతో పోలిస్తే 3.6 శాతం పెరిగిన ఓట్ల...

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం

పెట్టుబడుల పండుగకు విశాఖ సిద్ధం

by చైతన్యరధం
November 11, 2026

12, 13వ తేదీల్లో సాగర తీరాన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్-2026 విశాఖకు ఒకరోజు ముందుగానే సీఎం... పలువురితో భేటీలు విదేశీ ప్రతినిధులు, పరిశ్రమల అధినేతలతో సమావేశం కానున్న...

చైతన్యరధం ఈ పేపర్ 11-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 11-11-2026

by కార్యకర్త
November 11, 2026

ఎంపీపీలు, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ

ఎంపీపీలు, జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ

by చైతన్యరధం
November 11, 2026

19న ఎంపీపీలు.. 20న జెడ్పీ చైర్‌పర్సన్ల ఎన్నికలు 659 మండల పరిషత్‌లు, 28 జిల్లా పరిషత్‌లలో పరోక్ష ఎన్నికలు తొలుత కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక..ఆ తర్వాత అధ్యక్ష,...

పారిశ్రామిక ప్రగతికి క్యాబినెట్ బూస్ట్

పారిశ్రామిక ప్రగతికి క్యాబినెట్ బూస్ట్

by చైతన్యరధం
November 11, 2026

30కి పైగా ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం రూ.31,387 కోట్లతో విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏవీజీసీ, రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీలకు గ్రీన్ సిగ్నల్ ఐటీ, ఏఐ,...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.