- గంటవానిపల్లి వద్ద ఫీడర్ కెనాల్ పరిశీలన
- అక్కడే సభ, నిర్వాసితులకు చెక్కుల పంపిణీ
పెద్దదోర్నాల(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 27న శనివారం దోర్నాల మండలం గంటవానిపల్లెకు రానున్నా రు. అక్కడే వెలిగొండ ఫీడర్ కెనాల్ పనుల పురోగతిని పరిశీలిం చనున్నారు. అనంతరం సభలో పాల్గొని ప్రాజెక్టు నిర్వాసితులకు ఆరఅండఆర్ పరిహారం చెక్కులను అందజేయనున్నారు. ఈ మేర కు ఆయన పర్యటన ఖరారైంది. దీంతో అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు. హెలిప్యాడ్ ప్రాంతం, వాహనాల పార్కింగ్, సభా ప్రాంగణం పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ విజయసునీత విలేకరులతో మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు కేటాయించిన రూ.905.56 కోట్లలో మొదటి విడత రూ.300 కోట్ల పరిహారం చెక్కులను అందజేసేందుకు సీఎం చంద్రబాబు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారని చెప్పారు. ఇప్పటి కే రూ.80 కోట్లు చెల్లించామని చెప్పారు. ఫీడర్ కెనాల్ పనులను కూడా సీఎం పరిశీలిస్తారని తెలిపారు. ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ సీఎం పర్యటనకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.















