- రాష్ట్రానికి రూ.4,597 కోట్ల కేటాయింపు
- ప్రధాని, ఆర్థికమంత్రికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి పన్నుల వాటా కేటాయిం పుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా ప్రతి నెలా 10వ తేదీన విడుదలయ్యే పన్నుల వాటాతో పాటు అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటాను కేటాయించినందుకు ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభు త్వం చేసిన పన్నుల వాటా కేటాయింపుతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదనపు పన్నుల వాటా విడుదలతో రాష్ట్రంలో అభి వృద్ధి కార్యక్రమాల అమలు మరింత వేగవంతం అవుతాయని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి నిరంతరం అందిస్తున్న సహకారం రాష్ట్ర పురోగతికి ఎంతో దోహద పడుతోందని పేర్కొన్నారు.














